గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 18, 2014

ఆంధ్రా విద్యార్థుల ఫీజులు తెలంగాణ ఎందుకు ఇవ్వాలి?

exams

-ఉద్యోగం కోసం వచ్చినవారి పిల్లలు లోకలా?
-మనం తెలంగాణ జీవోలు ఇచ్చుకుందాం!
-ఫీజులు చెల్లింపుపై సర్కారు యోచన
స్థానికతపై గందరగోళం సృష్టించి తెలంగాణ ఉద్యోగాలు, విద్యావకాశాలు కొట్టేసిన సీమాంధ్రుల పిల్లలకు తెలంగాణ రాష్ట్రంలో బోధనా ఫీజులు చెల్లించకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. సీమాంధ్ర ఉద్యోగుల పిల్లలు, సెటిలర్స్ పిల్లలకు మనమెందుకు ఫీజులు చెల్లించాలనే కోణంలో ఆలోచిస్తున్నది. సోమవారం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వం నియమించిన అఖిలపక్ష సమావేశంలో విద్యార్థుల స్థానికతపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణలో చదువుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న సీమాంధ్ర విద్యార్థుల సంఖ్య, అలాగే సీమాంధ్రలో చదువుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న తెలంగాణ విద్యార్థుల వివరాలను అధికారులు వివరించారు. తెలంగాణ సీమాంధ్ర విద్యార్థులు 39 వేల మంది ఉండగా సీమాంధ్రలో తెలంగాణ విద్యార్థులు 18 వేలు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. సీమాంధ్రలో తెలంగాణ విద్యార్థులు 18వేల మంది లేరని, ఇవి తప్పుడు లెక్కలని ప్రభుత్వం పేర్కొంది. దీంతో అధికారులు ఈ లెక్కలు నిజమేనని ప్రభుత్వానికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. కానీ అధికారుల లెక్కల్లో తక్కువ చూపారని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి కారణం విద్యార్థుల స్థానికతను గుర్తించటంలో తేడా రావటమేనని నిర్ణయానికి వచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవోల ప్రకారం నాలుగేళ్లు తెలంగాణలో చదివితే తెలంగాణలో లోకల్‌గా మారిపోతారు...అని అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలను మనమెందుకు అమలు చేయాలని సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. మన రాష్ట్రంలో కొత్తగా జీవోలు తెచ్చుకుందామని తెలిపినట్లు తెలిసింది.

ప్రభుత్వ ఉద్యోగాలకు, అడ్మిషన్లకు స్థానికత వేరు వేరుగా ఉంది. వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో 85శాతం స్థానిక విద్యార్థులకు, 15 శాతం ఓపెన్ మెరిట్ కోటాలో అడ్మిషన్లు నిర్వహిస్తారు. నాన్‌లోకల్ విద్యార్థులు 15శాతంలోనే పోటీ పడాల్సి ఉంటుంది. విద్యార్థులు నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ విద్యార్థి ఆ జిల్లా లోకల్ విద్యార్థి అవుతారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 4 నుంచి 10 తరగతుల వరకు నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో స్థానికుడిగా గుర్తిస్తారు. అయితే ఇవి ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు. నాలుగేళ్లు తెలంగాణలో చదివినంత మాత్రాన సీమాంధ్రులు తెలంగాణ వారు ఎలా అవుతారు? ఇంకా పాత ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు అమలు చేస్తే స్వచ్ఛమైన తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం ఎలా జరగుతుందనే పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే పాత జీవోలను అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి