గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 21, 2014

హైదరాబాద్ కోర్టు పరిధి పై అభ్యంతరం


-హైదరాబాద్ కోర్టు పరిధిలోకి ఏపీ రాదని న్యాయవాది వాదన
-వివరణ ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
-న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంపైనా స్పష్టత ఇవ్వాలని సూచన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న హైకోర్టు ఆఫ్ జ్యుడికేటర్ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్ హైకోర్టు) విచారణ పరిధిపై హైకోర్టులో అభ్యంతరం వ్యక్తమైంది. హైదరాబాద్ హైకోర్టు విచారణ పరిధిపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోం, న్యాయశాఖలను హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవ్యవస్థీకరణ చట్టంలోని నాల్గో చాప్టర్‌లో సెక్షన్ 40 సబ్‌సెక్షన్1లో పేర్కొన విధంగా ప్రకటిత తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిపై హైకోర్టు ఎట్ హైదరాబాద్‌కు విచారణాధికారం లేదనే అంశంపై స్పష్టతనివ్వాలని శుక్రవారం జస్టిస్ నర్సింహరెడ్డి నేతత్వంలోని ధర్మానసం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అనంతరపురం జిల్లా భూవ్యవహారం కేసులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది.. హైకోర్టు ఎట్ హైదరాబాద్ విచారణ పరిధిపై అభ్యంతరాలు లేవనెత్తారు. సెక్షన్ 30(1)లో ప్రకటించిన తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిపై హైదరాబాద్ హైకోర్టును నో జ్యురిడిక్షన్ (విచారణాధికారం లేదు)గా పేర్కొనడంతో విచారణాధికారంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. 

ఆర్టికల్ 214 ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అపాయింటెడ్ డే నుంచి ఆర్టికల్ 231 ప్రకారం ఉమ్మడి హైకోర్టు (హైదరాబాద్ హైకోర్టు)గా రూపాంతరం చెందితే జడ్జిల ప్రమాణస్వీకారంపై తలెత్తుతున్న అభ్యంతరాలకు స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అపాయింటెడ్ డే తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరు "ది హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్"గా పేరు మారింది. హైకోర్టు పేరు మారినా న్యాయమూర్తులు మళ్లీ ప్రమాణస్వీకారం చేయకుండానే విధులు నిర్వర్తించడంపై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీనిపై స్పష్టతనివ్వాలని ధర్మాసనం కేంద్రా న్ని ఆదేశించింది. సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్‌ను అమికస్ క్యూరీ( కోర్టు సహయకుడు)గా వ్యవహరించాలని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంలో జరిపిన ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలను తమకు సీల్డ్ కవర్లో అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ, న్యాయశాఖ) తమ వివరణను ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 27 వ తేదీకి వాయిదా వేసింది.


-హైకోర్టునూ విభజించండి
-న్యాయశాఖ మంత్రికి టీ లాయర్ల జేఏసీ విజ్ఞప్తి
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టునూ విభజించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. జేఏసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి,న్యాయవాది జ్యోతికిరణ్ ఢిల్లీలో శుక్రవారం న్యాయశాఖ మంత్రిని శుక్రవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, సచివాలయం సహా అనేక విభాగాలు ఏ రాష్ట్రానికా రాష్ట్రంగా పని చేస్తున్నాయని, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వెంటనే విడిగా హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేశామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ అయితే వెంటనే విభజన చేయడానికి అభ్యంతరం లేదంటూ స్పష్టం చేశారని చెప్పారు వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయశాఖ మంత్రి ఈ ప్రక్రియ ఏ దశలో ఉందో తన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంత్)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి