-ఆంధ్రా బాబు తీరుపై అప్రమత్తతతో ఉండాలి
-సీమాంధ్ర పాలకుల తప్పులను సరిదిద్దాలె..
- మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
-ప్రజలకు సుపరిపాలన అందిద్దాం.. మన పాలన చూసి దేశం గర్వించాలె
-పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి జరుగొద్దు
-క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ
-ఏపీతో వివాదాంశాలు, స్థానిక ఎన్నికలపై రెండు గంటలపాటు చర్చ
-జెడ్పీ చైర్మన్ ఎన్నికల కోసం మంత్రులకు జిల్లాల బాధ్యతలు
-సీమాంధ్ర పాలకుల తప్పులను సరిదిద్దాలె..
- మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
-ప్రజలకు సుపరిపాలన అందిద్దాం.. మన పాలన చూసి దేశం గర్వించాలె
-పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి జరుగొద్దు
-క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ
-ఏపీతో వివాదాంశాలు, స్థానిక ఎన్నికలపై రెండు గంటలపాటు చర్చ
-జెడ్పీ చైర్మన్ ఎన్నికల కోసం మంత్రులకు జిల్లాల బాధ్యతలు
అవసరమైతే ఎక్కడైనా తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు న్యాయవాదులను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. సొంత రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే పక్క రాష్ట్రం వ్యవహారాలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. మంత్రుల పేషీల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి కూడా జరుగటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
అత్యధిక జెడ్పీ స్థానాలను దక్కించుకోవాలె
జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకొనేందుకు కృషి చేయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హంగ్ ఏర్పడిన జిల్లాల్లో చైర్మన్ పోస్టులను దక్కించుకొనేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైనప్పటికీ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేసి విజయం సాధించేందుకు పలువురు మంత్రులకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి