గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 18, 2014

విద్యుత్‌సౌధను తెలంగాణకే కేటాయించాలి...


-లేదంటే భారీ ఉద్యమం
-స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన: శివాజీ
-సీమాంధ్రుల కుట్రలపై విద్యుత్ ఉద్యోగుల అత్యవసర సమావేశం

రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో విద్యుత్‌సౌధను పూర్తిగా తెలంగాణకే కేటాయించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజీ డిమాండ్ చేశారు. 21లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని, లేనిపక్షంలో 23 నుంచి విద్యుత్‌సౌధ ముందు రిలే నిరహార దీక్షలు ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం విద్యుత్‌సౌధ తెలంగాణ ఉద్యోగుల అత్యవసర సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా వసతుల విభజనపై విడుదల చేసిన జీవో 207 ప్రకారమే విద్యుత్‌సౌధను తెలంగాణకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్ర ఉన్నతాధికారుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ట్రాన్స్‌కోకు చెందిన 15 మంది ఇంజినీర్లను సీమాంధ్ర ప్రాంతంలో వివిధ విభాగాల్లో పని చేయించుకుంటూ, వారి వేతనాలను తెలంగాణ ట్రాన్స్‌కో ద్వారా చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కోలో పనిచేసే ఉద్యోగులకు తెలంగాణ ట్రాన్స్‌కో వేతనాలు ఇవ్వాలని నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలలో ఉన్నత స్థానాల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న స్థానాలలో సీమాంధ్రులను నియమిస్తున్నారని, ఈ పోస్టులలో తెలంగాణవారినే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన సైతం స్థానికత ఆధారంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగులు సుశీల్‌కుమార్, రాజేశ్వర్‌రావు, రవి, చంద్రయ్య, భద్రయ్య, నర్సిరెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ, యూసుఫ్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి