గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 17, 2014

జైళ్లశాఖలో సీమాంధ్ర అధికారుల జులుం

-కిందిస్థాయి సిబ్బందిపై వరంగల్ జైలు సూపరింటెండెంట్ భౌతికదాడులు
-అయినా చర్యలు తీసుకోని వరంగల్ రేంజ్ డీఐజీ
-సీఎం, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యోగుల సంఘం నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా జైళ్లశాఖలో సీమాంధ్ర అధికారుల జులుం తగ్గడం లేదు. తెలంగాణకి చెందిన కిందిస్థాయి ఉద్యోగులను అకారణంగా సస్పెండ్ చేస్తుండటంతోపాటు నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతూ, చేయిచేసుకొంటూ వేధిస్తున్నారు. ఇక, ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారుల్లో కూడా ఎక్కువమంది సీమాంధ్రకి చెందినవారే ఉండటంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. వరంగల్ జైలు సూపరింటెండెంట్ రాజేశ్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం.
Wrngl"

రాయలసీమకి చెందిన రాజేశ్ ప్రస్తుతం వరంగల్ జైలు సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటి నుంచే తెలంగాణకి చెందిన ఉద్యోగులపై ఆయన దాష్టీకం కొనసాగిస్తున్నారు. ఆరు నెలలక్రితం భాస్కర్ అనే హోంగార్డుపై చేయిచేసుకున్నాడు.

ఈ కలకలం సద్దుమణగక ముందే మరో ఉద్యోగి ఎంఎన్‌వో సుమన్‌ను అందరూ చూస్తుండగానే కొట్టాడు. ఇది జరిగిన నెలరోజులకే స్వీపర్ కరీంపై చేయి చేసుకున్నాడు. ఇక, రాజేశ్ బూతుపురాణానికి అడ్డూ అదుపు ఉండదు. 36 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్‌వార్డర్ భిక్షపతిని, చీఫ్‌హెడ్‌వార్డర్ శత్రునాయక్‌ను...సిబ్బంది, ఖైదీలు అంతా చూస్తుండగానే గుడ్డలూడదీసి కొడతానంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. తాజాగా ఈనెల 9న వార్డర్ నరేశ్‍పై చేయి చేసుకున్నాడు. దాంతో రాజేశ్ వైఖరిపై కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసి వరంగల్ రేంజ్ డీఐజీ కేశవనాయుడు వరంగల్ జైలుకు వచ్చారు. ఆ సమయంలో రాజేశ్ తన కార్యాలయంలో లేరు. దాంతో రాజేశ్ ఇంటికి వెళ్లిన డీఐజీ కేశవనాయుడు కొద్దిసేపు మాట్లాడి అటునుంచి అటే వెళ్లిపోయారు. రాజేశ్ చేతిలో దెబ్బలు తిన్న వార్డర్ నరేశ్‌తోగానీ, ఇతర ఉద్యోగులతోగానీ డీఐజీ మాట్లాడకపోవటం గమనార్హం. ఇద్దరూ రాయలసీమకి చెందినవారు కావటం వల్లనే రాజేశ్ ఆగడాలను డీఐజీ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు.

రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగినా డీఐజీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వార్డర్ నరేశ్, ఛీఫ్ హెడ్ వార్డర్ శత్రునాయక్ వరంగల్ పట్టణంలోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో జైలు సూపరింటెండెంట్ రాజేశ్‌పై ఫిర్యాదు చేశారు. నరేశ్‌పై చేయి చేసుకున్న అనంతరం సెలవులో వెళ్లిన రాజేశ్ ఇటీవల తిరిగి విధుల్లో చేరి ఆ వెంటనే ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలంటూ శత్రునాయక్, నరేశ్‌లపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆయన ఒత్తిడి భరించలేక నరేశ్ సెలవుపై వెళ్లిపోయాడు. శత్రునాయక్‌ను రాజేశ్ తన జీపులో స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడు. ఇంతచేసిన రాజేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని డీఐజీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసిన సిబ్బందిని ఆయన తన కార్యాలయానికి పిలిపించి అందరికీ మెమోలు జారీ చేయటం గమనార్హం.

కిందిస్థాయి ఉద్యోగులను మాత్రం..

వరంగల్ జైలు సూపరింటెండెంట్ ఇంత చేస్తున్నా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న డీఐజీ కేశవనాయుడు కిందిస్థాయి సిబ్బందిపై ఏవైనా ఆరోపణలు వస్తే మాత్రం కనీసవిచారణ కూడా జరపకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన జనగామ సబ్ జైల్లో వార్డర్‌గా ఉన్న జగన్‌ను సస్పెండ్ చేశారు. తాను చెప్పిన మాట వినటం లేదంటూ జైలు నిర్వహణాధికారి ఫిర్యాదు చేసిన వెంటనే ఎలాంటి విచారణ లేకుండానే జగన్‌ను డీఐజీ విధుల్లో నుంచి తప్పించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జగన్ రాష్ట్రపతి పతకగ్రహీత కూడా.

సీఎం, హోంమంత్రి దృష్టికి..

వరంగల్ జైలు సూపరింటెండెంట్ రాజేశ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతుండడంతో జరిగిన సంఘటనలను సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రిజన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి అన్ని ఆధారాలతో రాజేశ్ దాష్టీకాలపై ఫిర్యాదు చేయనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి