-చెప్పాపెట్టకుండా ఓవర్ డ్రాయల్
-ఆంధ్రా సర్కార్ పవర్ గేమ్స్
- ఫ్రీకెన్సీ పడిపోయి గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం
-రంగంలోకి దిగిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ
-ఈనెల 24న బెంగళూరులో అత్యవసర భేటీ
కేంద్రం తమ జేబులో ఉందన్న ధీమాతో ఆంధ్రా సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే తెలంగాణతో పవర్ గేమ్ ప్రారంభించారు. ఇక దక్షిణాది గ్రిడ్ వంతు వచ్చింది. కోటాను మించి విద్యుత్ తీసేసుకుంటూ దక్షిణాది గ్రిడ్‌తో ఆంధ్ర సర్కార్ ఆటలాడుతున్నది. దీన్ని కనిపెట్టిన గ్రిడ్ అధికారులు తీవ్రంగా పరిగణించి ఈ నెల 24న బెంగళూరులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ విద్యుత్ శాఖ శుక్రవారం బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) కళ్ళకు గంతలు కట్టి ఎక్కువ విద్యుత్‌ను డ్రా చేస్తూ గ్రిడ్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే రీతిలో వ్యవహరించింది. ఓవర్‌డ్రాయల్ వల్ల గ్రిడ్ ఫ్రీక్వెన్సీలో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) అప్రమత్తమైంది.-ఆంధ్రా సర్కార్ పవర్ గేమ్స్
- ఫ్రీకెన్సీ పడిపోయి గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం
-రంగంలోకి దిగిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ
-ఈనెల 24న బెంగళూరులో అత్యవసర భేటీ
ఏపీజెన్‌కో విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఎస్‌ఆర్‌ఎల్‌డీసికి ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ సమాచారం లేకపోవడంతో బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) గ్రిడ్ నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కోసం ఏపీఎస్‌ఎల్‌డీసీ ఓవర్‌డ్రాయల్‌కు పాల్పడడంతో అదికాస్తా గ్రిడ్ ఫ్రీక్వెన్సీపై ప్రభావాన్ని చూపింది. దాంతో దక్షిణాది రాష్ర్టాల మధ్య పవర్ ట్రాన్స్‌మిషన్‌లో తేడాలు చోటుచేసుకున్నాయి. బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కారణాల అన్వేషణ కోసం సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్ (స్కాడా)ను ఆశ్రయించింది. ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఓవర్ డ్రాయల్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించుకుని ప్రతి 15 నిమిషాలకోసారి ఏపీజెన్‌కో పవర్ ప్లాంట్ల జనరేషన్‌ను అంచనాలు వేసుకుంటూ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ కుప్పకూలకుండా చూసింది. ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఓవర్ డ్రాయల్ వివరాలను ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ రికార్డుచేసి ఓవర్ డ్రాయల్ పెనాల్టీ ఛార్జీలను చెల్లించాలంటూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రతి పదిహేను నిమిషాలకోసారి నోటీసులను పంపిచింది. అయితే నోటీసులకు ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ స్పందించలేదు.
దక్షిణాదికే ప్రమాదం..
బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అప్రమత్తం కాకపోయి ఉంటే ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్వాకం వల్ల దక్షణభారతదేశం మొత్తం చీకట్లు కమ్ముకునేది. గతంలో ఉత్తరాది రాష్ర్టాల్లో పవర్ గ్రిడ్ కుప్పకూలి రోజుల తరబడి గాడాంధకారం అలుముకున్న విషయం తెలిసిందే. పవర్‌గ్రిడ్ ఫెల్యూయర్‌పై అద్యయనం చేసి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అన్ని రాష్ర్టాలకు సమగ్ర నివేదిక ఇచ్చింది. రాష్ర్టాలకు విధిగా పాటించాల్సిన నియమనిబంధనల ఆదేశాలు జారీచేసింది.
24న ఎస్‌ఆర్‌పీసీ అత్యవసర బేటీ
ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ సిస్టెమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(పోసోకో) ఆదేశాలను పట్టించుకోకపోవడం, పైగా ఓవర్ డ్రాయల్‌కు పాల్పడుతూ పెనాల్టీ ఛార్జీల నోటీసులకు స్పందించకపోవడాన్ని కేంద్ర విద్యుత్‌రంగ సంస్థలు శుక్రవారం తీవ్రంగా తీసుకున్నాయి. పవర్ సిస్టెమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(పోసోకో) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఆర్ రఘురాం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంను ప్రధాన అంశంగా పేర్కొంటూ శుక్రవారం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. లేఖ అందిన మరుక్షణమే నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరిస్థితి తీవ్రతను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఇఏ) దష్టికి తీసుకువచ్చారు. దాంతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఇఏ)కి సంబంధించిన బెంగళూరులోని సదరన్ రీజనల్ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) ఇన్‌చార్జి మెంబర్ సెక్రెటరీ ఎస్‌ఆర్ భట్ ఈనెల 24న ఉదయం పదకొండు గంటలకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేస్తూ చీఫ్ ఇంజనీర్, తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీ, ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎల్‌డీసీలకు లేఖలు రాశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి