గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 02, 2014

ఏపీభవన్ పంపకాల్లో గందరగోళం


-తెలంగాణ ఉద్యోగులు.. ఆంధ్రకు, ఆంధ్రవాళ్లు.. తెలంగాణకు 
-అసంతప్తిలో ఏపీభవన్ ఉద్యోగులు 
-ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కొన్ని గంటల ముందు ఎట్టకేలకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్‌లోని సాధారణ పరిపాలనా విభాగం ద్వారా ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 98 మంది ఉద్యోగుల్లో తెలంగాణ రాష్ట్రానికి 38 మందిని కేటాయించారు. తెలంగాణ ఉద్యోగులు 12మంది ఉండగా.. వారిలో ఇద్దరిని మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. మిగిలినవారిలో ఎక్కువ శాతం మంది ఆంధ్ర ప్రాంతానికి, మిగితావారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉద్యోగుల్లో పలువురు తెలంగాణ వారు ఉన్నారు. 

ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించకుండా.. అధికారులకు తీవ్ర గందరగోళానికి తెరతీశారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన అకౌంట్స్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, సహాయ రిసెప్షన్ అధికారులు ఉమారాణి, ప్రహ్లాద్ జోషి, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్ విభాగం) శ్యామల, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత కార్యదర్శులు వందన, దేవేందర్ సిబ్బంది సంగీత, రవిశంకర్ తదితరులను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేటాయించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారిక ఉత్సవాలు జరుపుకోడానికి ఇంకా ఉత్తర్వులు జారీకాలేదు. 

ప్రమోషన్ల కోసమే కుట్ర
ఏపీ భవన్ విభజనలో తెలంగాణ ఉద్యోగులకు తీరని నష్టం జరిగింది. కీలక శాఖలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కనున్నాయి. తెలంగాణకు కేటాయించిన పోస్టుల్లో డిప్యూటీ కమిషనర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అదనపు అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రోటోకాల్ ఆఫీసర్ లాంటి పోస్టులేవీ లేవు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే చెందుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 38 పోస్టుల్లో కేవలం రెండు (అసిస్టెంట్ కమిషనర్, లైజన్ ఆఫీసర్) మాత్రమే గెజిటెడ్ ర్యాంకు పోస్టులు. మిగిలిన 36 పోస్టుల్లో 12 నాన్-గెజిటెడ్ పోస్టులు కాగా 24 లాస్ట్ గ్రేడ్ పోస్టులు. ఈ విభజన పట్ల ఏపీ భవన్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కుట్రకు తెరతీశారని విమర్శిస్తున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను ఆంధ్రకు కేటాయించి.. అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న వ్యక్తిని తెలంగాణకు నిర్వహణాధికారిని చేయడంవల్ల మొత్తం అధికారాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేలా ఆంధ్ర అధికారులు పర్సనల్ డిపార్టుమెంటును తప్పుదారి పట్టించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Janmanthaa....annitikeee....edupena? Ee daridragottu edupu bathukulu bathukuthuuuuuuuuuu.......edusthuuu ilaage padi chaavandi. Meeku nishkruthi ledu. Daridragottu mohaallaaraa?...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

జన్మంతా దొపిడే...అన్ని విషయాల్లోనూ దోపిడే...! ఈ దరిద్రపుగొట్టు ఆంధ్రా అక్రమార్కుల దోపిడీ బతుకులకు అంతం...దగ్గరపడ్డది! దోపిడీదార్ల బతుకులు బట్టబయలుకానున్నాయి...దొంగేడుపులు ఇంకా నిజమైన ఏడుపులుగా మారే రోజు దగ్గరలోనే ఉన్నది! అప్పుడు తెలుస్తుంది ...ఎవడు ఎక్కడ పడి చస్తాడో...ఎవనికి నిష్కృతి ఉండదో...ఎవళ్ళవి దరిద్రపుగొట్టు మొహాలో?! ముందున్నది ముసుర్లపండుగ...! ఇక్కడ దోపిడికై వెధవవేషాలు వేయడానికి కుదరదు...ఇక్కడ మా పాలకులున్నారు...అసలైన పాలకులు...! కుక్కకు బొక్కవేసి పనులు చక్కబెట్టుకున్నట్టుకాదు! ఇప్పుడు తెలుస్తుంది...లాబీయింగులతో తెలంగాణులను మోసగించి ఉద్యోగాలు కొల్లగొట్టడానికి మీకు నూకలు చెల్లాయి! ఖబర్దార్...మమ్మల్ని తిడుతూ...శాపనార్థాలు పెడుతూ...మా బ్లాగుల్లోకి వస్తే మర్యాద దక్కదు! ఏనుగులు పోతుంటే కుక్కలు మొరిగినట్టు మొరగడం దుర్జనుల లక్షణం...మేం దోపిడీ చేస్తాం...మమ్మల్ని వేలెత్తి చూపించకండి...అనడం...దగాకోర్ల లక్షణం! ఉన్నది ఉన్నట్టంటే ఊళ్ళో ఉండవద్దు...అన్నాట్ట వెనకటికి నీలాంటివాడు! దోపిడీని మేం ఎత్తిచూపుతాం...దమ్ముంటే..దోచుకోకుండా...ఇప్పటివరకు దోచుకున్నదంతా కక్కండి...నీతిమంతులైతే...! దొంగను దొంగ అనవద్దంటే...ఇలా ఏడుపుగొట్టు వెధవమాటలు మాట్లాడితేనే తెలుస్తూంది...ఇంకా దోచుకోడానికి ఏమీ మిగలనివ్వట్లేదు అని ఏడుస్తున్నారని! పైగా మమ్మల్బి ఏడుస్తున్నారనడం...దరిద్రపుగొట్టుమొహాలనడం...ఇవన్నీ తెలంగాణుల్ని దోచుకున్న సీమాంధ్ర అక్రమార్కులకూ...వాళ్ళను వెనకేసుకొచ్చేవాళ్ళకూ వర్తిస్తాయి! సూర్యునిపై ఉమ్మివేస్తే ఎవరిమొహంపై పడుతుంది? దోచుకున్నవాడు...దోపిడీకి గురైనవానిపై ఏడిస్తే...వాడు దొర అవుతాడా? మమ్మల్ని తిట్టడానికి సిగ్గుశరం ఉండాలి...ఇంకా ఏం మొహం పెట్టుకుని మా బ్లాగుల్లోకి వస్తున్నారో?

కామెంట్‌ను పోస్ట్ చేయండి