గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 05, 2014

తెలంగాణకు సీమాంధ్ర ఉద్యోగులా..?


-స్వరాష్ట్రం ఏర్పడిన రోజే అక్రమంగా బదిలీలు
-నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ వాణిజ్య పన్నుల ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయానికి సీమాంధ్రకు చెందిన 20 మంది ఉద్యోగులను అక్రమంగా బదిలీ చేయడంపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల కేంద్ర సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నిబంధనలకు తుంగలో తొక్కుతూ ఈనెల 2న వీరికి హైదరాబాద్‌లోని నాంపల్లి హెచ్‌ఓడీలో పోస్టింగులు ఇవ్వడాన్ని ఆ సంఘం అధ్యక్షుడు బీ శ్యాం సారథ్యంలో ఉద్యోగులు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియాను కలిసి సీమాంధ్ర ఉద్యోగుల జాబితాను అందజేసింది.
adilabad
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరుణంలో సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణలో ఎందుకు పోస్టింగులు ఇచ్చారంటూ ఉద్యోగులు సమారియాను ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల సెంట్రల్ సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు, ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు, హైదరాబాద్ రూరల్ డివిజన్ అధ్యక్షుడు కిషన్‌ప్రసాద్, నాయకులు హరిప్రసాద్, నరేందర్ గౌడ్, ఎం శ్రీనివాస్, దేవులపల్లి శ్రీనివాస్, పోగుల ప్రసాద్, జే శ్రీనివాస్, పీ వెంకటేశ్ పాల్గొన్నారు. తొలుత తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమారియాకు అభినందనలు తెలియజేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి