గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 24, 2014

పీపీఏల వివాదం కొలిక్కివచ్చేనా ?

- నేడు బెంగళూరులో ఎస్‌ఆర్పీసీ కీలక భేటీ
- హాజరు కానున్న ఇరు రాష్ర్టాల ప్రతినిధులు 

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆజ్యం పోసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు వివాదం ఇప్పట్లో కొలిక్కివచ్చేట్లు కనిపించటంలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అగ్గి రాజేసిన ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్‌ఆర్పీసీ) మంగళవారం బెంగళూరులో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవహారాలు ఎస్‌ఆర్పీసీ పరిధిలో ఉండటంతో కేంద్ర ఇంధనశాఖ అదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో తమతమ వాదనలకు కట్టుబడి ఉండాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించటంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశాలుకనిపించటంలేదు.

ఎస్‌ఆర్పీసీకి నిర్ణయాధికారం లేకపోవటంతో మంగళవారం నాటి సమావేశ వివరాలను ఢిల్లీలోని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్డీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు, కేంద్ర ఇంధనశాఖకు నివేదించే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్‌ఎల్డీసీ) చీఫ్ ఇంజినీర్ సాయిరాం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటున్నది. ఏపీ జెన్‌కోతో పీపీఏలపై సంతకాలు చేసిన తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(గతంలో సెంట్రల్ పవర్ డిస్కమ్) డైరెక్టర్ రఘుమారెడ్డి నేతృత్వంలో మరో బృందం కూడా సమావేశానికి హాజరు కానున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి