గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 12, 2014

ఆంధ్రా సూపరింటెండెంట్ గో బ్యాక్!

-వరంగల్ సెంట్రల్ జైల్లో వార్డర్ల ఆందోళన
-ఆంధ్రా అధికారి వేధిస్తున్నాడని ఆరోపణ
-సూపరింటెండెంట్‌పై చర్యకు డిమాండ్
వరంగల్ సెంట్రల్ జైలులో ఆంధ్రా అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న అతడిని తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. జైలు సూపరింటెండెంట్ రాజేశ్ స్థానిక చీఫ్ హెడ్ వార్డర్ శక్రునాయక్, వార్డర్ నరేశ్ పట్ల దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించాడని ఆరోపణలు రావడంతో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. సూపరింటెండెంట్ రాజేశ్ అకారణంగా వార్డర్లు, అధికారుల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని బాధితులు జైలు ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. ఆంధ్రా అధికారి జులుం నశించాలి అని ఉద్యోగులు నినాదాలు చేశారు.
police

ఖైదీలు, వార్డర్ల పట్ల కూడా సూపరింటెండెంట్ రాజేశ్ చులకనగా వ్యవహరిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొంతమంది అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు నరేశ్, శక్రునాయక్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడికి యత్నించారని, అతనిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వార్డర్లు డిమాండ్‌చేశారు. విషయం తెలుసుకున్న మట్వాడ సీఐ అలీ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి