-తెరవెనుక మళ్ళీ ఆంధ్రా కుట్రల వ్యూహం
-అటువైపు మొగ్గి తెలంగాణపై కేంద్రం వివక్ష
-రోజుకు 15 లక్షల యూనిట్లు (1.2 ఎంయూ) లోటు

తెలంగాణ సమాజం అనుమానించినట్లుగానే జరుగుతున్నది. కేంద్రంలో తాము మద్దతిచ్చిన ప్రభుత్వమే ఉన్నందున ఏమైనా చేయొచ్చనే ఆంధ్రా బాబుల కుట్రలు, కుయుక్తులు కొనసాగుతున్నవి. ఆంధ్రా సర్కారు వంకర బుద్ధి మానడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపు మొగ్గు చూపుతున్నది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) కోటాలో మార్పులు ఇందుకు తాజా ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నిన వ్యూహాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో సీజీఎస్ విద్యుత్ కోటాల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫలితంగా తెలంగాణ రోజుకు 15 లక్షల యూనిట్ల విద్యుత్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆంధ్రా సర్కారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆంధ్రా సర్కారు తెరచాటుగా సీజీఎస్ కోటాను పెంచుకోగలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సీజీఎస్ కోటాల కేటాయింపుల్లో చిన్న పొరపాటు జరిగిందనే నెపంతో తెలంగాణ సీజీఎస్ కోటాను కుదించేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ ప్లానింగ్ డివిజన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ అందింది. వాస్తవానికి సీజీఎస్ విద్యుత్ కోటాలను తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం చొప్పున కేంద్రం కేటాయింపులు జరిపింది. జూన్ 2వ తేదీ నుంచి ఈ కోటాలను కేంద్రం అమలుచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన కేంద్రానికి రాసిన లేఖతో పాటు రాజకీయ ఒత్తిళ్ల ఫలితంగా ఆంధ్రా సర్కారు అదనంగా 1.77 శాతం సీజీఎస్ కోటాను పెంచుకోగలిగింది. అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 46.11 శాతం వాటా కాస్తా 47.88 శాతానికి పెరిగింది. దీంతో తెలంగాణకు ఉన్న సీజీఎస్ 53.89 శాతం వాటా కాస్తా 52.12 శాతానికి తగ్గిపోయింది. ఫలితంగా తెలంగాణ రాష్ర్టానికి సరాసరిగా 60 మెగావాట్ల నుంచి 70 మెగావాట్ల మేరకు సీజీఎస్ కోటాలో కోతలు ఏర్పడతాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి