-ఫర్నిచర్ పంపకంలోనూ వివక్షే-శివాజీ
-ఏపీ సివిల్ సీఈని ఘోరావ్ చేసిన తెలంగాణ ఉద్యోగులు
సీమాంధ్ర ఉన్నతాధికారులు కుట్రలతో తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యుత్‌సౌధ భవనాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) అధ్యక్షుడు శివాజీ ఆరోపించారు. విద్యుత్ సంస్థల్లో భవనాల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ టీఈఈఏ ఆధ్వర్వంలో విద్యుత్‌సౌధ ముందు గురువారం ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర ప్రభుత్వ కార్యాలయాలకు వేరే ప్రాంతంలో వసతులు కల్పించాలని రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ప్రభుత్వం మే 30న విడుదల చేసిన జీవో 207లో స్పష్టంగా ఉందని శివాజీ పేర్కొన్నారు. సీమాంధ్ర అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యుత్‌సౌధను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉన్న చాంబర్లను సీమాంధ్రకు కేటాయిస్తూ తెలంగాణ వారి కోసమని మరమ్మతులు చేపట్టడం దారుణమన్నారు. తెలంగాణ భవనాన్ని సీమాంధ్ర అధికారితో రూ. 26 లక్షల అంచనాలతో మరమ్మతులు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భవన మరమ్మతులు చేపడుతున్న సివిల్ ఇంజనీర్ శ్రీనివాస్‌రావును తెలంగాణ ఉద్యోగులు ఘోరావ్ చేశారు. ఇందులో తన ప్రమేయం లేదని చెప్పగా, ఆయనను తీసుకుని ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్‌ను ఘోరావ్ చేశారు. -ఏపీ సివిల్ సీఈని ఘోరావ్ చేసిన తెలంగాణ ఉద్యోగులు
తన ప్రమేయం కూడా ఏమీలేదని తప్పించుకోవడానికి విజయానంద్ ప్రయత్నం చేశారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పనులు ఆపేసి సీమాంధ్ర కార్యాలయాలను బీ బ్లాక్‌కు లేదా ఎర్రగడ్డకు తరలించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ వారికి చిన్న చిన్న గదులు కేటాయించి సీమాంధ్రులకు విశాలమైన గదులను కేటాయించారని, వారి ఆగడాలను ఇంకా సహించే ప్రసక్తి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వారికి కంప్యూటర్స్ , ఇతర ఫర్నిచర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర అధికారులు మొండికేస్తే దాడులు చేయక తప్పదని, వారిని తరిమికొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల ప్రతినిధులు రాజేశ్వర్‌రావు, రవి, తిరుపతయ్య, భద్రయ్య, చంద్రయ్య, యూసుఫ్‌తదితరులు పాల్గొన్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి