గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 02, 2014

అటవీశాఖలో సీమాంధ్రుల పెత్తనం...!


అడవిలోన ఉండమరగి
నట్టి ఆంధ్ర జంతువులను
అటవీశాఖలొ కొనసా
గించక డిప్యుటెషనేల?

అటవీ శాఖను ఉద్యో
గమ్ముల పొందియును వారు
డిప్యుటేషనుల పేరిట
ఇతరశాఖలకు వెళ్ళిరి!

తెలగాణుల ఉద్యోగాల్
కొల్లగొనియు వెలగబెట్టు
నిర్వాకము విడచిపెట్టి
ఇతరశాఖలకు వెళ్ళిరి!

ఆంధ్రనుండి డిప్యుటేష
నులపైనను వచ్చినట్టి
వారలు సైతము ఇందున
ఉండకుండ ఇతర మనిరి!

రెండురాష్ట్రముల విభజన
ఉద్యోగుల విభజనతో
ముడివడియుండిన కతమున
ప్రాంతీయతె శరణ్యమ్ము!

అట్లుకాక జనాభాను
ప్రాతిపదికగాను గొనిన
తెలగాణకు నష్టమగును
గాన ఇటుల వలదయ్యా"!

అక్రమమ్ముగా తెలగా
ణుల ఉద్యోగమ్ములన్ని
సీమాంధ్రులు గొనిరి కాన
ఆంధ్రులు ఆంధ్రకె పోవలె!

తెలంగాణ ఉద్యోగాల్
తెలంగాణులకె ఉండిన
న్యాయమగును గాన వేగ
ఇటుల చేయదగునయ్యా!

అరువదైదు శాతమున్న
సీమాంధ్రుల నాంధ్రలోకె
పంపించినచో న్యాయము
తెలగాణులు పొందెదరయ!

ఏ రాష్ట్రపు ఉద్యోగులు
ఆ రాష్ట్రమునందె యుండ
కష్టనష్టములు ఏవియు
రాకుండా ఉండునయ్య!

ఆంధ్రవారు తెలగాణను
ఉద్యోగాల్ నెఱపుటకై
యోచించిన చెల్లదయ్య!
ఆంధ్రకె పోవలయునయ్య!!

ఎన్ని కుట్రలను చేసిన,
ఎన్ని వేషములు వేసిన
దిమ్మతిరుగునట్లు తెలం
గాణులు బదులిత్తురయ్య!

విభజన అధికారులిపుడు
జోన్‍ల వారిగా ఉద్యో
గాలలోన అక్రమముగ
నెవరుండిరొ కనెపెట్టుడు!

అక్రమార్కులను ఏరియు
స్వస్థలాలకంపి, తెలం
గాణులందఱిని ఆ ఉ
ద్యోగమ్ముల నియమింపుడు!

సీమాంధ్రుల పైరవీలు
తిప్పికొట్టుడోయయ్యా!
వారి దొంగ నాటకాల
నణగద్రొక్కుడోయయ్యా!!

***     ***     ***     ***

ఇదే అంశంపై మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి