గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 11, 2014

విద్యా వ్యవస్థలు విడిగా ఉంటేనే మంచిది

-రాష్ట్రం విడిపోయినా ఉమ్మడి అడ్మిషన్లు సరికాదు
-బిల్లులో అసాధ్యమైన అంశాలు చాలా ఉన్నాయి
- ఫీజు రీ యింబర్స్‌మెంట్‌పై కేబినెట్‌లో నిర్ణయిస్తాం
-ఉన్నత విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
Minister-Jagadish-reddy
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో సాధ్యం కాని అంశాలు చాలా ఉన్నాయి. పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు నిర్వహించటం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా నష్టపోతారు. ఎవరి విద్యా వ్యవస్థలు వారికి ఉంటేనే చాలా మంచిది అని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తూ చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడి అడ్మిషన్లు కల్పించటం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు సేవలందించే ఉన్నత విద్యా మండలితో సహా అన్ని విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీశ్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు, జేఎన్‌టీయూహెచ్ వీసీ రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ

వచ్చే ఐదేళ్లకల్లా తెలంగాణ రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యారంగంలో చాలా సమస్యలున్నాయని, వాటిని అధిగమించి ఉన్నత, సాంకేతిక విద్యలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయం డీ బ్లాక్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెద్ద బాధ్యత పెట్టారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తెస్తానని తెలిపారు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి