గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 22, 2014

టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో తెలంగాణవారే ఉండాలి!

-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకానున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో తెలంగాణ ఉద్యోగులను మాత్రమే నియమించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు డిప్యూటేషన్‌పై వచ్చి ఇక్కడ పని చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల ఇప్పటికే తెలంగాణ యువకులు చాలా నష్టపోయారని ఆరోపించారు.

ఏ రాష్ట్ర ఉద్యోగులు, ఆ రాష్ట్రంలోనే పని చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్‌రూంకు అందిన సమాచారం ప్రకారం సీమాంధ్ర ఉద్యోగులు 30,799 మంది తెలంగాణలో పని చేస్తున్నారని, సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కేవలం 4,036 మందేనని వివరించారు. ఈ మెయిల్ ద్వారా 11,498, వెబ్‌సైట్ ద్వారా 11,790 ఫిర్యాదులు అందాయని, 128 మంది స్వయంగా ఆఫీసుకు వచ్చి తెలంగాణలో తిష్ఠవేసిన సీమాంధ్ర ఉద్యోగులపై ఫిర్యాదులు చేశారని తెలిపారు. 450 తప్పుడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామన్నారు. సీఎం కలిసిన వారిలో ఏ సత్యనారాయణ, జీ విష్ణువర్ధన్‌రావు, కృష్ణయాదవ్ తదితరులున్నారు

తెలంగాణ పీఎస్‌సీలో సీమాంధ్రులు?

కొత్తగా ఏర్పరచనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ)లో సీమాంధ్ర ఉద్యోగులను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రయత్నాలను నిరోధించాలని కోరుతూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మకు విజ్ఞాపన సమర్పించారు. సెక్రటేరియట్ తెలంగాణ అధికారుల సంఘం టీ రాజ్‌కుమార్‌గుప్తా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం బీ కృష్ణయాదవ్, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ తదితరులు సీఎస్‌ను కలిశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి