- సాగులేకున్నా.. ఆ పేరుతో బంగారం రుణాలు
- ఆంధ్రలో వ్యవసాయం.. తెలంగాణలో లోన్లు
- రైతుల రుణాల్లో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు
- ఇలాంటి వారికి మాఫీ వర్తించదన్న అధికారులు
రైతుల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నకొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రుణమాఫీ కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీచేసింది. వాటి ప్రకారం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్న కొద్దీ లొసుగులు వెలుగు చూస్తున్నాయి.- ఆంధ్రలో వ్యవసాయం.. తెలంగాణలో లోన్లు
- రైతుల రుణాల్లో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు
- ఇలాంటి వారికి మాఫీ వర్తించదన్న అధికారులు
కొంతమంది పట్టణాల్లో నివసించేవారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేయకున్నా, వ్యవసాయ భూమిని చూపించి బంగారం తనఖా పెట్టి పంట రుణాలు తీసుకున్నారని, వాటిని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైందని సమాచారం. మరికొందరు తెలంగాణ సరిహద్దుల్లోని ఆంధ్ర జిల్లాల్లో వ్యవసాయం చేసేవారు తమ వ్యవసాయ భూమిని చూపి తెలంగాణలో బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇటువంటి వారికి రుణమాఫీ వర్తించబోదని అధికారులు చెప్తున్నారు. పక్కాగా వ్యవసాయం చేస్తూ, వ్యవసాయం కోసమే బ్యాంకుల్లో బంగారం తనఖాపెట్టి రుణం తీసుకున్న రైతులకు మాత్రం రుణ మాఫీని ప్రభుత్వం అమలు చేయనుంది. పాత రుణం చెల్లించకుంటే బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వవని ఆందోళనచెందిన కొందరు రైతులు నిర్ణీత గడువులో రుణాలు చెల్లించినట్లయితే, సదరు రైతుల ఖాతాల్లోకే నేరుగా ప్రభుత్వం నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఉన్నట్టు బ్యాంకులకు చూపి రుణాలు పొందిన వారు 10%-12% ఉంటారని అధికారుల అంచనా. అదే విధంగా.. ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నట్లు చూపి తెలంగాణలోని ఏ జిల్లాలో రుణం తీసుకున్నా వారికి కూడా రుణమాఫీని అమలు చేసేదిలేదని అధికారులు అంటున్నారు. ఆంధ్రలో భూమి ఉండి తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌వంటిచోట్ల రుణాలు తీసుకున్న వారు కూడా 10%-15% ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయ భూమి ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా ఆధారాలను చూపి ఇతర ప్రాంత బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో రెండు రాష్ర్టాలు ఏర్పడటంతో ఏ రాష్ట్ర రైతుల రుణాలు ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఆంధ్ర రైతులు రుణాలు తీసుకుంటే దానిని భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి ఉదంతాలపై కూడా రెవెన్యూ, బ్యాంకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి, బ్యాంకుల ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి