గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
నా తెలంగాణ... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా తెలంగాణ... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, మే 03, 2016

వేరుపడినా... తీరుమారదా...!


gatikaపాలమూరు తెలంగాణకు ఎంత అవసరమైన ప్రాజెక్టో అందరికీ తెలుసు. కానీ రైతుల భవిష్యత్ కన్నా, తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకునే వాళ్లు పాల(మూరు)ల్లో విషం చుక్కలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాకు నీళ్లొచ్చాయనే ఆనందంతో హంద్రీనీవా భగీరథ విజయయాత్ర పేరుతో నాలుగేళ్ల క్రితం అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నిర్వహించిన పాదయాత్రకు కేబినెట్ మంత్రిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డీకే అరుణ హారతులిచ్చి దీవెనలందించారు. అనంతపురం కూడా పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లానే, రైతులెవరైనా రైతులేనని, తాను అందుకే వెళ్లానని నాటి తన చర్యను సమర్థించుకున్నారు. ఇప్పుడు తాజా సన్నివేశం పరిశీలిస్తే.. డీకె అరుణ సొంత జిల్లా అయిన పాలమూరు రైతులకు నీళ్లివ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది. దీన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి గట్టిగా వ్యతిరేకించి ధర్నాకు దిగారు. ఎంత తేడా? ఎలాంటి అనుమతులు లేకుండా, ఎగువ రాష్ర్టాలకు సమాచారం అందివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమను పూర్తి చేసుకున్నది. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతగా తప్పుబట్టలేదు. సముద్రంలోకి పోయేకన్న ఎవరో ఒకరు వాడుకుంటే రైతులకే కదా మేలు జరిగేది అని నిండు అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. గతేడాది నాగార్జునసాగర్ నీళ్లను వాడుకునే విషయంలో కూడా రెండు రాష్ర్టాల మధ్య లొల్లి పుట్టింది. అప్పుడు కూడా కేసీఆర్ పట్టింపునకు పోకుండా, టీఎంసీల లెక్కలు చూసుకోకుండా రైతులెవరైనా రైతులే అనే విశాల దృక్పథంతో సాగర్ ఆయకట్టు రైతుల కోసం సాగునీరు విడుదల చేశారు. 


కేసీఆర్ ఇంత ఉదారంగా వ్యవహరిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనస్తత్వం మాత్రం రోజురోజకు మరుగుజ్జుదవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కరువును చూసి చలించి దత్తత తీసుకుంటునట్లు బాబు ప్రకటించారు. పాలమూరు దారిద్య్రాన్ని పారదోలే వరకు నిద్రపోనని మనవి చేసుకున్నారు. కానీ ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరు కోసం ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు జిల్లాను సస్యశామలం చేయడం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే చంద్రబాబు ఉత్తర తెలంగాణకు నీళ్లిస్తానని నమ్మబలికి దేవాదులకు పునాదిరాయి వేశారు. కానీ ఆయన పదవిలో ఉండగా రూపాయి పని జరగలేదు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఎకరానికి నీరివ్వలేదు. 


గత పాలకులు హామీలిచ్చి, నమ్మబలికి వదిలేసిన ప్రాజెక్టులను కేసీఆర్ పట్టుదలతో పూర్తి చేయడానికి నిర్ణయించారు. దీన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. ఉత్తర తెలంగాణకు నీళ్లిచ్చే కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన రోజే ఏకంగా ఏపీ కేబినెట్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం వారి రాక్షస మనస్తత్వాన్ని కూడా బయటపెట్టింది. ఇక వైఎస్సార్సీపీది మరో డ్రామా. జగన్ కూడా పాలమూరుకు నీళ్లివ్వడమే పాపమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. శ్రీశైలం దగ్గర ఆగిన నీళ్లను తెలంగాణ వాడుకుంటే మరి పోతిరెడ్డి పాడుకు నీళ్లెట్ల ఎక్కుతయని ప్రశ్నిస్తున్నడు. అక్రమంగా కట్టుకున్న పోతిరెడ్డిపాడు కోసం పాలమూరు రైతులు నష్టపోవాలని స్పష్టంగానే చెపుతున్నాడు. 


రాష్ట్ర విభజన జరగక ముందు తెలంగాణపై విషం కక్కి అక్కడ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన పార్టీలు నేటికీ అదే పంథా కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయగలిగితే అది ఆంధ్ర ప్రజలకు లాభం చేసిపెట్టడంతో సమానమనే సంకుచిత భావజాలంతో అక్కడి పార్టీలున్నాయి. చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి.. ఈ ముగ్గురు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనలోని అంతరార్థం ఒక్కటే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అన్ని జెండాలు ఒక్కటై తెలంగాణాను అడ్డుకోగలిగినట్టే (తాత్కాలికంగానైనా) కృష్ణాపై కట్టే ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నదే వారి ఉమ్మడి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఆంధ్రా నాయకుల్లో, పార్టీల్లో ఏక రూపత చూస్తే తెలంగాణ పార్టీలకు లేనిదేమిటో అర్థమవుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్ర పార్టీలు ప్రత్యక్షంగానే వ్యతిరేకిస్తుంటే, తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీలు ఎలాగైనా పాలమూరు పథకాన్ని ఆపాలని దొడ్డి దారిన ప్రయత్నిస్తున్నాయి. 


అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ పార్టీలు పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించడానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజాప్రయోజనం కనిపించడం లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రజనం ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని కేంద్రం వైపో లేక తెలంగాణ వైపో మళ్లించాలనే వ్యూహంలో చంద్రబాబున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణను అడ్డుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనను అధికార పీఠంపై కూర్చోబెట్టాయని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే మళ్లీ తెలంగాణ వ్యతిరేకతను ఎజెండాగా మార్చుకోవాలని చూస్తున్నారు. జగన్ కూడా ఇంచుమించు అదే పద్ధతిని అవలంబిస్తున్నాడు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా నీళ్ల దోపిడీ సాధ్యం కాదనీ తెలుసు. కాబట్టే పోతిరెడ్డిపాడును గుర్తు చేస్తున్నారు. 


తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు రాయలసీమకు మళ్లించాడు, ఈ పని చంద్రబాబు చేయలేకపోతున్నాడని జగన్ ఆంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారు. విభజనకు కారకుడు జగనే అని చంద్రబాబు అప్పుడు విపరీత ప్రచారం చేసి ఆంధ్రలో లబ్ధి పొందారు. ఇప్పుడు అదే అస్ర్తాన్ని చంద్రబాబుపై జగన్ ప్రయోగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా జనంలో పోయిన ఆదరణను కొద్దో గొప్పో నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ప్రత్యేక హోదా రాకపోవడంతో పాటు, చంద్రబాబు వైఫల్యాలను ఎండకట్టే పనిలో కాంగ్రెస్ ఉన్న ది. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తవుతాయనే విషయంలో ఆంధ్ర పార్టీలకు ఏకాభిప్రాయం ఉంది. కానీ పూర్తయ్యే పాలమూరు విషయాన్ని రాద్ధాంతం చేసే విషయంలో ఎవరెన్ని మార్కులు సాధించుకుంటారనే విషయంపైనే ఆంధ్రలో పోటీ నడుస్తున్నది. ఇక తెలంగాణలో కూడా అంతే. 


పాలమూరు, కాళేశ్వరం, డిండి పూర్తయితే ప్రజలు కేసీఆర్‌కు జేజేలు పలుకుతారు. ఎంత వ్యతిరేకత ఉన్నా పాలమూరు, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటిదాకా ఆదరిస్తూ వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో సగం సీట్లు ఈ జిల్లాలవే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే జనం కాంగ్రెస్‌ను మరిచిపోతారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే పాలమూరు ఆగిపోవాలని, కనీసం జాప్యం కావాలని కోరుకుంటున్నారు. పాలమూరు ఎంత అవసరమైన ప్రాజెక్టో అందరికీ తెలుసు. కానీ రైతుల భవిష్యత్ కన్నా, తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకునే వాళ్లు పాల(మూరు)ల్లో విషం చుక్కలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, ఏప్రిల్ 28, 2016

ఇక్కడ కల్తీ "గుట్టు రట్టు" చేయబడును!

 -ప్రయోగశాలకు నెలవుగా హైదరాబాద్ నగరం 
-అత్యాధునిక పరిజ్ఞానంతో సేవలు

కల్తీ ఆహారపు గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్ నగరంలో అనేక ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ల్యాబ్‌లు కల్తీని ఛటుక్కున పట్టేస్తాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి సేవలందిస్తున్నాయి. 

lab



ప్రభుత్వరంగంలో సైతం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని నాచారంలో నెలకొల్పారు. ఈ ల్యాబ్ తెలంగాణతోపాటు ఏపీకి కూడా సేవలందిస్తున్నది. ప్రైవేట్‌రంగంలో సైతం పలు ప్రయోగశాలలు ఎన్‌ఏబీఎల్ అక్రిడేషన్ పొంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలెర్జీ, కెమికల్, కలుషిత, పోషకాహార పరీక్షలను వీటిల్లో చేస్తారు. ఆహారంతోపాటు, నీళ్లు, పాలు, మాంసం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు తదితర ఆహార పదార్థాల నాణ్యతను ఈ ల్యాబ్‌లు పరీక్షిస్తాయి. ఇవీ నగరంలోని ప్రధాన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు.. వాటి చిరునామానాలు!! 

స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ
ఐడీఏ నాచారం, హైదరాబాద్, 
ఫోన్: 040-2715 2207

నేషనల్ కొల్లేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్
4-7-18/6బీ, రాఘవేంద్రనగర్, నాచారం, 
హైదరాబాద్, ఫోన్: 040-44858686, 
మ్బైల్ నంబర్లు : 9347782508, 9347782507. 
ఈ-మెయిల్: QUALITY@NCMSL.COM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్
నారాయణగూడ, హైదరాబాద్, 
ఫోన్: 040 -27560191, 27557716

విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్
లైఫ్ సైన్సెస్ ఫెసిలిటీ, 5, 
ఆలెగ్జాండ్రియా నాలెడ్జ్ పార్క్, 
జినోమ్ వ్యాలీ, హైదరాబాద్. 
ఈ-మెయిల్: VIMTAHQ@VIMTA.COM

భగవతి అనా ల్యాబ్స్ లిమిటెడ్ బీ పద్మప్రియ, డైరెక్టర్
ప్లాట్ నం 7-2-C7 /8/F, 
సనత్‌నగర్ పారిశ్రామికవాడ, 
హైదరాబాద్.
ఫోన్:040 23811535, 23811545, 23810505. 
ఈ-మెయిల్: BALLCENTRALLAB@GMAIL.COM

వసుధా ఎన్విరో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్
5-9-285/3, రెండో అంతస్తు, 
గాంధీనగర్, కూకట్‌పల్లి,
హైదరాబాద్, 500072. 
ఫోన్: 040-33089894, 
040-42009193.

ల్యూసిడ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్
B-1/A, ఫేజ్ -2, టెక్నో ఇండస్ట్రీయల్ ఎస్టేట్, 
వైఎస్సార్ బిల్డింగ్, బాలానగర్, హైదరాబాద్-500037.ఫోన్: 23720678
మ్బైల్ నంబర్లు: 9848161463, 9391101467, 9848163346.

విజన్ ల్యాబ్స్
H NO 16-11-23/37/A, ప్లాట్ నం: 205, రెండో అంతస్తు, సాగర్ హోటల్ బిల్డింగ్, ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా, మూసారాంబాగ్, మలక్‌పేట. ఫోన్:040-24544320. 
మొబైల్ నంబర్లు: 9849110019, 9440841338. 

కేర్ ల్యాబ్స్
ప్లాట్ నం : 1, సాయి సదన్ కాంప్లెక్స్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన,
శివగంగ కాలనీ, ఎల్బీనగర్. 
ఫోన్: 040-32416241. మొబైల్ ఫోన్లు: 9885436529, 9885436528.


మంగళవారం, ఏప్రిల్ 26, 2016

సామాజిక రాజనీతి శాస్త్రవేత్త

నాడు ఉద్యమ నాయకుడిగా, నేడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశంలో నూతన చరిత్రను సృష్టిస్తున్నారు. గాంధీ జీవిత చరిత్రను వ్యూహాత్మక కార్యక్రమాలను లోతుగా అధ్యయనం చేసి సమకాలీన సమాజానికి, ఉద్యమాలకు అన్వయించిన పద్ధతి కనబడుతున్నది. దాంతోపాటు రాంమనోహర్ లోహియా చేసిన ఆందోళన, నినాదాలు, కార్యక్రమాలు ప్రజలను సమీకరించిన తీరు కూడా కేసీఆర్ నైపుణ్యంలో కనబడుతుంది. అంబేద్కర్ ఎలాగైతే ఆయా సమస్యల గురించి సైద్ధాంతికంగా, లోతుగా చర్చించి, విశ్లేషించి వ్యతిరేకులను కూడా ఒప్పించిన విధంగా కేసీఆర్ ప్రసంగాలు, నినాదాలు ముందుకు తీసుకువచ్చే సమస్యలు, పరిష్కార సూచికలు కనబడుతుంటాయి. సర్దార్ వల్లభాయిపటేల్ వలె దృఢ దీక్షతో ముందుకుసాగడం, ఎప్పుడు ఎక్కడ ఆగాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో అనే అంశాల్లో వల్లభాయి పటేల్, గాంధీజీ ఇద్దరినీ సమంగా అర్థం చేసుకొనే తీరు కేసీఆర్‌లో కనబడుతుంది. ఒక సామాజిక శాస్త్రవేత్తగా, రాజనీతి శాస్త్రవేత్తగా కేసీఆర్ ఎంత లోతైన అధ్యయనం చేస్తాడో చాలామందికి తెలియదు. రాజకీయ ప్రసంగాలను చూసి అంచనావేయడం కొలనులోని తామర, కలువ పూలను చూసి దాని లోతు గురించి మాట్లాడినట్లు ఉంటుంది. 

టీఆర్‌స్ ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశంలో బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా కృషిచేసిన కేసీఆర్ క్షేత్రస్థాయి నుంచి జాతీయస్థాయి దాక నేతలను, ప్రజలను సమీకరించారు. జాతీయ రాజకీయాల్లో కాన్షీరాం నిర్వహించిన పాత్రను ఆదర్శంగా తీసుకొని అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్రసాధనకు కదిలించడం గొప్పది. ఎక్కడ మంచి ఉన్నా అవన్నీ స్వీకరించి ఒక సమగ్ర దృక్పథాన్ని అలవర్చుకొని సామాజిక శాస్త్రవేత్తగా ఎదిగిన రాజనీతి శాస్త్రవేత్త కేసీఆర్. 


సాహితీవేత్తగా కేసీఆర్ చేసిన అధ్యయనం సామాజిక, రాజకీయ ఉద్యమంలో ఆయన ఉపయోగించుకున్న తీరు అపూర్వం. పీవీనరసింహారావు, వాజపేయి సాహితీవేత్తలు అయినప్పటికీ వారి సాహితీ పటిమ రాజకీయాల్లోకి అన్వయించడం సాధించలేకపోయారు. కానీ కేసీఆర్ తన సాహిత్య పటిమతో ప్రసంగాలు చేయడం గానీ, ప్రజల్ని ఉత్తేజపరచి ముందుకు నడపడం గానీ గొప్ప సాహితీవేత్త కావడం వల్లే సాధ్యపడింది. ఆచార్య కే.జయశంకర్, కాళోజీ వంటి వారి అడుగుజాడల్లో ప్రజల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు నడిచిన కేసీఆర్ ఒకనాటి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ గారిని తలపిస్తారు. ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు రెండూ ఒకటి కాదు. రాజకీయ నాయకుడు ఉద్యమ నాయకుడిగా నిలిచి గెలవడం అంత సులభం కాదు. కేసీఆర్ ఈ రెండింటినీ సవ్యసాచిలా నడిపిస్తూ నెహ్రూ వలె రాజకీయ అధికారం కూడా చేపట్టి పది నెలల్లోనే తనదైన పాలనా ముద్ర వేశారు. 

రాష్ట్ర సాధన కోసం అనేక శ్రేణులు, వర్గాలు ఉద్యమించాయి. వాటి స్ఫూర్తిని ఒకచోటికి తీసుకురావడంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనది. ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులు, విద్యార్థులు, యువకులు, మహిళలు తదితర శ్రేణు లు ఎన్నో సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్‌కు పోటీగా ఎంతోమంది రాజకీయ నాయకులు ముందుకు రావాలని, ఆయన్ని వెనక్కి నెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారే వెల్లికిలా పడిపోయారు. వాళ్లు కేవలం రాజకీయ నాయకులు కావడమో, అల్ప లక్ష్యాలు కలిగి ఉండటమో, ఉద్యమకారులుగా మాత్రమే ఆలోచించడమో, దీర్ఘకాలిక దృష్టిలేకుండా ఆవేశకావేశాలకు లోనుకావడమో, స్వార్థానికి లొంగిపోవడమో జరగడంవల్ల ప్రతిదశలో పదులకొద్ది నాయకులు వెనకబడిపోయారు. అనామకంగా మిగిలిపోయారు. ఇదంతా నడుస్తున్న చరిత్ర. 


vakulabaranamరాజనీతి శాస్త్రవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా కేసీఆర్ రాష్ర్టాన్ని ఎలా సాధించాలో అందుకు ఎన్నిరకాల మార్గాలున్నాయో అధ్యయనం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతదాకా సాగిన ఉద్యమాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడటానికి చేసిన ఉద్యమాలు, అసోం, ఈశాన్య రాష్ర్టాల్లో సాగిన, సాగుతున్న ఉద్యమాలను అనేక కోణాల్లో అధ్యయనం చేసి, మన సమాజానికి ఏమేరకు స్వీకరించవచ్చో చర్చలు చేశారు. కొందరు రోడ్లమీద ఊరేగింపులు తీయాలని, తెలంగాణేతరుల గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు ఇవ్వాలని, వారి ఆర్థిక, సాంఘిక పునాదులను పెళ్లగించాలన్నారు. కేసీఆర్ మెతకగా ఉన్నారని విమర్శించారు. శాంతియుతంగా ఉద్యమాలు నిర్మించడం, ఆందోళనపూరిత ఉద్యమాలు ఎక్కువ కష్టం అనీ, అందుకు ఎంతో సహనం, ఓర్పు అవసరమని గాంధీ లాగే కేసీ ఆర్ విశ్వసించారు. శాంతియుత ఉద్యమం ద్వారానే రాష్ర్టాన్ని సాధించి పెట్టారు.

ఎప్పటికప్పుడు పదబంధాలను సృష్టించి, ప్రజల నాల్కలమీద నడయాడేవిధంగా మలచడంలో కేసీ ఆర్ దిట్ట. తెలంగాణ భాష, యాస, సంస్కృతికి పట్టంకట్టి దానికి సాధికారికతను సాధించడంలో అందరికీ స్ఫూర్తినిచ్చి వందలాది రచయితలు తెలంగాణ భాషలో రాయడానికి కారకులయ్యారు. తెలంగాణ పండుగలను, దేవాలయాలను, నదులను, వాటి గొప్పతనాన్ని, ప్రభవాన్ని విప్పిచెప్పి, ప్రచారం చేసి, తెలంగాణ పట్ల దశాబ్దాలుగా రుద్దబడిన ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి సగర్వంగా తలెత్తుకొని తిరిగే ఆత్మగౌరవ పోరాటాన్ని మహోన్నతంగా నడిపిన ఉద్యమకారుడు కేసీఆర్. ఉద్యమాన్ని ఒక పండుగలాగా నిర్వహించడమెలాగో చేసి చూపించారు. కోట్లాది ప్రజలు కలిసి నడిస్తే ఏ ఉద్యమమైనా పండుగలాగే కనపడుతుంది. తెలంగాణ చరిత్ర శతాబ్దాలుగా ఎంత మహోన్నతమైనదో, శాతవాహనుల పూర్వకాలం నుంచి చాళుక్యులు, కాకతీయులు, కులీకుతుబ్‌షా, నైజాం రాజ్యవంశం దాకా అనేక కోణాల్లో విశ్లేషించి, వారు చేసిన సేవలను, కృషిని కొనియాడారు. నైజాం రాజును ప్రపంచంలో ఎక్కడలేనంత దుర్మార్గుడిగా ప్రచారం చేసిన కుట్రలను బద్దలుకొట్టి నిజాం తన రాజ్యంలో నిర్మించిన కట్టడాలను, నిర్మాణాలను, దవాఖానాలను, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను, ఉస్మానియా విశ్వవిద్యాలయం, నీలోఫర్ హాస్పిటల్, నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి, అసెంబ్లీ, జూబ్లీహాల్, ట్యాంక్‌బండ్ వంటి వందలాది నిర్మాణాలను, వాటి ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. నైజాం రాజ్యంలో ఎన్ని పరిశ్రమలు ఎదిగాయో, వాటిని సమైక్య రాష్ట్రంలో ఎలా మూసివేస్తూ వచ్చారో, తెలంగాణ ప్రాజెక్టులను, ఉపాధికల్పనను, బడ్జెట్‌లను, ఆదాయాన్ని ఎలా సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయారో, అనేకమంది నిపుణులు వెలికి తెచ్చిన చారిత్రక సత్యాలను విస్తృతంగా ప్రచారం చేశారు. 

ఉద్యమాలు నిర్వహించడంలో కేసీఆర్ దేశానికి ఒక నూతన మార్గాన్ని వేశారు. ఇలాంటి శాంతియుత ఉద్యమం, ఇంత సుదీర్ఘ కాలం జరగడం ప్రపంచ చరిత్రలోనే అరుదు. ఇదే ఉద్యమం మరే దేశంలోనైనా జరిగిఉంటే రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, క్యూబా, మయన్మార్, వెనుజులా దేశాల ఉద్యమాల స్థాయిలో, ప్రపంచ స్థాయిలో గుర్తింపువచ్చి ఉండేది. ఈ చరిత్రను ఇంగ్లీషులో రాసి, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నేటి రచయితలు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తల మీద ఉన్నది. 


తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కార్యకర్తల భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఇంటిలో జరిగే శుభకార్యాల్లో ఏ విధంగా శ్రద్ధతో, సాదరంగా ఆహ్వానించి ఏర్పాటు చేస్తారో అటువంటి స్థాయిలో ఏర్పాట్లు చేసి వేలాదిమందికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. ఆప్యాయ తను పంచారు.
ఉద్యమాల్లో ఆర్థిక సమస్య ప్రధానమైంది. ఈ సమస్యను కేసీఆర్ ఎలా అధిగమించారో చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం. కేసీఆర్ భవిష్యత్తు గురించి దూరదృష్టితో ఆలోచించే జ్ఞాని. రాజకీయాల్లో దాన్ని విజ్ఞతగా, సమయానుకూలంగా ప్రదర్శించడమే కేసీఆర్‌లోని గొప్పతనం. అదొక రహస్య విద్య. అంతకన్నా తెలిసినవారు మేధావులు, విజ్ఞులు ఎంతోమంది ఉండవచ్చు. కానీ బహుముఖీనంగా ఉంటూ మాస్ లీడర్‌గా ప్రభావితం చేస్తూ, ప్రజలను నడిపిస్తూ, నడిచే నాయకులు అరుదు. ఈ దృష్టితో చూసినప్పుడే కేసీఆర్ చారిత్రక పురుషుడు.

చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను నాడే గుర్తించి, దూరదృష్టితో తర్కించి, రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని పొందుపరచిన అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు కేసీఆర్. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టం ప్రజల పక్షాన బాబాసాహెబ్ పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 125 అడుగుల భారీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. ఇది ఆయనలోని దార్శనికతకు, నిలువెత్తు సామాజిక స్పృహకు నిదర్శనం.
సామాజిక శాస్త్రవేత్తగా, సామాజిక న్యాయం ద్వారా, సామాజిక మార్పు శాంతియుతంగా సాగాలని కేసీఆర్ అభిలాష. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలిరోజునుంచే సీమాంధ్ర నాయకులు, అధికారులు చేసిన అక్రమాలను, కుట్రలను, ఎక్కడికక్క డ పసిగట్టి మరింత నష్టం జరగకుండా తెలంగాణ ఆస్తులను, రికార్డులను జాగ్రత్తపరిచే కృషిచేశారు. కేసీఆర్ మాత్రమే పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమ అనుభవం, అంతకుముందటి పరిపాలనా అనుభవంతో పాటు దశాబ్దాల అనుభవాలు కలిగిన అధికారులను, నిపుణులను, గౌరవ సలహాదారుగా నియమించి తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించడానికి చేస్తున్న కృషి మహోన్నతమైనది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వేసిన బాట రేపటి తెలంగాణకు బంగారు బాటగా, ఆదర్శంగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, ఏప్రిల్ 25, 2016

పాలనకు ప్రజామోదం...

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందు వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కదం తొక్కించి అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే సమర్థిద్దాం. సమయమిద్దాం అన్న వివేకం ప్రజల్లో ఉంది. అది ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.

sridar
సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే సమయానికి తెలంగాణలో సాధారణ ఎన్నికల ప్రక్రియ సాగింది. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న జాతీయపార్టీలు, ప్రాంతీయ పార్టీలు మోహరించిన వేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా బరిలోకి దిగింది. మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎవరికి తోచిన విధంగా వారు టీఆర్‌ఎస్‌ను తక్కువ అంచనా వేసి ఫలితాల నాటికి బొక్కబోర్లా పడ్డారు. 11 లోక్‌సభ సీట్లు, 63 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్ అజేయశక్తిగా అవతరించింది. అనితర సాధ్యమైన ప్రజామోదంతో ఈ రెండేళ్లు అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగించింది.

2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. తర్వాత మూడు నెలలకే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే ప్రజామోదం పొందడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుండటం విశేషం. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చతికిలబడింది. హర్యానాలోనూ అధికార ఎన్డీఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు సాధించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించినా, ఏడాదిన్నరకే బీజేపీ దెబ్బకు కుప్పకూలిపోయింది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలలో అధికార పార్టీల పరిస్థితి బాగా లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బెంగళూరు కార్పోరేషన్ ఎన్నికల్లో భంగపడింది. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. గుజరాత్‌లోనూ అదే పరిస్థితి. గత సాధారణ ఎన్నికల్లో 24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన క్రమంలో అధికారంలో ఉన్న బీజేపీ పది మాత్రమే గెలిచుకొని పద్నాలుగు చోట్ల ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తమ సీటును కాపాడుకున్నా, సాధారణ ఎన్నికల్లో రెండు వేల ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో ఏకంగా 24 వేలు సాధించింది.

ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో జరిగినన్ని ఎన్నికలు మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా జరగలేదు. 2014 సెప్టెంబర్‌లో మెదక్ ఉపసఎన్నిక మొదలుకొని ఈ నెల సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఓటర్లు మొత్తం కోటికి పైగానే. 43 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజామోదం ఈ ఎన్నికల్లో వెల్లడైంది. అంటే రాబోయే సాధారణ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ లాంటివే. ఈ రెండేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజామోదానికి ఈ ఎన్నికలు అద్దం పట్టాయి. అసాధారణ రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాలు నమోదు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశాయి. సిద్ధాంతాలు పక్కనపెట్టి పొత్తులు కుదుర్చుకున్నప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత మీద, కాలవైపరీత్యాల మీద నమ్మకం పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షాలకు అవేవీ కలిసి రాలేదు సరికదా 2014 సాధారణ ఎన్నికల కంటే దీనాతి దీనమైన స్థితికి దిగజారిపోయాయి.

2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతోపాటు మెదక్ లోక్‌సభకు పోటీ చేశారు. లోక్‌సభకు రాజీనామా చేయడంతో నాలుగు నెలలకే మెదక్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన ఆధిక్యతను అదేస్థాయిలో నిలబెట్టుకుంది. విశేషమేమిటంటే నరేంద్రమోదీ రాజీనామా చేసిన వడోదర ఉప ఎన్నికలు అప్పుడే జరిగాయి. కానీ బీజేపీ మెజారిటీ రెండున్నర లక్షలు తగ్గింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని టీఆర్‌ఎస్ బద్దలు కొట్టింది. టీడీపీ, బీజేపీలకు ఒక్క వార్డూ దక్కలేదు. శాసనమండలి ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో 11 స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

వీటిలో ఆరు సీట్లను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం విశేషం. గత నవంబర్‌లో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితం సంచలనం సృష్టించింది. 2014లో టీఆర్‌ఎస్‌కు 3 లక్షల 92 వేల మెజారిటీ వస్తే, ఇటీవల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి దయాకర్‌కు 4 లక్షల 60 వేల మెజారిటీ లభించింది. 64 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో అత్యధికమెజారిటీ సాధించిన మొదటి 10 మందిలో ఒకరిగా దయాకర్ చరిత్రకెక్కాడు. టీడీపీ బలపరిచిన బీజేపీ, కేంద్ర మాజీ మంత్రిని రంగంలోకి దింపిన కాంగ్రెస్ సహా మిగతా పార్టీలకు డిపాజిట్లు రాలేదు. నారాయణఖేడ్‌లోనూ అదే జోరు. తొలిసారిగా టీఆర్‌ఎస్ 53 వేల మెజారిటీతో విజయం సాధించింది. ఆరు దశాబ్దాల నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు మెజారిటీ.

హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని డివిజన్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క డివిజన్‌ను మాత్రమే కోల్పోయినా టీఆర్‌ఎస్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. పాతబస్తీలో సైతం ఎంఐఎంకు దీటుగా నిలిచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 150లోని 99 డివిజన్లను భారీ మెజారిటీతో గెలుచుకుని టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్ మినహా విపక్షాల మనుగడ ప్రశ్నార్థంగా మారింది.

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందువల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కదం తొక్కించి అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే సమర్థిద్దాం. సమయమిద్దాం అన్న వివేకం ప్రజల్లో ఉంది. అది ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.
-(ఈ నెల 27న ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతున్న సందర్భంగా)




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



జై 

ఆదివారం, ఏప్రిల్ 24, 2016

మాతృభాషతోనే మనుగడ...

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వంసం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాదకరమైనది. ఒక జాతి సమూహం కోల్పోయిన వేటినైనా తిరిగి సాధించవచ్చు. కానీ.. భాషా సంస్కృతులు కోల్పోయిన జాతి సర్వస్వాన్ని కోల్పోయి బానిసత్వంలోకి పోతుందని హెచ్చరించాడు. ఈ వెలుగులో మనం మన తెలుగు భాషా వికాసానికి ప్రాధాన్యమిస్తూనే..సామాజికావసరాలకు అనుగుణంగా విద్యావిధానాలను రూపొందించుకోవాలి.

sama
మన దేశంలో విద్యావిధాన చరిత్ర ఓ పెద్ద విషాద గాథ. తరతరాల చరిత్రలో అందరికీ అందుబాటులో ఉండి సమాజంలో వెలుగులు పంచాల్సిన చదువు (విద్య) కొన్ని వర్గాలకే పరిమితమైపోయింది. మెజారిటీ ప్రజలను అక్షరాలకు ఆమడ దూరం చేసింది. ఆదిలో అది సంస్కృతం రూపంలో మెజారిటీ ప్రజలకు దూరమై, ప్రజలను అంటరాని వారిని చేసి అగ్రహారాలకే పరిమితమైతే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాక తర్వాత ఇంగ్లీష్‌రూపంలో ప్రజలకు అందనిదై పోయింది. ఈ క్రమంలో.. చదువు అందరికీ అందుబాటులోకి రావాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకోవడం ఆధునిక సమాజపు సహజ హక్కు. అయితే.. అందరికీ విద్య అందుబాటులోకి ఎలా వస్తుంది? దానికి అనుసరించాల్సిన విధానాలేమిటి? బోధనామాధ్యమం ఏమై ఉండాలి? ఓప్రత్యేక భాషా మాద్యమం(ఇంగ్లీష్)తో మాత్రమే ఆధునిక విజ్ఞానం సమకూరుతుందా?లాంటి ప్రశ్నలు మన ముందున్నాయి.

చరిత్రలో భారత సమాజంలోని విద్య, సాధించిన ప్రగతి ఫలాలు దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయి. మన సమాజం విద్యావిజ్ఞానంలో మిగతా ప్రపంచంతో పోల్చితే.. వెనకబడిందేమీ కాదు. ఇంకా వారి కన్నా ఒకడుగు ముందే ఉన్నామని చరిత్ర చెబుతున్నది. అయితే ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఇలాంటి సామాజిక జ్ఞానాన్నంతా గతంలో అగ్రవర్ణ బ్రాహ్మణీయం తమ గుప్పిట్లో పెట్టుకుని సమాజానికి తీరని ద్రోహం చేసింది. అశేష ప్రజారాసులను అక్షరానికి అంటరాని వారుగా చేసి కాలానుగుణంగా వికసించాల్సిన జ్ఞానాన్ని అణచివేసింది, జనజీవితాన్ని అంధకారం చేసింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టే నాటికి దేశంలో మూలమూలనా దేశీ(వీథిబడులు, కాన్గి బడులు) విద్యావిధానం కొనసాగుతుండేది. అన్ని రకాల సమాజావసరాలను తీర్చేది. ఈ క్రమంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు వీథి బడుల స్వచ్ఛంద బోధనా విధానం ఆచరణలో ఉన్నది. ఈ దేశీ విద్యావిధానం మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ చాప్లిన్ డాక్టర్ ఎ.బిల్ దృష్టిని ఆకర్షించింది. ఈ విధానంతో పేదలకు ఉచిత విద్యను అందించ వచ్చని గ్రహించి, ఆ విధానాన్నే ఇంగ్లాండులో ప్రవేశపెట్టించాడు. దీన్నే ఇంగ్లాండులో మానిటోరియల్ పద్ధతి అంటున్నారు. ఈ నేపథ్యంలోంచే తర్వాత కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయా ప్రావిన్స్‌ల్లో విద్యా విషయంలో సర్వే చేయించింది.

మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ థామస్ మన్రో విద్యా సర్వే చేయించి 1826 మార్చి 10న ప్రకటించాడు. ఆ సర్వే ప్రకారం మద్రాస్ ప్రావిన్స్‌లో 12,498 పాఠశాలలు, లక్షా 88వేల 650 మంది విద్యార్థులున్నారు. అలాగే బొంబాయి, కలకత్తా ప్రావిన్స్‌ల్లో కూడా విద్యా సర్వే చేయించారు. కలకత్తాలో అయితే.. ప్రతి 400 మంది జనాభాకు ఒక పాఠశాల ఉన్నది! ఈ విధమైన పరిస్థితే అటు, ఇటుగా దేశమంతా విస్తరించి ఉండేది. చాలా మంది అనుకుంటున్నట్లు, చెబుతున్నట్లు బ్రిటిష్ వారి రాకకు ముందు భారతీయ సమాజంలో విద్యా వికాసం లేదు, సమాజమంతా అంధకార బంధురం అన్నది ఎంత సత్యదూరమో అర్థం చేసుకోవచ్చు.

గ్రామీణ భారతంలో కానసాగుతున్న దేశీవిద్యను ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు విధాలుగా అవరోదంగా భావించింది. ఒకటి- దేశీవిద్య ప్రకృతితో మనుష్యుల సహజీవనానికి ప్రాధాన్యమిస్తుంది. రెండు- సహజవనరుల కనిష్ఠ వినియోగానికి ప్రాధాన్యమివ్వడమే కాదు, వస్తు వినియోగాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇది వస్తువులను అమ్ముకోవడానికి వచ్చిన బ్రిటిష్ వారికి పెద్ద అడ్డంకి అయ్యింది. ఈ అర్థంలో దేశీ విద్యను అంతం చేసి, వస్తు వినిమయాన్ని పెంచి పోషించే విద్య ఈస్ట్ ఇండియా కంపెనీకి అత్యవసరమైంది. సరిగ్గా ఈ సామాజికార్థిక అవసరాల్లోంచే మన దేశంలో బ్రిటిష్ (ఇంగ్లీష్) విద్యావిధానం పురుడు పోసుకున్నది.ఈ నేపథ్యంలోంచే చార్టర్ యాక్ట్, ఉడ్స్ డిస్పాచ్‌లు వచ్చాయి. దేశంలో ప్రవేశపెట్టబోయే విద్య గురించి ఉడ్స్ ప్రతిపాదనలు.. ఈస్ట్ ఇండియా కంపెనీకి విశ్వసనీయులైన, సమర్థులైన ఉద్యోగుల్ని సమకూర్చడం, భారత ముడి పదార్థాలతో బ్రిటన్ యంత్రాలతో తయారైన సరకులకు భారత్‌లో నిరంతరం గిరాకీ ఉండేలా చేయటం.. విద్య లక్ష్యంగా ప్రకటించాడు. ఈ లక్ష్యాలనే మరింత విస్తృత పరిచి గ్రాంట్, విలియం బెంటింగ్, మెకాలే తదితరులు తాము ప్రవేశ పెట్టిన విద్యావిధాన లక్ష్యాలను, ప్రయోజనాలను ఏ దాపరికం లేకుండా ప్రకటించుకున్నారు.

తాము ప్రవేశ పెడుతున్న విద్యతో.. రంగు రూపుల్లో భారతీయులుగా, ఆలోచనల్లో బ్రిటిష్ వారిగా తయారవుతారని చెప్పుకున్నారు. ఇంగ్లీష్ మాధ్యమ పరమార్థమంతా సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉండే మానసపుత్రులను తయారు చేయడమే. మేధో బానిసత్వాన్ని సృష్టించుకోవడమే. సరిగ్గా ఈ సామాజిక సందర్భంలోనే.. మూలవాసుల సంస్కృతి వికాసాల గురించి మాట్లాడుతున్నామనే వారు కూడా మండే వేసవిలోనూ సూటుబూటు ధరించి ఇంగ్లీష్ భాషతోనే విముక్తి సాధ్యమంటున్న తీరును చూడాలి. సామాజిక విప్లవాల గురించి మాట్లాడే వారు కూడా ఇంగ్లీష్ భాషామాధ్యమాన్నే కోరుకోవడమే నేటి మహా విషాదం. 

ప్రపంచ వ్యాప్తంగా విద్యావ్యాప్తిలో సాధించిన విజయాలు, విజ్ఞాన ప్రగతి అంతా ఆయా ప్రజాసమూహాలు మాట్లాడుతున్న భాషలోనే సాగి, ఆయా దేశాల్లో తరాలుగా సంప్రదాయంగా వస్తున్న విద్యారీతుల పునాదులపైనే కొనసాగింది. ఉదాహరణకు ఇంగ్లాండులో అప్పటికి లోపభూయిష్ఠంగా ఉన్న స్వచ్ఛంద పాఠశాలల్ని అభివృద్ధి పరిచి విస్తరించడం ద్వారానే విద్యావ్యాప్తి జరిగింది.

కానీ మన దేశంలో మాత్రం మన సంప్రదాయ విద్యాబోధన రీతులు ధ్వంసం చేయబడ్డాయి. వీధి బడులు, కాన్గి బడుల విధానం కాలం చెల్లిన విధానమని చెప్పి స్వచ్ఛంద విద్యాబోధనా రీతులను పీక నులిమి చంపేశారు. అయితే.. భారతీయ సమాజం పట్ల బాధ్యతతో ఆలోచించిన బ్రిటిష్ అధికారులు లేకపోలేదు. 1819-27 కాలంలో బొంబాయి గవర్నర్‌గా ఉన్న ఎలిఫిన్‌స్టన్ నిజమైన అర్థంలో విద్యావ్యాప్తి ఎలా జరగాలో చెప్తూ.. విద్యాబోధన మాతృభాషలోనే జరగాలన్నాడు. దేశీయ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలన్నాడు. ఇంగ్లీష్‌ను ఒక సబ్జెక్టుగానే బోధించాలి గానీ.., మాధ్యమంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బోధించరాదని, దీనితో మేలుకన్నా భారతీయ సమాజానికి కీడే ఎక్కువని హెచ్చరించాడు. స్థానిక మాతృభాషలో కాకుండా పరాయి భాషా మాద్యమంలో విద్యాబోధన మేధోబానిసత్వాన్ని పెంపొందించడమే గాక, ప్రజల సాంస్కృతిక జీవనం చిన్నాభిన్నం చేస్తుందని హితబోధ చేశాడు.

తెలంగాణ సమాజ పునర్నిర్మాణం కోసం, వికాసం కోసం తపనపడుతున్న నేడు మన సామాజికావసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు పోవాలి. సమకాలీన పరిస్థితులు, తక్షణ అవసరాల నేపథ్యంలో..ఇంగ్లీష్ విద్యకు ప్రాధాన్యమివ్వాలని అంటున్న నేపథ్యంలో.. మనదైన సామాజిక, సాంస్కృతిక మూలాలను మరిచిపోవడం శ్రేయస్కరం కాదు. ఈ సందర్భంగానే.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాదకరమైనది. ఒక జాతి సమూహం కోల్పోయిన వేటినైనా తిరిగి సాధించవచ్చు.

కానీ.. భాషా సంస్కృతులు కోల్పోయిన జాతి సర్వస్వాన్ని కోల్పోయి బానిసత్వంలోకి పోతుందని హెచ్చరించాడు. ఈ వెలుగులో మనం మన తెలుగు భాషా వికాసానికి ప్రాధాన్యమిస్తూనే.. సామాజికావసరాలకు అనుగుణంగా విద్యావిధానాలను రూపొందించుకోవాలి. మేధో బానిసత్వంలో మునిగితేలుతున్న వారి మాటల ఉచ్చులో పడిపోరాదు. తెలంగాణ సమాజాన్ని శాశ్వత బానిసత్వంలోకి నెట్టే ప్రమాదాన్ని పసిగట్టాలి. దేశీ విధానంలో మాతృభాషలో విద్యబోధనే పరమోన్నతమైనదని గ్రహించాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణ సత్వర సాఫల్యత చేకూరుతుంది.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, ఏప్రిల్ 23, 2016

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

Srinivas

తెలంగాణలో బీడీ పరిశ్రమ ప్రధానమైన కుటీర పరిశ్రమలలో ఒకటి. దశాబ్దాలుగా లక్షలాది మంది ఈ వృత్తి ని జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నారు. ఈ పరిశ్రమలో అధిక శాతం మహిళలే భాగస్వాములు. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో బీడీలు తయారుచేయడం కుటీరపరిశ్రమగా నడుస్తున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలలో ఇది నమ్మకమైన ఆదాయ సముపార్జన మార్గంగా ఉన్నది. కరువు కాలాల్లో నిరుపేద కుటుంబాలకు జీవనోపాధినిస్తున్న ఏకైక ఆదాయ వనరు బీడీ పరిశ్రమ. కొన్ని ప్రాంతాల్లో కుటుంబ యజమాని బొంబాయి, దుబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్తే, వారి నుంచి కుటుంబానికి ఆదాయం రావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. అంతకాలం ఆయా కుటుంబాలు బీడీలు చేయడం ద్వారానే జీవనోపాధి పొందుతారు. చిన్నపిల్లల తల్లులు వ్యవసాయ పనులకు, బయటి పనులకు వెళ్లలేరు. వారికి రోజు గడవటం చాలా కష్టం. వీరికి ఏకైక మార్గం బీడీలు చుట్టడం. అమూర్తంగా ఉండే మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ విధానాలను ప్రజల నుంచి పారదోలడం ఇప్పటికే ప్రభుత్వాల నుంచి కావడం లేదు. నేరుగా జీవనోపాధిని కల్పించే పరిశ్రమను వారికి భౌతికంగా దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జీవో తీయడం అనేక సంశయాలకు స్థానం కల్పించింది. సిగరెట్ కంపెనీల ఒత్తిడి మేరకే బీడీ పరిశ్రమపై ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నట్లు బీడీ కార్మికులు భావిస్తున్నారు. 


గతం లో ఇదే అంశంపై కేంద్రస్థాయిలో చర్చ జరిగినప్పుడు నేడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని మంత్రుల కమిటీ పుర్రె గుర్తును అరవై శాతం బదులు నలభై శాతం మేరకు ముద్రించాలని నిర్ణయించింది. కానీ ఎన్‌డీఏ ప్రభుత్వం 2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎనభై అయిదు శాతం పుర్రె గుర్తును బీడీ కట్టపై ముద్రించాలని హెచ్చరింది. ఇది ఎంత అసంబద్ధమైనదంటే ఏదైనా వస్తువు కవర్‌పై 85 శాతం ముద్రించిన తర్వాత మిగిలిన భాగంలో వస్తువు తయారీదారు పేరు కూడా రాసే అవకాశం తక్కువ. వినియోగదారుడు తను కొనే వస్తువు ధరను స్పష్టంగా చూసుకునే స్థితి ఉండదు.

రాష్ట్రంలో వ్యవసాయం, భవన నిర్మాణ రంగం తర్వాత ఆ స్థానంలో బీడీ కార్మికులుంటారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే చేయూత శూన్యం. ఈ పరిశ్రమకు విద్యుత్, నీరు, మౌలిక వసతుల వంటివి ప్రభుత్వం కల్పించవలసిన అవసరం లేదు. పొగాకు కాకుండా మరే ఇతర రసాయనాలు, నిల్వ పదార్థాలు ఉపయోగించడంలేదు. రాష్ట్రంలో బీడీలు చుట్టేవారు సుమారు 75 లక్షల వరకు ఉంటారు. వీరికి అనుబంధంగా తునికాకు సేకరణ మార్కెటింగ్, రిటేల్ అమ్మకాలు నిర్వహించేవారు మరో మూడు లక్షల మంది ఉంటారు. ఇందులో మహిళలు 95 శాతం వరకు ఉంటారు. అందరూ దళిత, వెనుకబడిన, బలహీనవర్గాలకు చెందినవారే. (దేశ ప్రజల తలసరి ఆదాయం పెంచవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ కేంద్రం తన జీవోతో లక్షలాది మంది నిరుపేదల జీవనోపాధినే హరించేందుకు ప్రయత్నిస్తున్నది.) తునికాకు సేకరించడం ద్వారా ఆదివాసీలు, గిరిజనులు ప్రతి సంవత్సరం ప్రధాన ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వాల నుంచి అనేక రాయితీలు పొందిన ఆధునిక పరిశ్రమలు ఇస్తున్న ఉపాధికంటే ఎన్నోరెట్ల మందికి సహజంగా ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమ ఇది.


కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని బీడీల ఫ్యాక్టరీలన్నీ ఈ నెల మొదటి తేదీ నుంచి మూతపడ్డాయి. పుర్రె బొమ్మ హెచ్చరిక 85 శాతం ఉంటే మా ఉత్పత్తులను అమ్ముకునే స్థితి ఉండదనే నిర్ణయానికి యాజమాన్యాలు వచ్చాయి. ఫలితంగా మన రాష్ట్రంలో పది లక్షలకుపైగా మంది జీవనోపాధికి దూరమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య కోటిన్నర ఉంటుంది. ఒక దేశంలో కోటిన్నర మందికి ప్రత్యక్షంగా నష్టం కలుగుతుంది. ఇంతమంది ప్రజానీకాన్ని ఉపాధికి దూరం చేయడం అంటే ఒక సంక్షోభాన్ని సృష్టించడమే. సంక్షేమ దృక్పథాన్ని వదిలి ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించడం వల్ల సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కోటిన్నర ప్రజల జీవనోపాధిని ఒక్కసారే దెబ్బతీస్తే అది ప్రకృతి విలయాన్ని మించిన సంక్షోభాన్ని కారణమౌతుంది. జీవనోపాధి లేని ఇంతమంది ప్రజలు ఏ నుయ్యో, గొయ్యో చూసుకోవడమో, అసాంఘికశక్తులుగా మారడమో చేస్తారు. ఎందుకంటే ఈ రంగంలోని ప్రజలలో అధికశాతం నిరక్షరాస్యులు వారికి వేరే ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఆ పరిశ్రమను మూసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణం. ఇప్పటికే వారానికి నాలుగు రోజులు పని దొరుకుతున్నది. ఈ నెలారంభం నుంచి అది కూడా పోయింది.


కేంద్ర ప్రభుత్వానికి పొగాకు వినియోగం నియంత్రించాలని చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రాజెక్టుగా భావించాలి. ఆ ప్రాజెక్టులో భాగంగా బీడీ పరిశ్రమపై దాన్ని ఆధారపడిన కార్మికులు, రైతులను క్రమంగా ఆ పరిశ్రమకు దూరం చేయాలి. ఎంతమందిని ఆ పరిశ్రమ నుంచి దూరం చేస్తారో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపాలి. అందుకయ్యే అన్నిరకాల వ్యయప్రయాసలు ప్రభుత్వమే భరించాలి. కొత్తరంగానికి మరల్చేక్రమంలో అందుకు అవసరమైన నైపుణ్యాలపై ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పించాలి.


మద్య నిషేధం వల్ల మద్యం తాగేవారు తగ్గుతారని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే బీడీలు తాగేవారు అవి దొరకకుంటే సిగరెట్ల వైపు మళ్లుతారు. అది ఏకంగా పొగాకు వినియోగాన్ని తగ్గించినట్లఅవుతుంది. పొగాకు వినియోగాన్ని పూర్తిగా నిషేధించదలుచుకుంటే ప్రభుత్వం ఈ రంగంలో కార్మికులకు అనుబంధంగా పనిచేసేవారికి ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు ఐదు నుంచి పదేళ్ల కాలపరిమితి విధించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ క్రమంగా నిర్వహించవలసిన ప్రక్రియ.


కాబట్టి తక్షణం కోటిన్నర ప్రజల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని పుర్రెగుర్తు సైజుపై కేంద్రం మొండి వైఖరికి పోవద్దు. కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు సానుకూలంగా వ్యవహరించాలి. ఈ మధ్య కాలంలో ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల పార్లమెంట్ సభ్యులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల కేంద్రం ముందుగా పుర్రె గుర్తు గురించి కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై పార్లమెంట్ వేదికపై చర్చించి, తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వాతావరణంలోఈ చర్యను దేశవ్యాప్తంగా ప్రజల ముందుంచాలి. కానీ ఇలాంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఏకపక్షంగా వెలువరించరాదు.

(వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


గురువారం, ఏప్రిల్ 21, 2016

చెట్టులో మనిషి ప్రాణం


పూవుల నిచ్చేవి చెట్లు! ఫలముల నిచ్చేవి చెట్లు!
నీడను ఇచ్చేవి చెట్లు! కలపను ఇచ్చేవి చెట్లు!
ప్రాణం నిల్పేవి చెట్లు! ఆ చెట్లను పెంచకుండ
ఇండ్ల కొఱకు నరికెదేల? చెట్లు పెంచు సోదరా!
చెట్లను నువు పెంచకున్న... భవితయె నశియించునురా!
మానవాళి మనుగడకై... పచ్చదనం పెంచుమురా!!
-గుండు మధుసూదన్

చందమామ కథల్లో మాంత్రికుడి ప్రాణం చెట్టు తొర్రలో ఉందని తరచూ చదువు కునేవాళ్లం. అది నిజమో కాదో తెలియదు కానీ మనిషి ప్రాణం మాత్రం చెట్టులోనే ఉన్నదని ఇప్పుడు మనకు తెలిసివస్తున్నది. 

ఎండలు కొత్త కాదు కానీ, అవి నానాటికీ ముందుకు రావడం, తీవ్రస్థాయిలో ఉండటం కొత్త. ఏప్రిల్‌లో ఇటువంటి ఎండలు నాలుగు దశాబ్దాల తర్వాత చూస్తున్నామని ఒక అధికారి చెప్పారు. రుతువులు గతి తప్పుతున్నాయి. కాలాలు గతి తప్పుతున్నాయి. కరువు నిత్యకృత్యం అవుతున్నది. ఈసారి అసలు చలికాలం వచ్చినట్టు పోయినట్టు ఎవరికీ పెద్దగా అనుభవంలోకి రాలేదు. సంవత్సరమంతా ఎండలు చూస్తున్నాం. కాస్త ఎక్కువగా కాస్త తక్కువగా. ఏమి జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో ఒకసారి అందరూ మననం చేసుకోవలసిన అవసరమయితే కనిపిస్తున్నది. మనిషి ప్రాణం నీరులో ఉంది. నీరు ప్రాణం చెట్టులో ఉంది. చెట్టు ఉంటే గాలి. చెట్టు ఉంటే నీడ. చెట్టు ఉంటే నీరు. ఆ చెట్టు లేకుండా పోవడమే ఇప్పుడు అన్ని అనర్థాలకు దారితీస్తున్నది. 


shekar 

అభివృద్ధి, విధ్వంసం జమిలిగా ఉంటాయి. గత రెండు దశాబ్దాల్లో రహదారుల విస్తరణ పేర, గనుల తవ్వకం పేర, కార్ఖానాల ఏర్పాటు పేరిట, వ్యవసాయ విస్తరణ పేరిట రోడ్లవెంట ఉన్న మహావృక్షాలు, అడవులు, కంచెలు మాయమయిపోయాయి. వృక్షాలను కదిలించకుండా అభివృద్ధి చేసే ఆలోచనే మన విధానాల్లో లేకుండాపోయింది.


ఆ మధ్య థాయిలాండ్‌లో ఒక చారిత్రక నగరాన్ని సందర్శించాము. చియాంగ్మయి నుంచి లాంఫూన్‌కు వెళ్లే దారి అది. సుమారు పది కిలోమీటర్లు దారి పొడవునా రోడ్డుకిరువైపులా 40 నుంచి 50 అడుగుల ఎత్తైన యాంగ్ వృక్షాలు కనిపించాయి. ఆ చెట్లకు పసుపుపచ్చని వస్త్రాలు కట్టి దేవతల్లాగా పూజిస్తున్నారు. నడి ఊర్లలో కూడా, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల వద్ద సైతం ఒక్క చెట్టునూ కదిలించలేదు. ఇళ్లు కట్టుకున్నా, వ్యాపార సముదాయం కట్టుకున్నా చెట్టు జోలికెళ్లకుండా కట్టుకోవలసిందే. అక్కడ ఏ ఊరు చూసినా వనంలాగా కనిపించింది. ఇండ్ల కంటే పైకెదిగిన వృక్షాలు అధికంగా కనిపించాయి. అక్కడా ఒకప్పుడు అడవులను తీవ్రంగా ధ్వంసం చేసి, విపరీత పర్యవసానాలను చూసిన తర్వాత వృక్షజాతి సంరక్షణకు కఠినమైన చట్టాలు తెచ్చారు.

ఎంతో దూరం ఎందుకు? జర్మనీలో ఇంటి నిర్మాణం కోసం ఒక చెట్టును నరకాల్సివస్తే, అదే స్థానంలో రెండు అవే జాతి మొక్కలు నాటి, అవి కుదురుకునే వరకు, ఇంటి యజమాని వాటిని సంరక్షించాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తూంటుంది. ఒకప్పుడు మన రాష్ట్రంలోనే ప్రతిఊరిలో ఎక్కడపడితే అక్కడ చెట్లు ఉండేవి. 

చింతలతోపులు, మామిడి తోపులు, మర్రి, జువ్వి, రావి, వేపచెట్లు విరివిగా ఉండేవి. ఎండాకాలం వస్తే జనం చెట్లకిందికి చేరి ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. ప్రతిఊరికి రెండు మూడు వందల ఎకరాల కంచెలు ఉండేవి. కంచెల నిండా చెట్లు ఉండేవి. పశువులను మేపడానికి ఆదరువుగా ఉండేవి. జింకలు, కుందేళ్లు, అడవి పందులు దుముకుతూ ఉండేవి. ఇప్పుడవన్నీ అంతరించిపోయాయి. వనాలతోపాటే వానలు పోయాయి. చెరువులు నిండటం ఎప్పుడో అరుదుగా జరుగుతున్నది. ఏటా అలుగులు పోసిన బావులు, పిల్లల ఈతలకు కేంద్రంగా ఉండే బావులు ఇప్పుడు పాడుబడిపోయాయి. మర్రి చెట్లు, జువ్వి చెట్లు, రావి చెట్లు అరుదుగా కనిపిస్తాయి. చేలల్లో, గట్లల్లో, బావుల వద్ద అసలు చెట్లు లేకుండా పోయాయి. ఇప్పుడు నాగలి దున్నని చోటులేదు. ఊర్లు కాంక్రీట్ జంగల్‌లు అయ్యాయి. కరువు విరుచుకుపడుతున్నదంటే ఎందుకు పడదు? ఎవరిని నిందించాలి ఇప్పుడు? 


మరోవైపు అడవుల విధ్వంసం. తెలంగాణలో ఉన్నంత విశాలమైన దట్టమైన అరణ్యం ఒకప్పుడు ఆంధ్రలో లేదు. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే అవి కూడా చాలా చిన్నచిన్న చెట్లతో మాత్రమే మిగిలిఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ దట్టమైన అరణ్యాలకు ప్రసిద్ధి. వరంగల్ అడవుల్లో ఒకప్పుడు ఏనుగుల సంచారం ఉండేదని చెబుతారు. ఇప్పుడక్కడ అడవి దొంగల సంచారం కనిపిస్తున్నది. 


చాలామంది రాజకీయ నాయకుల అండతో వరంగల్ జిల్లాలో అడవి అంతిమ దశకు చేరుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల ఆవశ్యకత గురించి, ఒక్కో మనిషికి ఉండాల్సిన చెట్ల సంఖ్య గురించి దేశదేశాల వివరాలు సేకరించి చెబుతున్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం గురించి పదేపదే నొక్కి చెబుతున్నారు. అటవీ సిబ్బందికి అవసరమైన సాధన సంపత్తి సమకూర్చుతున్నారు. కానీ నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో అడవుల నరికివేత ఆగలేదు. అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు ఆగలేదు. బండెనకబండి పదహారు బండ్లు కట్టి కలప తరలించుకుపోవడం ఆగలేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ హరించుకుపోతున్నది. అడవుల విస్తీర్ణం పెంచడం కాదుకదా ఇప్పుడున్న శాతం కూడా కాపాడలేని పరిస్థితి. మనిషి ప్రాణానికి ఇచ్చిన విలువను చెట్టు ప్రాణానికి ఇచ్చే చట్టాలు చేయకపోతే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవు. చెట్టును ముట్టుకోవడానికి మనిషి భయపడే రోజు రావాలి. అలా చేయనంతకాలం కూర్చోవడానికి నీడ, పీల్చుకోవడానికి గాలి, తాగడానికి నీరు లేక విపరీత ఉత్పాతాలను ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. 

ఎంత విజ్ఞానం, ఎన్ని ఆవిష్కరణలు, ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషిని ఎవరూ రక్షించలేరు. అమెరికానే మనకు ఉదాహరణ. అత్యంత ఆధునిక దేశం, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్న అమెరికాలో ఈరోజు కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అతలాకుతలం అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతి అసమతౌల్యం ఏర్పడిన ప్రతిచోట పరిస్థితి అలాగే ఉంది.

వెనుకటికి జనం కలరా వంటి మాయరోగాలు వచ్చి చనిపోయేవారు. ఇప్పుడు కరువులకు,వడగాడ్పులకు పిట్టల్లా రాలిపోతున్నారు. పల్లె పట్నం తేడా లేదు. హైదరాబాద్ గురించి ఒకప్పుడు కాశీయాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య చాలా గొప్పగా చెప్పారు. ఉద్యానవనాలు, పండ్లతోటలు, పచ్చని మైదానాలు ఎక్కడ చూసినా భవనాలను కప్పేసే వృక్షాలు ఉండేవని ఆయన రాశారు. అప్పటిదాకా ఎందుకు, 1970, 80 దశకాల్లో ఇంత ఉష్ణోగ్రతలు లేవు. ఎక్కడ చూసినా గ్రీన్ స్పేసెస్ ఉండేవి. వసంతం వచ్చిందంటే రోడ్లవెంట గుల్‌మొహర్ పూలు తివాచీ పరచినట్టు పరుచుకుని ఉండేవి. సాయంత్రం అయితే వాతావరణం చల్లబడేది. ఎండాకాలంలో కూడా వర్షపు జల్లులు పలకరించిపోయేవి. వర్షాలు విరివిగా కురిసేవి. కానీ నగరంలో ఇప్పుడు ఖాళీ స్థలాలు లేవు. రోడ్ల వెంట చెట్లు లేవు. విస్తరణ, ఆధునీకరణ పచ్చదనాన్ని మింగేసింది. నగరీకరణ ఒత్తిడి, అస్తవ్యస్థ పాలన కారణంగా కమ్యూనిటీ స్థలాలు సైతం అన్యాక్రాంతమైపోయాయి. చివరికి కొండలు గుట్టలు ఏవీ ఆక్రమణల నుంచి తప్పించుకోలేకపోయాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఉన్నంత లాండ్ బ్యాంకు దేశంలో మరే నగరానికీ లేదు. సమైక్యపాలనలో ఒక విధంగా లూటీ అయిపోయింది. ఇవ్వాళ ఎక్కడ చూసినా భవంతులే భవంతులు. ప్రభుత్వం ఏదైనా కొత్త కార్యాలయం కట్టాలంటే స్థలం దొరకడం కష్టమైపోతున్నది. వందలాది చెరువులు అంతరించిపోయాయి. ఉన్న చెరువులు కూడా కుంచించుకుపోయాయి. నీరు ఇంకడానికి ఖాళీ స్థలాలు లేవు. ఇక భూగర్భ జలాలు ఎలా ఉంటాయి. ఇవ్వాళ రెండు వేల అడుగుల కంటే ఎక్కువ లోతుకు తవ్వుతున్నారు. నమస్తే తెలంగాణకు సమీపంలో మూడు రోజులుగా ఒకే బోరుబండి నీటికోసం తవ్వుతూనే ఉంది. భూమికి చిల్లు పడుతుందేమో అని ఒక మిత్రుడు కామెంట్ చేశాడు. భూమికి చిల్లు పడుతుందో లేదో కానీ నీరు మాత్రం ఇంకా దొరకలేదు. 

నగరంలో మొక్కల పెంపకం ఒక ప్రహసనమే. కొన్ని ఏళ్లుగా ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్నట్టు, పట్టణ సామాజిక అడవులు పెంచుతున్నట్టు ప్రకటించడం చివరికి వచ్చేసరికి ఎక్కడా అవి కనిపించకపోవడం అనుభవంలో ఉన్నదే. మొక్కలు పెట్టగానే కాదు. వాటిని పెంచడానికి నీళ్లు కావాలి. సిబ్బంది కావాలి. లేదంటే ప్రజలయినా ముందుకు వచ్చి పట్టించుకోవాలి. ఇవి రెండూ సాధ్యం కావడం లేదు. అందుకే ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. కాలం వెనకకుపోతూనే ఉంది. రుతువులు చెదిరిపోతూనే ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఒకటి అర్థం అవుతుంది-చెట్టు, నీరు, గాలి, ఖాళీ స్థలాలు పరస్పరాధారితాలు. మొత్తం సమాజం ఈ అంశంపై దృష్టిపెడితే తప్ప ముందు ముందు ఈ గండం నుంచి తప్పించుకోలేము. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కరెంటు కష్టాలు లేకుండా చూస్తున్నది. ఏవో ఏసీలు, కూలర్లు నడుస్తున్నాయి కదా అని ఊపిరి పీల్చుకుంటుండవచ్చు. కానీ పచ్చదనాన్ని ఇచ్చే చెట్ల ధ్వంసం ఇలాగే కొనసాగి, ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే ఏ ఏసీలు, ఏ కూలర్లూ మానవజాతిని కాపాడలేవు. మానవ మనుగడకే ముప్పు ఏర్పడే దుస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఇప్పటికీ మన చేతుల్లోనే ఉంది.
kattashekar@gmail.com


జై తెలంగాణ!     జై జై తెలంగాణ!



శుక్రవారం, జనవరి 01, 2016

హాయిగ రెండువేల పదహా రిడు శాంతులు సౌఖ్యముల్ సిరుల్!!



2015 సంవత్సరం అతి వేగంగా గడిచిపోయింది. గత ఏడాది నాటి ఉద్వేగాలు ఇప్పుడు లేవు. పోయినేడాది మొదటి సగం తెలంగాణ వస్తున్న ఉద్వేగం... మిగతా సగం తెలంగాణ ఆవతరించిన సంతోషం... ఆనందంగా గడిచిపోయింది. ఈ ఏడాదంతా పునర్నిర్మాణంపైనే ధ్యాస. సొంత రాష్ట్రం, సొంత ప్రభుత్వం ఏర్పడితే మన ప్రాధాన్యాలను మనం నిర్ణయించుకొని ఎట్లా అభివృద్ధి చెందగలమనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అనుభవంలోకి తేగలిగారు. పుష్కరాల నిర్వహణతో కేసీఆర్ దక్షత తెలిసివచ్చింది. మనకు మనం చెప్పుకోవడం బాగుండదు కానీ, చాలా మంది సీమాంధ్ర ప్రజలు ఏపీతో పోల్చి చూసుకుని కేసీఆర్ పాలనా సామర్థ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కరెంటు కోత లేకపోవడం కూడా జనాన్ని బాగా సమాధాన పరిచింది. సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూనే, ముఖ్యమంత్రి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. గోదావరి పొడుగునా పుష్కరాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో మన నది, మన నీళ్ళు అనే అభిప్రాయం ఏర్పడ్డది. చెరువుల తవ్వకం, ఇంటింటికీ నల్లా నీళ్ళు మొదలైన పథకాలు ప్రజలు ఇది మా ప్రభుత్వం అనుకునే విధంగా చేశాయి. తెలంగాణ ప్రజలు మొదటిసారిగా శ్రీరామ్‌సాగర్‌లో ఎన్ని నీళ్ళున్నయి, ఏయే ప్రాజెక్టులు కడుతున్నారు అనే విషయాలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి, గ్రామ అభివృద్ధి గురించీ సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి ఇదొక కొత్త అనుభవం. 


తెలంగాణ రాష్ట్రం కోరుకున్నప్పటికీ, మన కాళ్ళ మీద మనం ఎట్లా నిలబడతామనే నమ్మకం కొందరికి లేదు. సీమాంధ్ర పాలకవర్గాలు, మీడియా సృష్టించిన సందేహాలు అవి. ఈ దుష్ట శక్తులు తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్‌పై విమర్శలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అంటూ పక్క రాష్ర్టానికి చెందిన పెద్ద మనిషి బహిరంగంగా అనడం తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగించింది. కానీ కేసీఆర్ ధీమాగా తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని సాగించారు. దీంతో ప్రజల విశ్వాసం మరింత బలపడ్డది. ప్రత్యర్థులు నిర్వీర్యమైపోయారు. సంవత్సరాంతాన చండీయాగం పూర్తి చేసే నాటికి కేసీఆర్ అజేయుడిగా అవతరించారు. ఆయన రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, తెలంగాణ సమాజానికి తాము అభివృద్ధి చెందుతామనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగారు. తెలంగాణ సమాజాన్నంతా ఏకతాటిపైకి తేగలిగారు. ఇది ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయం. 


ఆంధ్రా సమాజంలోనూ తమ రాష్ట్రం నిలదొక్కుకోగలదనే ధీమా ఈ ఏడాది కాలంలో ఏర్పడ్డది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని నిర్మాణం పట్ల అక్కడి ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర విభజన జరిగితే, కొత్త రాజధాని ఏర్పడి పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువవుతుందనీ, రెండు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నారు. అది ఇప్పుడు వారి అనుభవానికి వచ్చింది. కేసీఆర్ చెప్పిన మాటలు వారికి ఇప్పుడు అర్థమయ్యాయి. విభజన జరగగానే ఏదో కోల్పోయినట్టు, సీమాంధ్ర ఇక నిలబడలేదన్నట్టు అక్కడి నాయకులు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉన్నది. ఒక్కో రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేస్తే తప్ప రానట్టి అనేక విద్యా సంస్థలు తమ ప్రాంతానికి ఒక్క పెట్టున రావడాన్ని వారు గుర్తించారు. ఈ మార్పు పట్ల పెల్లుబికిన ఆనందం కేసీఆర్ పట్ల అభిమానంగా మారిపోయింది. 


రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ర్టాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. సీమాంధ్ర నాయకులు అనుసరించిన విధానం, కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఇందుకు కారణం. ఈ సమస్యలు సలుపుతూనే ఉంటాయనీ, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కయ్యాలు పేట్రేగిపోతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ ఏడాది తిరిగేలోగా ఇరువురు ముఖ్యమంత్రులు సన్నిహితంగా వ్యవహరించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి చేరుకొని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ అమరావతిలో కేసీఆర్ పట్ల చంద్రబాబు చూపిన ఆదరణ కూడా మరువలేనిది. కేసీఆర్ చండీయాగానికి చంద్రబాబును అంతే సాదరంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు. చంద్రబాబు నివాసంలో విందు భోజనం చేశారు. చండీయాగానికి వచ్చిన చంద్రబాబుకు కేసీఆర్ నుంచి సముచిత సత్కారం లభించింది. మన మిత్రులను ఎంచుకోగలం కానీ, మన ఇరుగు పొరుగును నిర్ణయించుకోలేమనే సూక్తి ఉన్నది. తెలంగాణ, ఏపీ ఇరుగుపొరుగు రాష్ర్టాలు. ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి. ప్రజలు ఎప్పుడూ శాంతిని కోరుకుంటారు. ఇరువురు ముఖ్యమంత్రులు సన్నిహితంగా మెలుగుతుండటాడాన్ని ప్రజలు కూడా హర్షిస్తున్నారు. 

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య సమస్యలు లేవని కాదు. పంపకాల, అంపకాల సమస్యలు ఇంకా తెగిపోలేదు. సమస్యలనేవి రాష్ర్టాల మధ్య, దేశాల మధ్య ఉండనే ఉంటాయి. అందులో కొత్తగా విభజన జరిగిన రాష్ర్టాలు కనుక విభజన విభేదాలు తలెత్తడం సాధారణం. ఈ విభేదాలను ఏ విధంగా పరిష్కరించుకుంటామనేది ప్రధానం. శత్రుపూరితంగా వ్యవహరించకుండా సామరస్యంగా పరిష్కారాలు సాధించాలె. రెండు రాష్ర్టాల ప్రజలను రెచ్చగొట్టే శక్తులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఈ విజ్ఞత ఏ ఒక్కరికో ఉంటే సరిపోదు. రెండు పక్షాలకూ ఉండాలె. ఇరువురు ముఖ్యమంత్రుల కనబరుస్తున్న స్నేహశీలతను గమనిస్తే విభజనాంశాలు సమస్యగా పరిణమించవనే నమ్మకం కలుగుతున్నది. 


తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఉండే సీమాంధ్ర మూలాలున్న ప్రజలకైతే ఆ మాత్రం బాధ కూడా లేదు. సామరస్యం విషయానికి వస్తే తెలంగాణ వారితో పాటు ఈ సీమాంధ్ర ప్రజలనూ అభినందించ వలసిందే. తెలంగాణ విముక్తి ఉద్యమం సీమాంధ్ర పాలకవర్గాల పెత్తనానికి వ్యతిరేకంగా వచ్చిందనీ, అక్కడి ప్రజల పట్ల తెలంగాణ వారికి ఎటువంటి పేచీ లేదని ఉద్యమకారులు అనేక సందర్భాలలో చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీమాంధ్ర ప్రజలు ఇక్కడివారితో కలిసిమెలిసి ఉండవచ్చునని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో ఎంతో కాలంగా ఉంటున్న సీమాంధ్ర ప్రజలు ఇక్కడి స్థానికుల పట్ల ఏనాడూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తాము ఇక్కడే ఉండిపోతామని అనేక మంది తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉండదని, వాడకో పోలీసు స్టేషన్ పెట్టాల్సి ఉంటుందని భయపెట్టిన మేధావులూ ఉన్నారు. ఇప్పుడా రాతలు ఎంత అర్థం లేనివో అవి రాసిన బుద్ధిజీవులు గ్రహించుకుంటే మంచిది. 


తెలంగాణ ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని చెప్పుకునే కొందరు సీమాంధ్ర పాత్రికేయ మిత్రులు కూడా తెలంగాణవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమైన మొదట్లో సంగతి. నటరాజ రామకృష్ణ మరణించినప్పుడు మిగతా పత్రికల కన్నా నమస్తే తెలంగాణ ఎక్కువగా కవరేజి ఇచ్చింది. ఆయన తండ్రి ఆంధ్ర ప్రాంతీయుడనీ, తల్లి మాత్రమే తెలంగాణ అనీ... మరి నమస్తే తెలంగాణ ఎందుకు ఇంతగా మనవాడంటూ ఓన్ చేసుకున్నదనీ కొందరు ఆంధ్రా పాత్రికేయులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎడిటర్‌గా ఉన్న అల్లం నారాయణ గారికి, శేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చర్చించిన వారూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇరువురు ఆంధ్రా వారే అనుకుందాం. అయినంత మాత్రాన తెలంగాణలో ఉండి, ఇక్కడి కళారంగానికి విశేష సేవలు అందించిన మహానుభావుడికి నివాళులు అర్పించుకోమా! సీమాంధ్ర మూలం ఉందని పరాయిని చేసుకుంటామా? కాళోజీని తెలంగాణ నుంచి విడదీసి చూడగలమా! తమకు సేవలందించిన మహానుభావులను ఏ జాతీ విస్మరించలేదు. ఎం.ఎఫ్. హుస్సేన్ మొదలుకొని ఈ గడ్డతో అనుబంధం ఉన్న ప్రముఖులను నమస్తే తెలంగాణ మననం చేసుకుంది. గౌరవించింది. ఇందుకు ప్రశంసలు అందుకున్నది. సానియా, సైనాలను మన తెలంగాణ బిడ్డలుగా చెప్పుకున్నామే తప్ప ఏనాడూ పరాయిలుగా చూడలేదు. తెలంగాణలో అటువంటి కుసంస్కృతి ఏనాడూ లేదు. 

venugopal


తెలంగాణ అవతరణకు ముందూ, తరువాత కొందరు విభజన రేఖలు గీయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్, చంద్రబాబు పరస్పరం గౌరవించుకోవడాన్ని హర్షించడానికి బదులు అదిగో రాజీ పడ్డారు అంటూ వక్ర భాష్యాలు చెప్పిన వారూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణలో అంతటా కానీ ఉన్న సీమాంధ్ర ప్రజలు ఈ వంకర మాటలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ వారితో అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటున్నారు. ఇరు వర్గాల మధ్య పొరపొచ్చాలు లేవని వారి జీవితానుభవమే చెబుతున్నది. అనుమానాలు, అపోహలు అన్నీ గతం. ఇక్కడ ఉంటున్న సీమాంధ్ర మూలాలున్న ప్రజలు తెలంగాణ సమాజంలో భాగం. వారికి స్థానికులతో ఎటువంటి గొడవా లేదు. తమకు రెండు రాష్ర్టాలు విడిపోయాయన్న భావనే కలగడం లేదని ఎప్పటి మాదిరిగానే ఉంటున్నామని ఇక్కడ ఉంటున్న సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. ఇక్కడ మరాఠీలు, కన్నడిగులు, తమిళులు, మళయాళీలు, గుజరాతీలు, బెంగాలీలు, ఉత్తర భారతీయులు, పారశీకులు, ఆంగ్లో ఇండియన్లు- ఇట్లా అనేక జాతులు, భాషా సంస్కృతుల వారు ఉంటున్నారు. ఎవరినీ తెలంగాణ సమాజం పరాయిగా చూడలేదు. ఆంధ్ర ప్రజల చేరికతో తెలంగాణ భిన్నత్వం మరింత శోభాయమానమైంది. తెలంగాణ సమాజమంతా ఒకే తాటిపై నిలిచి అభివృద్ధి పథాన పయనిస్తున్నది. ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రజలు కూడా తమ రాజధాని నగరాన్ని నిర్మించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం. కొత్త రాజధానికి శంకు స్థాపన చేసుకున్నందుకు వారికి అభినందనలు. ఈ అన్యోన్యత కలకాలం నిలవాలని కోరుకుందాం.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, డిసెంబర్ 29, 2015

తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఉద్యమస్ఫూర్తితో నడుద్దాం...


తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అరవై ఏండ్ల వలసపాలనలో విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలి. 

తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక ఎత్తు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే కర్తవ్యం మరోఎత్తు. అందుకే నేడు ప్రజలు ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ గురుతర బాధ్యతగా భావిస్తే తెలంగాణ అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజలు ఏ ఆశ లు, ఆకాంక్షల కోసం ప్రాణాలు త్యాగం చేశారో.. ఆ ఆశయ సాధన కేవలం పునర్నిర్మాణం ద్వారానే సాధ్యమవుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వలసపాలకుల పెత్తనాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణం ఎలా? ఆంధ్ర వలస పాలకులు అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు కాదని, ఆంధ్ర ప్రాంత వలస పాలకులు మాత్రమేనని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. ఆచరణ ద్వారా రుజువు చేసింది. ఆంధ్ర ప్రాంత సంపన్న పాలకవర్గం అరవై ఏళ్లు పాలించారు. ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇక్కడి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, నిక్షేపాలు అన్నింటిని కాపాడుకొని తెలంగాణ ప్రజలకు చెందేలా కృషిచేయాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిని, ఆంధ్ర పాలకుల కుట్రలను ఓడించాలి.


తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి 16 నెలలు అయింది ఇప్పటికీ 231 ప్రభుత్వరంగ సంస్థల విభజన జరుగలేదు. ప్రభుత్వ సంస్థల, శాఖల విభజన జరిగితే మరో యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణకే చెందుతాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు మార్గం సులువవుతుంది. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందుపరిచినట్లుగా, అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లో విభజన జరగడానికి కావలసిన అన్ని సెక్షన్లు ఉన్నా ఆంధ్ర పాలకులు మోకాలడ్డుతున్నారు. కేంద్రం బయ్యారం స్టీల్ ప్లాంట్, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీకల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో కాలయాపన చేస్తున్నది. తెలంగాణలో 6300 కిమీ మేర రోడ్డును ప్రతిపాదిస్తే 1200 కి.మీ. రోడ్లకు మాత్ర మే కేంద్రం అనుమతించింది. రేషన్ బియ్యం కోటా, బడ్జెట్ కేటాయింపుల్లో, ఎన్టీపీసీ విద్యుత్ పాంట్ల పట్ల వివక్ష చూపుతున్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక ఆటంకాలను అధిగమించాలి.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, పునర్నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అందరూ ఐక్యంగా కదలాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా ఉమ్మడిగా ఉద్యమించామో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఐక్యంగా కదలాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పట్ల కనబరుస్తున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి.


తెలంగాణ అభివృద్ధి కూడా ఆందోళనలో, ఆరాటంలో భాగమేనని గుర్తించలేని వారు పునర్నిర్మాణంలో భాగస్వాములు కాకుండా పారిపోతారు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 18 నెలలు గడిచింది. ఆంధ్రా పాలకుల కుట్రలు, ఎలా పట్టి పీడిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. మధ్యప్రదేశ్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం ఆరు నెలల కాలంలోనే అన్ని విభజనలు జరిగిపోయాయి. ఉమ్మడిగా ఉన్న అనేక సమస్యలు సులభంగా పరిష్కారమయ్యాయి. కానీ తెలంగాణలో కాలయాపన జరగడానికి ఆంధ్ర వలసపాలకుల కుట్రలు, కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేది వాస్తవం.


ఆంధ్ర వలసవాదుల ఆధిపత్యం అన్నిరంగాలతో పాటు మీడియా రంగంపై ఉన్నది. దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆవగింజంత చూపించి, లోపాలను తాటికాయంత చూపించడం వీరి నైజం. ఆరోపణ కోసం ఆరోపణ, విమర్శ కోసం విమర్శ అనే వింత పోకడను ప్రదర్శిస్తున్నారు.


ఉదాహరణకు- మిష కాకతీయ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ పని ప్రారంభమైనప్పటి నుంచి ఇది కమీషన్ మిషన్ అనీ, కాంట్రాక్టుల కోసమని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. నిజాం కాలంలో తవ్విన చెరువులను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలస పాలకులు ఎంత ఘోరంగా నిర్లక్ష్యం చేశారో తెలిసిందే. ఇక ఆక్రమణల సంగతి సరే సరి. అరవై ఏండ్ల నాటి నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ.. చెరువుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రతిపక్షాలు మిషన్ కాకతీయపై దుమ్మెత్తి పోసినా ప్రజలు మాత్రం సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రచారం చేసిన వీరు రైతులకు భరోసా కల్పించే కర్తవ్యం గానీ, ఆత్మహత్యల నివారణకు ఏ ఒక్క కార్యక్రమం కానీ చేపట్టకపోగా రైతుల సమస్యలను రాజకీయ ప్రచారం కోసం వినియోగించుకున్నారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పని అప్రజాస్వామిక చర్యగానే భావించాలి.
ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, కొన్ని సంఘాలు తెలంగాణ అభివృద్ధి గురించి కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కార్యక్రమానికి పూనుకున్నాయి. తప్పుడు అవగాహన కలిగిన వీరు, అసహనంతో మాట్లాడుతూ జరుగరానిది ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడటంతోనే తిరిగి దొరల రాజ్యం ఏర్పడినట్లు, భాగస్వామ్య వ్యవస్థ మళ్లీ పుట్టిందన్నట్లు ప్రచారం చేస్తున్నారు. వీరికి ఒకటే సమాధానం. ఇది వర్గ వ్యవస్థ, భూస్వా మ్య వ్యవస్థ కూలిపోలేదు. కానీ మళ్లీ పుట్టిందని మాట్లాడుతున్నారు. వర్గ వ్యవస్థ ఉన్నంత కాలం అణచివేత, నిర్బంధం ఉంటుంది. ఇది వాస్తవం. నిర్బంధాలు, దాడులను నిరసించడం, వ్యతిరేకించడం కంటిన్యూగా సాగే ఉద్యమ క్రమం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే పోలీసుల చర్యల గురించి గోల పెడుతున్నారు. ఆంధ్ర వలస పాలనలో ఎన్‌కౌంటర్ హత్యల పట్ల మౌనం వహించినవారు కూడా.. స్థల, కాల, నూతన పరిణామాల పేరిట నయా కుట్రలు పన్నుతున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ, అప్రతిష్ట పాలు జేసేందుకు మీడియాను ఆయుధంగా వినియోగించుకుంటున్నారు.


తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అరవై ఏండ్ల వలసపాలనలో విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలి. ఇందుకోసం ప్రజల అండదండలు, సంపూర్ణ మద్దతు కావాలి. ఆందోళనలు, నినాదాలు, ఉద్యమాల స్థానంలో పటిష్టమైన నిర్మాణం, అభివృద్ధి సాధించి తీరాలి. దీనికోసం ప్రభుత్వాల మద్దతు కావాలి. లేదంటే జరుగుతున్న పొరపాట్లను ఎత్తిచూపాలి. ప్రజానుకూలంగా పాలన సాగేట్లు చూడాలి. 


అదే సమయంలో ఆయా పార్టీలు ప్రజా సంఘాల నాయకత్వంలో ప్రజలను కదిలించే పోరాట పటిమ ఉందని, ఉద్యమ స్ఫూర్తి ఉందని అనుకోవడంతోనే సరిపోదు. ప్రజా ఆకాంక్షలను గుర్తించి వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. ఈ స్థితిలో ఉద్యమాలు ముందుకు వెళ్లాలి. ఉద్యమ దశ, దిశ మొత్తం ఆంధ్ర పాలకులపైన కేంద్ర ప్రభుత్వ వివక్షతా విధానాలపైన పోరాడే విధంగా ఉండాలి.


ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణం కోసమని అందరూ గుర్తించాలి. ఈ పునర్నిర్మాణం లేకపోతే మనకు దక్కింది ఏమిటనేది ప్రశ్న వేసుకోవాలి. భారతదేశ పటంలో తెలంగాణ రాష్ర్టాన్ని చూసి, సంబురపడటం ఒక్కటే కాదు, అది తెలంగాణ ప్రజల పురోగమనానికి నాంది కావాలి. చైతన్యానికి మరోపేరు కావాలి.


వ్యాసరచయిత: బి. మోహన్ రెడ్డి



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, డిసెంబర్ 25, 2015

అసమగ్ర తెలంగాణ రాష్ట్రంలో....స్వంత హైకోర్టు ఎండమావియేనా?

రేపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ పతాకం జేగీయమానంగా ఎగిరినట్లయితే హైదరాబాద్ నగరం తెలంగాణ నగరం కాదన్న విష ప్రచారానికి మూడు పార్టీలు, విశేషించి మోదీయుల కూటమి, పచ్చమీడియా పడగ విప్పి బుసలు కొట్టే ప్రమాదముండదు. వరంగల్లు విజయం స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలను నివారించక తప్పదు.


"WE ARE ALL PROUD OF THE HAPPY OCCASIoN WHEN THE ANDHRA STATE CAME INTO EXISTENCE, THERE WAS A FEELING OF INCOMPLETENESS. BUT NOW WITH THE CONSTITUTION OF THE HIGH COURT, THE LONG STANDING DESIRE AND ASPIRATIONS OF THE ANDHRAS HAVE BEEN FULFILLED.."

rao


ఇవి కోకా సుబ్బారావు గారి మాటలు: 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత తొమ్మిది నెలలకు, 1954 జూలై 5వ తేదీన గుంటూరులో ఆంధ్రరాష్ట్రం హైకోర్టు ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి దేశ వ్యవహారాల శాఖామంత్రి కైలాస్ నాథ్ కట్జూ ఆంధ్రరాష్ట్రం హైకోర్టును ప్రారంభించారు. ఆంధ్రరాష్ట్ర హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. గుంటూరులో తమ హైకోర్టు ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కోకా సుబ్బారావు పైన ఉదహరించిన మాటలు అన్నారు - "ఆంధ్రరాష్ట్రం అవతరించిన ఈ తరుణం మనందరికీ గర్వకారణం, సంతోషదాయకం. కానీ, అసమగ్రతా భావం వ్యక్తమైంది. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటు కావడంతో ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేరింది..." కోకా సుబ్బారావు మాటల తాత్పర్యం ఇది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందుకు గర్వించినా, సంతోషపడినా హైకోర్టు ఏర్పాటు కాకపోవడంవల్ల రాష్ట్రం అసమగ్రం అన్న భావం వ్యక్తమైందని సుబ్బారావు అన్నారు. 


హైకోర్టు ఏర్పాటుతో రాష్ట్రం సంపూర్ణ స్వరూపం ధరించిందన్న అభిప్రాయం ఆయన మాటల్లో ప్రస్ఫుటమైందనడంలో అనుమానం లేదు. 28 నెలల తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గుంటూరులోని ఆంధ్రరాష్ట్ర హైకోర్టు వెంటనే (ఎంతమాత్రం ఆలస్యం కాకుండా) రాజధాని హైదరాబాద్‍కు వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం హైకోర్టు, ఆంధ్రరాష్ట్రం హైకోర్టు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. తరువాత ఆయన సుప్రీంకోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి 1967లో రిటైరయ్యారు. అదే సంవత్సరం ఆయన ప్రతి పక్షాలన్నింటి ఉమ్మడి అభ్యర్థిగా మూడవ రాష్ర్టపతి పదవికి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంతో పాటు హైకోర్టు కూడా ఏర్పాటు కాకపోవడం వల్ల రాష్ర్టం అసమగ్రమైనదన్న భావం కలిగిందన్న ఆయన మాట విలువైనది, గమనార్హమైనది. హైకోర్టు లేనందువల్ల రాష్ట్రం అసమగ్రమైనదన్న అభిప్రాయం, అసంతృప్తి సహజమైనవి, సహేతుకమైనవి.

మరి ఇప్పుడో...? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా... రాష్ట్రంతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఏర్పాటు కాకపోవడం... తెలంగాణ ప్రజలకు అసంతృప్తి కల్గిస్తుంది కదా! తమకు అరవై సంవత్సరాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా లభించిన రాష్ట్రం అసమగ్రమైనదన్న భావం (హైకోర్టు ఏర్పాటు కానందువల్ల) తెలంగాణ ప్రజలకు కూడా కలుగుతుంది కదా! కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన పిదప తొమ్మిది మాసాలకే గుంటూరులో ఆంధ్ర హైకోర్టు ఏర్పాటైంది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పందొమ్మిది నెలలైనా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కావడం లేదు. పందొమ్మిది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం, పార్లమెంటు సభ్యులు, న్యాయవాదులు (ఉద్యమం కూడా నిర్వహిస్తూ), తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏక కంఠంతో తెలగాణ హైకోర్టు కోసం నిర్విరామ, నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. హైకోర్టు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. హైదరాబాద్‌లో కొంతకాలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టుకోవడానికి భవనాలు తదితర అన్ని సదుపాయాలు సమకూర్చుతామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. 


కానీ... కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ, వాయిదాలు వేస్తూ, మభ్యపెడుతూ, మాటల మిఠాయిలు తినిపిస్తూ కాలక్షేపం చేస్తున్నది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు మీద చేసిన ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర విభజన ఇష్టంలేని మోదీయులకు విభజన చట్టాన్ని అమలు జరపడంలో అసలే ఆసక్తి లేదు. అరవై సంవత్సరాల కిందట ఆంధ్ర రాష్ర్టానికి అయాచితంగా తొమ్మిది మాసాలలో వచ్చిన హైకోర్టు తెలంగాణ రాష్ర్టానికి పందొమ్మిది మాసాలైనా ఎందుకు రావడం లేదు? అరవై సంవత్సరాల కిందట అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమర్థత, కార్యదక్షత, నిష్పాక్షికత ఇప్పటి మోదీ ప్రభుత్వంలో కొరవడ్డాయనుకోవాలా? స్వాతంత్య్రానంతరం కేవలం ఆరు సంవత్సరాలకు కేంద్రంలో ఉన్న పరిపాలనా యంత్రాంగం, కమ్యూనికేషన్ సదుపాయాలు, పాలనా నైపుణ్యంతో పోల్చినప్పుడు ఇప్పటి పరిపాలనా యంత్రాంగం, కమ్యూనికేషన్ వ్యవస్థ, పాలనా నైపుణ్యం నిజానికి ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయి.

అయినా...

అప్పుడు తొమ్మిది మాసాలకే నెరవేరిన పని (హైకోర్టు ఏర్పాటు)... ఇప్పుడు పందొమ్మిది మాసాలైనా... ఎందుకు కావడం లేదు? మినిమమ్ గవర్నమెంట్ - మాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో మోదీయులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ నినాదం మాగ్జిమమ్ గవర్నమెంట్ - మినిమమ్ గవర్నెన్స్‌గా మారిందా? మాటలే గాని చేతలు లేవు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం, టీం ఇండియా నినాదాలతో మోదీ ప్రభుత్వం ముచ్చట్లు చెబుతున్నది. మోదీ ప్రభుత్వం నిజానికి రాష్ట్రాలకు రాష్ట్ర పార్టీలకు విలువ ఇవ్వడం లేదు. అందువల్ల, తెలంగాణ హైకోర్టు ఎండమావి అవుతున్నది. అవిభక్త రాష్ట్ర ఉద్యోగుల విభజనలో కమల నాథన్ కమిటీ ఒక అంగుళమైనా ఎందుకు ముందడుగు వేయడం లేదు? నదీ జలాలలో న్యాయంగా తెలంగాణ వాటా ఎందుకు లభించడం లేదు? గత పందొమ్మిది మాసాలలో మోదీ ప్రభుత్వం ఆంధ్రకు ఇచ్చింది ఎంత? తెలంగాణకు ఇచ్చింది ఎంత? వీటిపై ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తారా మోదీయులు? ఇచ్చింది ఏమీ లేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే: తెలంగాణ ఏడు మండలాలను (ఖమ్మం జిల్లాలో) కబళించడం, ఆంధ్రకు దత్త పరచడం! ఆంధ్ర మీద ప్రేమ, తెలంగాణ పట్ల ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంతో పాటే తమ హైకోర్టు ఏర్పడాలన్నది తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ. దీనిని కేంద్రం గుర్తించడంలేదు. ఏడు మండలాల కబళింతతో కుట్రలు ఆగడం లేదు! తెలంగాణ నడి గడ్డ మీద ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణ గుండె. ఈ వాస్తవాన్ని హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసిన వారు, ఉమ్మడి రాజధానిలో తెలంగాణ హక్కులను విస్మరించి సెట్లర్ల హక్కులు, ప్రయోజనాల కోసం అహర్నిశలు ఆరాట పడుతున్న వారు గుర్తించడం లేదు. హైదరాబాద్ నగర పాలనను ఉమ్మడి గవర్నర్‌కు అప్పగించాలన్న కుట్ర తెలంగాణ మెడ మీద కత్తిలా వేలాడుతున్నది. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి సంస్థలు, తెలంగాణ హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించడానికే. ఆంధ్ర న్యాయమూర్తుల సంఖ్య అధికంగా ఉన్న ఉమ్మడి హైకోర్టులో గత పందొమ్మిది మాసాలలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహుశా ఇరవై కంటే ఎక్కువ స్టే ఆర్డర్లు జారీ అయి ఉంటాయి. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ ప్రజల సొత్తు కాదన్న దుష్ప్రచారం జరుగుతున్నది. తెలగాణ అస్తిత్వ భావం, తెలంగాణ వాదం హైదరాబాద్ నగరంలో బలంగా లేవన్న తప్పుడు ప్రచారం జరుగుతున్నది. 

సెట్లర్లు ఎంతమంది ఉన్నా, దొంగ ఓటర్లు ఎంత మంది ఉన్నా, మొదటి నుంచి తెలంగాణ సెంటిమెంట్‌కు కేంద్రం హైదరాబాద్ నగరమే. 1969-70 ఉద్యమకాలంలో బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఒత్తిడులు తెచ్చినా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాడు నాయకత్వం వహిస్తున్న తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి లక్ష్మీనారాయణ హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైనారు. కలకత్తా బెంగాలీల, ముంబై మహారాష్ట్రల, చండీగఢ్ పంజాబీల, బెంగుళూరు కన్నడిగుల, తిరువనంతపురం మళయాళీల నగరాలైనట్లు... హైదరాబాద్ తెలంగాణుల నగరం. హైదరాబాద్‌లో ఆంధ్రుల సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు - తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాలు ముఖ్యం. నిద్రలో సైతం సెట్లర్ల యోగక్షేమాల కోసం కలవరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, ముఖ్యంగా కేంద్రంలో పెత్తనం చేస్తున్న బీజేపీలు... తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోయడం... ఒక రోజు ఆపి, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ నదీ జలాలు, తెలంగాణ నిధులు, తెలంగాణ ఉద్యోగాల కోసం ఢిల్లీ లో, కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు? మోదీ ప్రభుత్వంలో... బీజేపీ, టీడీపీలు ప్రధాన భాగస్వామ్య పక్షాలనా? 


ఈ రెండు పార్టీల లోకల్ నేతలు తెలంగాణ హైకోర్టు కోసం, తెలంగాణ ఇతర హక్కులు, ప్రయోజనాల కోసం గత పందొమ్మిది మాసాలలో చేసిందేమిటి? ఏమీ లేదు. రేపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ పతాకం జేగీయమానంగా ఎగిరినట్లయితే హైదరాబాద్ నగరం తెలంగాణ నగరం కాదన్న విష ప్రచారానికి మూడు పార్టీలు, విశేషించి మోదీయుల కూటమి, పచ్చమీడియా పడగ విప్పి బుసలు కొట్టే ప్రమాదముండదు. వరంగల్లు విజయం స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలను నివారించక తప్పదు.


ఈ వ్యాసం పూర్తి వివరాలకై: దీనిపై క్లిక్ చేయండి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!



గురువారం, డిసెంబర్ 17, 2015

తెలంగాణపై ఏపీ మరో కుట్ర!

- రెవెన్యూశాఖలో విభజన జరుగకుండానే 
- ఆంధ్రా ప్రాంత ఉద్యోగుల పదోన్నతులకు సన్నాహాలు
- ఏకపక్షంగా డీపీసీ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు 
- తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం 
- నేడు ఏపీ సీసీఎల్‌ఏ ఎదుట ఆందోళన

సీమాంధ్ర సర్కారు విభజన చట్టాలను, న్యాయాన్ని భేఖాతర్ చేస్తున్నది. కీలకమైన రెవెన్యూశాఖలో పదోన్నతుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగుల విభజన జరుగకుండానే ఏకపక్షంగా ఆంధ్రా ప్రాంత రెవెన్యూ అధికారులకు పదోన్నతులు ఇచ్చి తెలంగాణకు పంపాలని కుట్ర పన్నింది. రాష్ట్ర విభజన జరిగి 18 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగులు, అధికారుల విభజన జరుగలేదు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీ ఇంకా పూర్తిగా చేయక ముందే ఏపీ ప్రభుత్వం తమ ప్రాంతంవారికి పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధమైంది. 


గురువారం ఏపీ సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఉమ్మడి డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ డిప్యూటీ కలెక్టర్లు తెలంగాణ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 475 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉండగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కేవలం 176 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మాత్రమే ఉన్నాయంటూ డీపీసీ నిర్వహించడం సరికాదన్నారు. వాస్తవంగా ఉమ్మడిగా డీపీసీ నిర్వహిస్తే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించాలని, డీపీసీలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. పోస్టులు, సీనియార్టీలిస్ట్‌ల తయారీలో తెలంగాణ సీసీఎల్‌ఏ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ ఏకపక్షంగా డీపీసీ నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై వెంటనే స్పందించిన రేమండ్ పీటర్, ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి సూర్యకుమారితో ఫోన్‌లో మాట్లాడారు. డీపీసీ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏ ప్రాతిపదికన డీపీసీ నిర్వహిస్తారని ప్రశ్నించారు. అయితే మంజూరైన పోస్టులకు లెక్కప్రకారం సీనియార్టీ లిస్ట్ తయారు చేశామని ఆమె సమాధానం ఇచ్చారు. 


పదోన్నతుల విషయంలో కోర్టుధిక్కరణ కేసు ఉన్నందున డీపీసీ నిర్వహిస్తున్నామన్నారు. కమలనాథన్ కమిటీకి 176 మంజూరైన పోస్టులు ఉన్నాయని చెప్పామని, సీనియార్టీ జాబితా ఇచ్చామని తెలిపారు. దీంతో విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయం చేయవలసి ఉందని రేమండ్ పీటర్ అన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం నిర్వహించే డీపీసీని రద్దు చేయాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గురువారం ఏపీ సీసీఎల్‌ఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శివశంకర్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.




జై తెలంగాణ! జై జై తెలంగాణ!!