-హఫీజ్‌పేట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అక్రమాలపై సీరియస్
-ఆగమేఘాల మీద పరిశ్రమల శాఖ సమావేశాలు
-వివరాల సేకరణలో అధికారులు తలమునకలు
రూ. 600 కోట్ల విలువైన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న సీమాంధ్ర అనకొండలపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర చేసింది. లీజు భూములను ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్న వైనంపై మండిపడింది. తక్షణమే ఈ విషయమై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించింది. హఫీజ్‌పేటలోని మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో లీజు స్థలాలను సీమాంధ్ర బడాబాబులు అక్రమంగా ఆక్రమించుకున్న వైనంపై "హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర అనకొండలు" అనే కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.-ఆగమేఘాల మీద పరిశ్రమల శాఖ సమావేశాలు
-వివరాల సేకరణలో అధికారులు తలమునకలు
రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్, పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ మల్లేశం సోమవారం బాలానగర్ ఇండస్ట్రియల్ విభాగం కార్యాలయంలో పరిశ్రమల శాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. హఫీజ్‌పేట మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కబ్జా వ్యవహారంపై అధికారులను ఆరా తీశారు. లీజు గడువు పూర్తయినా స్థలాలను ఎందుకు స్వాధీనపరుచుకోలేదని నిలదీశారు. ఇక్కడ కొనసాగుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై, సదరు భూమి ప్రస్తుత స్థితిగతులపై వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఆ పనిలో అధికార యంత్రాంగం ఉరకలు పరుగులు పెట్టింది. 24 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ కమిషనర్‌కు నివేదికను అందజేయనున్నట్టు పరిశ్రమల శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ తెలిపారు. ఎస్టేట్‌లో ఉన్న పరిశ్రమలు, వాటి లీజులు తదితర సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశాలిచ్చామని ఆయన చెప్పారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..
సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూములన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం మినహాయింపులు లేకుండా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) శేరిలింగంపల్లి శాఖ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైతే ఉన్నత స్థాయి అధికారులతో, శాసనసభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి భూములను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
లీజు మాటున కోట్ల విలువ చేసే భూమిని కబ్జా పెట్టిన అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర భూ పరిరక్షణ విభాగం కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర భూ బకాసురులపై ఉక్కు పాదం మోపాలని టీఆర్‌ఎస్ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి కోరారు. అక్రమార్కులకు సహకరించిన సీమాంధ్ర అధికారులను కూడా వదిలి పెట్టవద్దని ఆయన సూచించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులపై తెలంగాణ ప్రభుత్వమైనా స్పందించాలని సీపీఎం శేరిలింగంపల్లి కార్యదర్శి సీ శోభన్ డిమాండ్ చేశారు. భాను టౌన్‌షిప్‌కు వేసిన దారి, వోల్వో సర్వీసింగ్ సెంటర్, కున్ సర్వీసింగ్ సెంటర్, తేజ పవర్ కంట్రోల్స్ భూములు అక్రమంగా పొందినవని స్వయంగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ స్థాయి అధికారే ఆర్‌టీఐ కింద సమాచారమిచ్చారని తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి