గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 30, 2015

సీనియారిటీ జాబితా తారుమారు...!!!

 


-సచివాలయ ఏఎస్‌ఓల పదోన్నతుల్లో ఏపీ ఏకపక్ష ధోరణి
-తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానేసీనియారిటీ జాబితా తయారీ
-మండిపడుతున్న తెలంగాణ ఉద్యోగులు
-తిప్పిపంపాలని ప్రభుత్వ సీఎస్‌కు వినతి

ఉమ్మడి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏపీ సర్కారు యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నది. ఆస్తుల పంపిణీలోనే కాదు.. ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లోనూ అవరోధాలను కల్పిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం లేకుండానే సచివాలయ ఏఎస్‌ఓల సీనియారిటీ జాబితాను విడుదల చేసి తాజాగా మరోసారి తన ఆధిపత్య దురంహంకారాన్ని ప్రదర్శించింది. 2014 జూన్ ఒకటో తేదీ నాటి సీనియారిటీ జాబితా ప్రాతిపదికనే ఉద్యోగుల పంపిణీ జరగాలి. కానీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా కొత్త సీనియారిటీ జాబితాను విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగుల్లోనూ డైరెక్ట్ రిక్రూటీలు, ప్రమోటీల మధ్య సీనియారిటీ విషయంలో గొడవలు ఉన్నాయి. 


1990-92 మధ్య కాలంలో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్‌గా ఎంపికైన వారు 1998-2001 మధ్య ఏఎస్‌ఓలుగా పదోన్నతులు పొందారు. వారికీ.. 2002లో నేరుగా ఏఎస్‌ఓలుగా ఎంపికైన ఉద్యోగులకు సీనియారిటీ అంశంలో 2010 నుంచి తగాదా నడుస్తున్నది. సమస్య కోర్టుల దాకా వెళ్లింది. దీనిపై ప్రభుత్వం 19-3-1998 నుంచి 19-10-2001 మధ్య నియమితులైన 151 మంది ఏఎస్‌ఓల సీనియారిటీ లిస్టును (జీఓ ఎంఎస్ నం.347-జీఏ,ఎస్‌యు-2 ద్వారా) 2010 జూన్ 28న నోటిఫై చేసింది. అందులో 2002లో నేరుగా నియామకమైన ఏఎస్‌ఓల కంటే 27 మంది ప్రమోటీ ఏఎస్‌ఓలను పుష్ డౌన్ చేసినట్లు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 


దీంతో విభేదించిన డైరెక్ట్ రిక్రూటీ ఏఎస్‌ఓలు కేసు వేయగా 1992 నుంచి ఏర్పడ్డ ఖాళీలను లెక్కించాలని ఏపీఏటీ తీర్పునిచ్చింది. ఈ తీర్పును ప్రమోటీ ఏఎస్‌ఓలు హైకోర్టులో చాలెంజ్ చేశారు. 2012 ఫిబ్రవరి 22న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఏపీఏటీ ఆర్డర్‌ను సస్పెండ్ చేయడాన్ని నిరాకరించింది. ఏపీఏటీ ఆర్డర్ ప్రకారం సీనియారిటీ లిస్టును తయారుచేసి రెండు నెలల్లో సమర్పించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఆఫీసర్ కమిటీ రిపోర్టు ఆధారంగా సీనియారిటీ లిస్టును తయారు చేసి ప్రభుత్వం (2013 జూలై 19 తేదీ, మెమో 2636/ఎస్‌యూ-2/2012-9) హైకోర్టుకు సమర్పించింది. 


ఈ మెమోను కొందరు అవినీతి అధికారులు హైకోర్టు నుంచి తిరిగి తీసుకొచ్చినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత సీరియారిటీ లిస్టును రివైజ్ చేయడానికి నోట్ ఆర్డర్ పాస్ చేయడంతో, డైరెక్ట్ రిక్రూట్ ఏఎస్‌ఓలు తమ సీనియారిటీ లిస్టును ఇంకా హైకోర్టు ముందు ప్రభుత్వం సమర్పించలేదని కంటెప్ట్ వేశారు. దాన్ని తప్పించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రివైజ్డ్ సీనియారిటీ లిస్టును తయారు చేసి మెమో నం.2636/ఎస్‌ఓ.5/ఏ1/12-11, తేదీ.15.7.2015ను రూపొందించింది. 


15 రోజుల్లో అభ్యంతరాలను తెలపాలంటూ ఏపీ, తెలంగాణలో పనిచేస్త్తున్న ఏఎస్‌ఓలకు సర్వ్ చేయాలని ఆదేశించింది. 27 మంది ఏఎస్‌ఓలను పుష్‌డౌన్ చేయడంతో పాటు మరో 200 మంది సీనియారిటీని కుదించింది. ఏపీ వైఖరి వల్ల తెలంగాణ ఉద్యోగులే అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ ఇచ్చిన జాబితాను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని, తిప్పి పంపాలని కోరారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, జులై 28, 2015

అబ్దుల్ కలాంకు అశ్రు నివాళి..


అబ్దుల్‌కలాం తమిళనాడులోని రామేశ్వరంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో అనేక కష్టాలను అనుభవించి ఉన్నత చదువులు చదివారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా సాగిన కలాం ప్రస్థానంలో ఆయన దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించిన కలాం దేశం గర్వించదగిన స్థాయికి చేరుకున్నారు. అరవయ్యో దశకంలో డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా ఆయన దేశానికి అనేక విజయాలు అందించారు.

భారతదేశపు  పదకొండవ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మరణంతో భారత శాస్త్ర, సాంకేతిక రంగం మార్గదర్శకున్ని, పెద్దదిక్కును కోల్పోయింది. కలాం శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి అంతా ప్రజల కోసమేనని చాటి చెప్పారు. సైన్సును ప్రజల కోసం వినియోగించడంలో అగ్రభాగాన నిలిచారు. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల ముందు తలవంచి నిలిచేలా చేసిన కలాం తనదైన ప్రజానుకూల దృక్పథంతో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. భారత అణ్వస్త్ర పితామహుడిగా, క్షిపణి రంగ రూపశిల్పిగా దేశానికి సేవలందించి భారత కీర్తిపతాకను విశ్వ వినువీధిలో సమున్నతంగా నిలిపారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన కలాం పీఎస్‌ఎల్ వీ, ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కలలు కనండి వాటి సాకారం కోసం కష్టపడండి అన్న ఆయన మాటలు కోట్లాదిమంది యువతకు ఆదర్శం. భారత అణుశాస్త్ర పితామహుడిగా రక్షణ రంగంలో కలాం చేసిన కృషి మన దేశ ప్రతిష్ఠను ప్రపంచపటంలో నిలబెట్టాయి. దేశంలో ఆయన స్ఫూర్తితోనే అనేకమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు వచ్చారంటే అతిశయోక్తి కాదు.

ఆధునిక టెక్నాలజీతో అమెరికా, రష్యా లాంటి దేశాలు అందనంత ముందుకు దూసుకుపోతున్న సమయంలో అంతరిక్ష నౌకలకు రూపకల్పన చేసి విజయవంతంగా ప్రయోగించారు. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ తదితర క్షిపణులు కలాం కృషితో భార త అమ్ములపొదిలోకి చేరాయి. కలాం అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణులకు రూపకల్పన చేయడం విశేషం. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక పాత్ర పోషించారు. అలాగే శాస్త్రసాంకేతిక రంగాలు ప్రజల జీవనంలో సమూల మార్పుకు, జీవన ప్రమాణాలు వృద్ధి చెందేందుకు కృషిచేయాలని చెప్పడమే కాదు, ఆచరణలో నిజం చేసిన ఆయన, ప్రజల జీవనంలో మౌలిక మార్పుకోసం కృషి చేశారు. నగర ప్రజలకు అందుబాటులో ఉన్న సాంకేతికతను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అప్పుడే నిజమైన అభివృద్ధి మార్పు సంభవిస్తుందని చెప్పి ప్రొవిసన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ టుం రూరల్ ఏరియాస్ (పురా)కు రూపకల్పన చేశారు.

శాస్త్రవేత్తగా అబ్దుల్‌కలాం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. అంతేకాదు ఆయనను ఈ దేశ పదకొండవ రాష్ట్రపతిగా ఎంచుకుని సమున్నతంగా గౌరవించింది. దానికనుగుణంగానే ఆయన ఒక సంక్లిష్ట సమయంలో రాష్ట్రపతి పదవి చేపట్టి భారత ప్రథమ పౌరుని కర్తవ్యాలను నెరవేర్చారు. ప్రజల రాష్ట్రపతిగా ఆయన పేరు గడించారు. అత్యున్నత స్థానంలో ఉన్నా పిల్లలకు దగ్గరైన వ్యక్తుల్లో నెహ్రూ తర్వాత స్థానాన్ని కలాం దక్కించుకున్నారు. ఆయన చివరి శ్వాస వరకు పిల్లలతోనే ఉన్నారు. కలాం తన జీవిత కథను వింగ్స్ ఆఫ్ ఫైర్‌గా వెలువరించారు. ఇంగ్లీషులో ముద్రించిన ఈ పుస్తకాన్ని తర్వాత పదమూడు భాషల్లోకి అనువదించారు. బ్రెయిలీ లిపిలో కూడా ఈ పుస్తకం ముద్రితమవడం విశేషం.
క్షిపణి శాస్త్ర విజ్ఞానాన్ని.., వైద్యశాస్ర్తానికి జోడించి సేవలందించాలని కలాం కలలు కనేవాడు.

ఆ కలలకు అనుగుణంగా ఆయన హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో పనిచేస్తున్నప్పుడు ప్రఖ్యాత కార్డియాలజిస్టు సోమరాజుతో కలిసి తన ఆలోచనలను పంచుకున్నాడు. వీరివురి కృషి, ఆలోచనల్లోంచే గుండె సంబంధ రోగాలనుంచి కాపాడే స్టెంట్ తయారీకి అంకురార్పణ జరిగింది. ఈ ఆలోచనామృతంలోంచే.. కలాం-రాజు స్టెంట్ తయారై ఇవ్వాళ వేలాది మందికి శ్వాసను నిలుపుతున్నది. క్షిపణి శాస్త్ర విజ్ఞానాన్ని వైద్యశాస్త్రంతో జోడించి ప్రజలకు సేవలందించాలన్న ఆయన కలల లోంచి ఉద్భవించిన కలాం- రాజు స్టెంట్ ఎందరినో హృద్రోగం నుంచి కాపాడితే.. అదే గుండెపోటుతో కలాం తుదిశ్వాస విడవటం విషాదం. అత్యున్నత రాష్ట్రపతి పదవిని ప్రజల ముంగిట నిలిపి ప్రజలందరికీ ప్రేమను పంచిన అబ్దుల్ కలాం అమరుడు.


అబ్దుల్ కలాం మాట..

-యువతకు ముఖ్యంగా నేనిచ్చే సందేశం ఏంటంటే.. భిన్నంగా ఆలోచించే సాహసం చేయండి. ఆవిష్కరణల్లో సాహసం చూపండి. ఎవరూ వెళ్లని దారిలో వెళ్లండి. అసాధ్యమనుకొనే దానిని కనిపెట్టేందుకు సాహసం చేయండి. సమస్యలను జయించండి. విజయాన్ని ఒడిసి పట్టండి. ఈ గొప్ప లక్షణాలను యువత తప్పక అలవర్చుకోవాలి.

-నా దృష్టిలో నాయకుడంటే లక్ష్యమున్నవాడు. అభిరుచి ఉన్నవాడు. సమస్యను చూసి భయపడకుండా దానిని ఎలా ఓడించాలో తెలిసినవాడు. పూర్తి చిత్తశుద్ధితో పనిచేయటం నాయకుడికి ఉండాల్సిన అత్యంత ముఖ్య లక్షణం.
-గొప్ప వ్యక్తులకు మతమంటే స్నేహాన్ని పెంపొందించేంది. అల్పులకు అది కొట్లాడుకొనేందుకు ఒక సాధనం.
-ఒకదేశం అవినీతి రహితం కావాలన్నా, గొప్ప మేధస్సులతో నిండాలన్నా సమాజంలో ముగ్గురివల్లనే సాధ్యమని నేను బలంగా నమ్ముతాను. వారే తల్లి, తండ్రి, గురువు.

-ప్రస్తుతం నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే కొనసాగుతున్నందున మనకు ఇంగ్లిష్ తప్పనిసరి. మన భాషల్లో నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలు మొదలవ్వటానికి మరో రెండు దశాబ్దాలు పడుతుందని నేను భావిస్తున్నాను. అప్పుడు మనం కూడా జపనీస్‌లాగా ముందుకు సాగవచ్చు.
-మనిషికి కష్టాలూ అవసరమే.. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలడు.
-విద్యార్థికి ఉండవల్సిన అతిముఖ్య లక్షణాల్లో ఒకటి ప్రశ్నించటం. విద్యార్థులారా ప్రశ్నించడం నేర్చుకోండి.
-మనం స్వేచ్ఛగా లేకపోతే.. ఎవరూ మనల్ని గౌరవించరు.
-కవిత్వమనేది అత్యున్నతమైన సంతోషం నుంచి లేదా అత్యంత విచారం నుంచే వస్తుంది.


జై హింద్      జై అబ్దుల్ కలామ్




సోమవారం, జులై 27, 2015

ఇది నిజంగా సవతి తల్లి ప్రేమే...!!!

Tummalanageshwarrao


రెండు తెలుగు రాష్ర్టాలూ తమకు సమానమేనని, ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇరు రాష్ర్టాల అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తామని పదే పదే ప్రకటనలు గుప్పించే కేంద్ర ప్రభుత్వం.. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపిస్తూ.. పలు విషయాల్లో అన్యాయం చేస్తున్నది. జాతీయ రహదారుల కేటాయింపులో చూపిన వివక్షతో కేంద్ర ప్రభుత్వం నైజం మరోసారి బయటపడింది.


-తెలంగాణకు దక్కని జాతీయ రహదారులు
-కిలోమీటరు కూడా కేటాయించని కేంద్రం
-పునర్వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు
-ఏపీకీ మరో 700 కి.మీ. మంజూరు
-నేడు కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి తుమ్మల భేటీ
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు తక్కువగా ఉన్నాయని, సత్వరమే మరో 1,018 కిలోమీటర్లు కేటాయించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావుతోపాటు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అనేకసార్లు కేంద్రాన్ని కోరారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు. గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించానని, త్వరలో మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల చాలాసార్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తెచ్చారు. 



రాష్ట్రంలో నేషనల్ హైవేస్ బాధ్యతలు చూస్తున్న చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డి కూడా అనేకసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. అయినా కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన జాతీయ రహదారులపై కరుణ చూపలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 700 కిలోమీటర్లు మంజూరు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు జనాభా, ప్రాంతీయ నిష్పత్తి ప్రకారం కేంద్రం జాతీయ రహదారులను కేటాయించాలి. జాతీయ రహదారులు తక్కువగా ఉన్న రాష్ర్టానికి అదనంగా ఇవ్వాలి. చట్టం ప్రకారం ఏపీ కంటే తక్కువగా ఉన్న తెలంగాణకు ఎక్కువ కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలి. కానీ తెలంగాణకు జాతీయ రహదారులను ఇవ్వడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది.

చట్టానికి తూట్లు పొడుస్తూ ఏపీకి మరో 700 కిలోమీటర్లు మంజూరు చేసింది. ఏపీ రాష్ర్టానికి ఇప్పటికే 3300 కిలోమీటర్ల పొడువు జాతీయ రహదారులు ఉండగా, తాజాగా మంజూరీతో 4వేల కిలోమీటర్లకు చేరాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2600 కిలోమీటర్ల రహదారులు మాత్రమే ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జాతీయ రహదారులను ప్రకటించలేదు. కనీసం మరో వెయ్యి కిలోమీటర్లైనా తక్షణమే ప్రకటించాల్సి ఉన్నది.

నేడు గడ్కరీతో తుమ్మల భేటీ..


రాష్ర్టానికి రావాల్సిన జాతీయ రహదారుల అంశంపై రోడ్లు ,భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో అధికారుల బృందం సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానుంది. ఈ అంశాన్ని రోడ్లు భవనల శాఖ మంత్రి పేషీ ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, నేషనల్ హైవేస్ సీఈ గణపతిరెడ్డి కూడా మంత్రితో వెళ్లే బృందంలో ఉన్నారు. మంత్రి గడ్కరితోపాటు ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవేస్ అధికారులను కూడా వారు కలువనున్నారు.

ప్రతిపాదనలివే..


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముందు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఉంచనున్న ప్రతిపాదనలు..
-తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 రాష్ట్ర రహదారులను 1,018 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలి
-సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్‌ఎఫ్)కు అదనపు నిధులు మంజూరు చేయాలి
-ప్రస్తుతం ఉన్న 17 రహదారుల అభివృద్ధి కోసం రూ.557 కోట్లు మంజూరు చేయాలి
-బోయిన్‌పల్లి-కొంపల్లి, ఆరాంగఢ్-శంషాబాద్ నేషనల్ హైవేపై 44 అభివృద్ధి పనుల ప్రస్తావన
-తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రెండో దశలో రాష్ర్టానికి తగినన్ని నిధులు ఇవ్వాలి
జాతీయ రహదారులుగా మార్చాలని కోరనున్న ఆరు రహదారుల వివరాలు..
-హైదరాబాద్ నుంచి నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, బాసర, భైంసా మీదుగా వెళ్లి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే రాష్ట్ర రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి పరచడం(230 కిలోమీటర్లు)
-హైదరాబాద్ నుంచి బీజాపూర్ రోడ్ వయా మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, కొడంగల్ మీదుగా కర్ణాటకను కలుపుతూ వెళ్లే రోడ్డు (133 కిలోమీటర్లు)
-కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా ఉన్న రోడ్డు (220 కిలోమీటర్లు)
-నిర్మల్ నుంచి జగిత్యాల, ఖానాపూర్, మల్లాపూర్, రాయికల్ మీదుగా ఎన్‌హెచ్-61ను కలిపే రోడ్డు (110 కిలోమీటర్లు)
-అశ్వారావుపేట, ఖమ్మం, సూర్యాపేట రోడ్డు (160 కిలోమీటర్లు)
-కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం మీదుగా వెళ్లే రాష్ట్ర రోడ్డు (165 కిలోమీటర్లు)
-మొత్తం ఆరు రహదారులు కలిపి 1018 కిలోమీటర్లు.

ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా పై రహదారుల అభివృద్ధికి అనుమతిస్తే, కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు...నిజమైన ప్రేమే చూపిస్తున్నదని భావించాలి. అనుమతించకుంటే అది తప్పకుండా.....!!!



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




ఆదివారం, జులై 26, 2015

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి కానీ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడ్తమంటే ఊరుకునేది లేదు. తెలంగాణలైతే ఏ సుట్టమైన మూటముల్లె సర్దుకుంటడు. ఇది సెక్షన్ 8 గురించి మాట్లాడేటోళ్లకి కూడా వర్తిస్తది. 


హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా నిద్రలేచేవారు. కానీ ఎన్టీఆర్ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు ఇదీ చంద్రబాబు నాయుడి వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తాను ఎన్కట చేసిన కువ్వారం పనులు మర్షిపోయిండు. అది జెప్తలేడు. ఆయన సొక్కని మనిషే ఐతే ఆంధ్రప్రదేశ్ జనాలకు యాడాది సంది ఏం జేసిండో, ఇంకేం జేస్తడో చెప్పాలె. చెప్తే బండారం బైట పడ్తది. అది చెప్పకుంట ఉండేతందుకే కొత్త ముచ్చట చెబుతుండు. నిజంగనే చెప్పదల్సుకుంటే కొత్తగ కట్టాలనుకునే రాజధాని అమరావతికోసం ఇప్పుడున్న ఊళ్లకు ఊళ్లనే మాయం జేయాల్సిఉంటదని చెప్పాలె. 

సొంత ప్రచారం యావతోటి పుష్కర భక్తుల పాణం పిడాత తీశ్న అని జెప్పాలె. పొద్దు లేషిన దగ్గరి నుంచి పండేదాక హైదరాబాద్‌ను కంట్లె పెట్టుకునుడు, ఆడిపోసుకునుడు బాబుకు అలువాటైంది. అయినా బట్టకాల్షి మీదేసుడు ఈనెకు కొత్తేమి గాదు. మాట్లాడితే సాలు హైదరాబాద్‌ను నేను కట్టిన, మామ నిద్రలేపిండు అంటుండు. అస లు హైదరాబాద్‌కు ఈనె గాని ఆంధ్ర నాయకులు గాని చేసిందేమీ లేదు. దోస్కోని దాసుకునుడు, ఉన్నది లూఠి చేసుడు తప్ప.


srinu


70 యేండ్ల పెద్దమనిషి 50 యేండ్ల సంది తెలంగాణ కోసం కొట్లాడుతున్న (అప్పటికి) కొండాలక్ష్మణ్ బాపూజీని జలదృశ్యం నుంచి రాత్రికిరాత్రే బేదఖల్ చేసింది నువ్వు కాదు? తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు వేదిక ఇచ్చినందుకు నువ్విచ్చిన బహుమానం కాదు అది! నెక్లస్ రోడ్డంటూ హుసేన్‌సాగర్ బొండిగ విష్కి నీ మామ సమాధి కట్టింది నువ్వుకాదు? నాళాను ఆక్రమించి భవంతులు/హోటళ్లు కట్టింది మీ వోళ్లు కాదు? మీ ఆంధ్రోల్ల జమానల్నే కదా ట్యాంక్‌బండ్ మీద అన్నీ మీవోళ్లయే విగ్రహాలు పెట్టుకుంది. 


బాగే ఆమ్‌ని మింగి నోరు తిరగరాని తెలుగు లలిత కళాతోరణం కట్టిందీ మీరే గదా! సర్కా రీ నల్లాలన్నీ బంద్ చేసిందీ, భోలక్‌పూర్ వాసులు డ్రయినేజీ నీల్లు తాగి సావడానికీ కారణం మీ లాంటోళ్లే గదా! అయినా మేము హైదరాబాద్‌ను డెవలప్‌జేసినం అంటుండ్రు. మీరు జేసిందంతా రాస్తే సదివెతందుకే ఏండ్లు పడుతది. రింగురోడ్లను రింగయ్యి అష్టావంకర్లు తిప్పిందీ మీరే కదా! ఇగ రాజకీయాల కొస్తే దానికి మతోన్మాదాన్ని కలిపి మారణహోమానికి పాల్పడిందీ మీ ప్రాంత నాయకులే కదా! మీ ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డగా హైదరాబాద్‌ను చేసిన్రు. శ్రీరాములయ్య షూటింగ్ షురువైన రోజూ, ఆ తర్వాత జరిగిన హత్యలు చూస్తే అది ఈజిగనే సమజైతది. అసలు హైదరాబాద్ సంగతి నీకు తెల్వది. ఎందుకంటే నీకు చరిత్ర అన్నా, చరిత్ర పాఠాలన్నా నచ్చవు కద! నాకు తెల్సింది చెబుత. 


మొత్తం ఏషియా ఖండంలోనే 1902లోనే నోబుల్ బహుమతి పొందినోడు రోనాల్డ్ రాస్. ఈయన మలేరియా రోగానికి కారణాల్ని హైదరాబాద్‌లోని బేగంపేట ల్యాబ్‌లోనే పరిశోధన జేసి కనుక్కున్నడు. అంతెందుకు మేమే సదువుకున్నోల్లం అని చెబుతరు కద. మొత్తం ఇండియాలోనే మొట్టమొదటి పీహెచ్‌డీ, డాక్టరేట్ అది దేశాల్లో చేసింది అఘోరనాథ్ చటోపాధ్యాయ. సరోజిని నాయుడు ఈయన బిడ్డే. 


ఆయన నిజాం కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసిండు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మొత్తానికి నీళ్ళు, డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటు జేసిండు. అదీ హైదరాబాద్ రాజ్యంలోనే! సరోజిని నాయుడు మొదలు, సంగెం లక్ష్మీబాయి, సుగ్రాహుమాయూన్, టిఎస్ సదాలక్ష్మిలు పాత హైదరాబాద్ రాజ్యంలోనే రాణించిండ్రు. అట్లనే ఇప్పటి వరకూ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవి చేపట్టిన ముస్లిం మహిళ మాసూమా బేగం. ఈమె 1952లోనే బూర్గుల రామకృస్ణారావు మంత్రివర్గంలో పనిచేసిండ్రు.


అవును నువ్ అంటున్నట్లు పొద్దున్నే నిద్రలేవడం తెలియదు. ఎందుకంటే దేశంల (అంటే మీ తెలుగుదేశం కాదు బాబూ!) ముంబయి తర్వాత ఎక్కువ టైమ్ మేల్కతోటి ఉండేది హైదరాబాదే. బట్టల మిల్లులు హైదరాబాద్‌ల నడిశినప్పుడు రాత్‌పైలీ దివస్‌పైలీ ఉండేది. ఫ్యాక్టరీల్లో పనిచేసేటోళ్లు రెండు షిప్టూలూ పనిచేసిండ్రు. ఆల్విన్ కంపెనీల ఆరుగాలం కష్టంపడ్డరు. మీరు పాలన షురు జేసినంక ఆల్విన్ మూతపడ్డది. ఐ.డి.పి.ఎల్‌కూ అదే గతి పట్టింది. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని,ఆల్విన్ ఫ్యాక్టరీని మూసేయించితిరి. నిజాం కూడా యిలాజ జేయించుకునే ఉస్మానియా దవఖానను మీ వోళ్ల హాస్పిటళ్లు నడువడం కోసం సావకుండా బత్కకుండ జేస్తిరి. మీ లీలలు ఎన్నని జెప్పేది. అట్లనే మబ్బుల మూడు గంటల నుంచే కూరగాయలు అమ్మెటోళ్లు. మోండా మార్కెట్ల, మిరాలం మండిల, సబ్జీమండిల, గుడి మల్కాపూర్‌ల రైతుల సందడి ఉండేటిది. పాల సప్లయి సరేసరి. అంటే మీ దృష్టిల కంప్యూటర్ జాబ్‌లే ఉద్యోగాలాయె! వాళ్ల కాయకష్టం మీ లెక్కల లేదాయె!


ఎన్టీరామారావు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్‌ల రాత్రి రెండయినా సిటీ బస్సులు తిరిగేవి. ఆయన అధికారంల కొచ్చినంక పది దాటితే బస్సులు బంద్ జేసిండు. హోటల్ చాయ్‌లు 11 దాటితె బంద్ అన్నడు. మస్తుమంది చార్మినార్ ఏరియా నుంచి సికింద్రాబాద్‌ల నౌక్రీ కోసం పొయ్యేది. నౌక్రీ చేసే దుకాండ్లు రాత్రి పదిగంటల దాకా తెరిశే ఉండే. దీంతోటి వాళ్ళు ఇంటికి చేరుకునే సరికి సావుమరణమయ్యేది. అదీ మీ సర్కారు కట్టుకున్న పుణ్యమే! ఇప్పటికీ చార్మినార్ దగ్గర రంజాన్ పండుగైతే సాలు రాత్రి రెండుగొట్టంగ కూడా మార్కెట్ కళకళలాడుతది. మీ దృష్టిల పాతనగరం హైదరాబాద్ కిందికి రాదాయె! 


హైటెక్‌సిటీ మాత్రమే మీకు హైదరాబాద్ నగరం. మరి మాకు మాత్రం మా చార్మినార్ హైదరాబాద్‌కు సంకేతం. అందుకే అసలు హైదరాబాద్ మీకు సమజ్ గాదు. మా హైదరాబాద్ భాష మీకు ఇన్నేండ్లయినా ఒంటపట్టకపాయె. ఎన్కట మీవోళ్లు మాది తౌరక్యాంధ్రం అని ఎక్కిరించిరి. మీరు 40 యేండ్ల సంది హైదరాబాద్‌ల ఉండి ఉర్దూల ఒక్క ముక్క మాట్లాడరాయె. అందుకే మా జిందగీ మీకు సమజ్ గాదు.

మళ్ల జెబుతున్న మాకు మస్కుల లేసేది నీ మామనే నేర్పిండంటే అది దమాక్‌లేని ముచ్చట. ఎన్కటి నుంచి అజహ్ కోసం సలికాలంల కూడా లేషి నమాజ్ జేసింది హైదరాబాదీ ముస్లింలు. 


బ్రహ్మముహూర్తమని పొద్దుగాల నాలుగ్గంటలకు పేపరోల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేది షురూ జేసింది ఎన్టీరామారావే! మబ్బుల నాలుగ్గంటలకు ఇంటర్వ్యూ ఇవ్వాల్నంటే కనీసం ఇంకో గంట ముందుగాల లేవాలె. మరి గప్పుడు లేవాలంటే కనీసం ఆరుగంటల నిద్రన్నా ఉండాలె కద. అందుకే మరి మీరు తొమ్మిది గంటలకు పండుకునే అలవాటు జేస్కోని మమ్మల్ని కూడా తొందరగా పండుకొమ్మని దుకాణాలు షట్టర్లు గుంజేస్తిరి మీ అలవాట్లు మా మీద రుద్ది ఏ గంటో, రెండు గంటలో నిద్రపోయే నగరానికి పొద్దుగాల లేషె అలవాటు జేసినమని తకరారు మాటలు చెప్తున్నరు.


ఈడ పోలిక తీసుక రావద్దు గానీ ఒక విషయం జెప్పాలె. 1970 ఆ ప్రాంతం నాటికి కూడా (ఏలూరు లాంటి పట్టణాల్లో ఇప్పటికీ) విజయవాడ లాంటి పట్టణంలో బహిర్భూమికి కాలువల పొంటనే పొయ్యేది. అట్లా కూసునే పరిస్థితి కల్పించింది మీ ఆంధ్రా ప్రభుత్వాలే. దీన్ని సూడలేక మున్సిపల్ కమిషనర్‌గా వచ్చిన అజిత్‌సింగ్ అనే ఐఏఎస్ అధికారి (ఈయన అప్పటి కేంద్రమంత్రి స్వరణ్‌సింగ్ మేనల్లుడు) ఎక్కడపడితే అక్కడ మరుగుదొడ్లు కట్టించిండు. ఇప్పుడు కొంచెం ఫర్వాలేదు. అంటే మీకు మరుగుదొడ్డి వసతి లేని కాలంలోనే హైదరాబాద్‌ల లండన్ నగరంలో మాదిరిగా డ్రయినేజీ వ్యవస్థ ఉండేటిది. ఐదు లక్షల జనాభా కోసం కట్టిన వ్యవస్థ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అదీ ప్లానంటే. అదీ ముందుసూపంటే!


అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి కానీ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడ్తమంటే ఊరుకునేది లేదు. తెలంగాణలైతే ఏ సుట్టమైన మూటముల్లె సర్దుకుంటడు. ఇది సెక్షన్ 8 గురించి మాట్లాడేటోళ్లకి కూడా వర్తిస్తది. మంచి మనుషులకు మాటల్తో చెప్తే సరిపోతదనే నమ్మకంతో..


వ్యాస రచయిత: సంగిశెట్టి శ్రీనివాస్


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, జులై 25, 2015

బాబు అబద్ధం బట్టబయలు!!!

-అనుమతులు లేని పట్టిసీమ
-అక్రమ ప్రాజెక్టుగా నిర్ధారణ
-పోలవరంలో భాగం కాదన్న కేంద్రం
-ఆ ప్రాజెక్టు సంగతి తెలియదని స్పష్టీకరణ
పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో భాగం కాదని తేలిపోయింది. దానికి ఎలాంటి అనుమతులు లేవని, కేంద్రానికి సమాచారం కూడా ఇవ్వకుండా నిర్మాణం జరుపుతున్నారని నిర్ధారణ అయింది. ఇది పోలవరం ప్రాజెక్టులో భాగమంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు వట్టి అబద్ధాలేనని పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది. తన ప్రాజెక్టును ఎవరి అనుమతి లేకుండానే కట్టుకుంటున్న చంద్రబాబు, ఉమ్మడిరాష్ట్రంలో జీవోలు విడుదలైన తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. పైగా పాలమూరు, నల్లగొండ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని, వీటిని అనుమతి లేకుండా చేపడుతున్నారని కేంద్రానికి లేఖ కూడా రాశారు. తెలంగాణ మీద ఉన్న కక్షను ఇలా చాటుకున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని తెలంగాణను దెబ్బ తీయడానికి బాబు ఎత్తు వేస్తే ఇపుడు తన గుట్టే బయటపడింది. 


babu


బాబు వాదన కొట్టేసిన కేంద్రమంత్రి..


సముద్రంలోకి వృథాగా పోయే నీటిని లిఫ్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించడానికి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చంద్రబాబు ఈ నెల 10న ఢిల్లీలో చెప్పారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని పోలవరంలో భాగమేనని ఆయన నమ్మబలికారు. గోదావరి నదిలో నీళ్ళు కృష్ణాబేసిన్‌కు తరలించడానికే పట్టిసీమ నిర్మిస్తున్నామని చెప్పుకొన్నారు. కానీ పట్టిసీమ పోలవరంలో భాగం కాదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ స్పష్టం చేశారు. 


లోక్‌సభలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అసలు పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ తమకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే, కేంద్రం నుంచి ఆమోదం పొందకుండానే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోంది. 


ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జీవోలు..


తన ప్రాజెక్టుల్లో లొసుగులు పెట్టుకుని చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల మీద పడి ఏడుస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు కొత్తగా రూపొందించారని దీన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వాదన ఎత్తుకున్నారు. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 2009లో తొలిసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీపీఆర్ కోసం ఆగస్టు 2013లో జీవో విడుదలైంది. ఇందుకోసం రూ.6 కోట్లు కూడా మంజూరు చేశారు. పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు రూపొందించిన ఒక డిజైన్‌ను కూడా ప్రభుత్వం పరిశీలించింది.


ఇంత జరిగినా చంద్రబాబుకు ఇది కొత్త ప్రాజెక్టులాగా కనిపించింది. ఈ ప్రాజెక్టును మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా తెరమీదకు వచ్చిందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి గత నెలలో కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఉమాభారతి, జలవనరుల మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ అయ్యి ఫిర్యాదులు చేశారు. 


ఈ ప్రాజెక్టు కొత్తదని, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కృష్ణానది నిర్వహణ బోర్డులో చర్చించలేదని ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేవన్న కారణాన్ని చూపి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వరాదని చంద్రబాబు, సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అడ్డుపుల్లలు వేశారు. 


కానీ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మాత్రం అన్నింటినీ తుంగలో తొక్కి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అదేమని మీడియా ప్రశ్నిస్తే పాలమూరు ప్రాజెక్టు కృష్ణా బేసిన్‌లో రెండు రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టు అనీ, పట్టిసీమ మాత్రం గోదావరిలో కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించిన ప్రాజెక్టు అనే కొత్త వాదన ప్రయోగిస్తున్నారు. అదే నిజమైతే మరి అనుమతులు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర ఏ సమాధానమూ లేదు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, జులై 23, 2015

బాబుదంతా కుట్రల చరిత్రే..బలుల ఘనతే...!!!


తెలంగాణ సర్కారును గొంతు నులిమి చంపాలనే పథక రచన చేసిండు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగం చేయాలనుకున్నాడు. కానీ కేసీఆర్ బాబు తవ్విన బావిలో పడడానికి ఎన్టీఆర్ కాదు కదా! బాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. బాబుకుట్రకు రేవంత్‌రెడ్డి బలి. ఏమంత రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేని రేవంత్‌రెడ్డి ఎగిరెగిరిపడి ఎల్లెల్కల పడ్డడు. ఆంధ్రా నోట్ల కట్టలను రేవంత్ నెత్తిన పెట్టి భస్మాసుర హస్తంలా ప్రయోగించాడు ఆంధ్రాబాబు.ఇందులో అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు పాపం రేవంత్. ఈ విధంగా బాబు ఉచ్చులో మరొకరు బలి.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి కీ.శే. నందమూరి తారకరామారావు గారిచ్చిన బిరుదులు: నేను స్థాపించిన పార్టీలో అక్రమ శిశువు లు, గోముఖ వ్యాఘ్రాలు, మేక వన్నె పులులు తలెత్తుతాయని ముందుగా తెలుసుకోలేకపోయాను. నేను దేవుడినని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టల్లో తేల్లలాగ, పొదల్లో నక్కలాగ కుట్రలు కుతంత్రాలు అల్లారు. ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్టీఆర్ మా దేవుడు, ఆయన విధానాలే అమలు జరుపుతామంటున్నారు. చేతులు జోడించి, నమస్కరించి తుపాకి పేల్చి గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.. 1995 ఆగస్టులో సాక్షాత్తు ఎన్టీఆర్ అన్న మాటలివి. 


పిల్లనిచ్చి, పదవులిచ్చి పార్టీ కీలక బాధ్యతలిచ్చిన ఎన్టీఆర్.. చంద్రబాబును ఉద్దేశించి అన్న మాటలవి. తన రక్తం పంచుక పుట్టిన వారినే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసేలా ఉసిగొల్పే నైపుణ్యం చంద్రబాబుది. తాను కష్టపడి ఇష్టంతో నిర్మించుకున్న రాజకీయ సౌధాన్ని లాక్కున్నాడు అల్లుడు బాబు. ఎన్టీఆర్ ఊరూరు తిరిగి గెలిపించిన వారితోనే వైస్రాయ్ హోటల్ ముందుకు పోయిన ఆయనపై చెప్పులు విసిరేలా ఉసిగొల్పిన ఘనుడు చంద్రబాబు. ఈ చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో గద్దెదించి, అవమానించి, మానసికంగా చిత్రవధ చేసినందుకు వగచి, విలపించి, గుండెపగిలి ఐదు నెలలు తిరగకముందే ఎన్టీఆర్ కన్నుమూశారు. 


ఇది చంద్రబాబు చేసిన మొట్టమొదటి బలి. బాబు వల్ల ప్రథమ బలి. ఈ విధంగా బాబు కా బలి (బాబు వల్ల బలి) లిస్టు తీస్తే చేంతాడంత అవుతుంది. 1995లో ఎన్టీఆర్ మొదలు నిన్నటి రేవంత్‌రెడ్డి వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాబు కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, జిత్తులకు బలైన వారు ఎందరో! చంద్రబాబుకు బంధువులు, మిత్రులు, విశ్వాసపాత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఉపయోగపడేవారు, ఉపయోగపడనివారు...అని రెండే బంధుత్వాలు. ఎప్పటికప్పుడు విధానాలు సంబంధాలు మారిపోతుంటాయి. యూజ్ అండ్ త్రో పాలసీ. నందమూరి హరికృష్ణ, దగ్గుపాటి వేంకటేశ్వర్‌రావు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు బాబు బాధితులే! బాబు వల్ల బలైన బలి పశువులే.


1995కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పద్ధతి విలువలకు విలువవుండేది. 1995 ఆగస్టులో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ద్వారా దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వల్ల మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టినయ్. ప్రభుత్వ యంత్రాంగం పతనమయ్యింది. ఉద్యోగులపై ప్రజలను ఉసిగొల్పి వారిని బలిపశువులను చేసి తాను తప్పించుకున్నాడు. ఉద్యోగులంటే అభివృద్ధి నిరోధకులు అనే అభిప్రాయాన్ని సమాజానికి కలిగించే ప్రయత్నం బాబు అడుగడుగునా చేశాడు. ఎన్నికలంటే ఓ జూదంలా మార్చాడు.కల్లు, సారా, మనీ, మాఫియాలే ఎన్నికలు అనే ఓ నిర్వచనాన్ని స్థిరపరిచాడు. మీడియా మేనేజ్‌మెంట్ పేరుతో జర్నలిస్టులను చీల్చి తనకు అనుకూల భజనపరులను తయారుచేసుకున్నాడు.అబద్ధాలను వండివార్చి పత్రికల పతాక శీర్షికలో తన డబ్బా కొట్టుకునే సంస్కృతి ఈయన గారి నుంచే ప్రారంభమైంది. బ్యూరోక్రసీని, న్యాయవ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను అన్నిటిని బలి తీసుకున్నాడు బలిబాబు. ఈ విధంగా బాబుతో వ్యవస్థ అవస్థలపాలైంది.


ఒక పచ్చి అబద్ధాన్ని పుట్టించి, పత్రికలలో పతాక శీర్షికలో పెట్టించి పెంపుడు కుక్కలను ఎగదోసి, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే గోబెల్స్ శిష్యుడు అబద్ధాల బాబు. పాలమూరు అంబేద్కర్‌గా పిలువబడిన దళిత నేత పుట్టపాగ మహేంద్రనాథ్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు. నెంబర్-2గా స్థానం పొంది ఆర్థిక, రెవెన్యూ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌తో అంత సాన్నిహిత్యం, కీలక స్థానం ఓ దళిత నాయకుడు మహేంద్ర పొందటం ఓర్వలేని బాబు...కుట్రలకు తెరతీశాడు. 1994లో ఎన్టీఆర్ అచ్చంపేట నియోజకవర్గం నుంచి మహేంద్రకు టికెట్‌కు ఖరారు చేశారు. 


మహేంద్రనాథ్ మళ్లీ గెలవడం ఖాయం. ఎన్టీఆర్‌కు నెంబర్2 గా ఉండటం ఖాయమని గ్రహించిన నక్కజిత్తుల బాబు తన పెంపుడు కుక్కలకు కుట్ర పథకాన్ని అమలు చేసే బాధ్యతను ఇచ్చాడు. అచ్చంపేట పార్టీ మీటింగ్‌కు వెళ్లిన మహేంద్రనాథ్‌ డౌన్ డౌన్, గోబ్యాక్ మహేంద్రనాథ్ అని తన పెంపుడు కుక్కలతో మొరిగించాడు. సున్నిత మనస్కుడైన మహేంద్రనాథ్ మీటింగ్ మధ్య నుంచి అవమానం భరించలేక వెళ్లిపోయారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఎన్టీఆర్‌కు తెలిపారు. ఎన్టీఆర్ వారించినా వినలేదు. ఇక ఆ తరువాత ఆ అవమానాన్ని ఆవేదనతో తన సన్నిహితులతో పదేపదే చెప్పుకొని మానసిక వేదనకు గురై మంచానికే పరిమితమై మరణించారు. 


రాజకీయ కుట్రలకు, పరోక్ష హత్యకు బలయ్యారు. 1995లో కుట్రతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పాలమూరు జిల్లాను కుట్రపూర్వకంగానే దత్తత తీసుకున్నారు. పాలమూరు జిల్లా వెన్ను విరిచి ప్రపంచబ్యాంకు ముందు అవిటి అనాథ జిల్లాగా చూపించి, వేల కోట్లు తెచ్చి, ఆంధ్రాకు పెట్టుకుని, దత్తత జిల్లాను 2004 వరకు దగా చేశాడు. ఆ విధంగా ఏకంగా లక్షలాది మంది జిల్లా ప్రజలనే బలితీసుకున్నాడు బలి బాబు. వందలాది మంది తెలంగాణ బిడ్డలు బాబు కుట్రలకు బలి అయ్యారు. 


2009లో కేసీఆర్ పాలమూరు పార్లమెంటు సభ్యులు. తెలంగాణే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న కేసీఆర్‍...రాష్ట్ర సాధన కోసం అమీతుమీకి సిద్ధపడ్డారు. తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదాలతో 2009 నవంబర్ 29న బలిపీఠం ఎక్కారు. కేసీఆర్ ఆమరణ దీక్ష తొమ్మిది రోజుల పాటు ఉడుంపట్టుతో కొనసాగించారు. కేసీఆర్ పట్టుదలతో ఆంధ్రా లీడర్లు బెంబేలెత్తారు. మనసులో తిట్టుకుంటూనే తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని డిసెంబర్ 7,8 తేదీల్లో అసెంబ్లీలో ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రకటించాడు జిత్తుల బాబు.


తెలంగాణ కాలం కడుపుతో ఉండి, కేసీఆర్‌ను కన్నదన్నట్లుగా సావునోట్లో తలపెట్టిన కేసీఆర్ ఎన్ని తీర్మానాలు చేసినా దీక్ష విరమించలేదు. ఆయన దీక్షకు మద్దతుగా లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా శ్రీకాంతచారి మంటలో కాలిండు. మాంసపు ముద్దలు రాలిపడుతున్నా అమ్మా అనే బదులు జై తెలంగాణ అన్నా డు. 11 రోజులకు ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన చేసింది. ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే చంద్రబాబు కుట్రలకు తెరలేపిండు. 


ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చిన బాబు అర్ధరాత్రి అట్లెట్లా ఇస్తారు తెలంగాణ అని మీడియా ముందుకు వచ్చిండు. ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు కొట్టి రెచ్చగొట్టిండు. కృత్రిమ ఉద్యమానికి తెరలేపిండు. డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసింది. వచ్చిన తెలంగాణ వెనక్కి పోయింది. దీంతో నిరాశతో ఉద్వేగంతో తట్టుకోలేని విద్యార్థి యువతీ యువకుల ప్రాణత్యాగాలకు, బలిదానాలకు తెరలేపిండు. వచ్చిన తెలంగాణ ప్రకటనను కృత్రిమ ఉద్యమంతో అడ్డుకున్నది చంద్రబాబే. ఆకుట్రల వల్ల వందలాది మంది యువతీ యువకులను బలితీసుకున్నది చంద్రబాబు కుటిల నీతి.


బాబు కుట్రలు సాగుతూనే ఉన్నాయి. కేంద్రం కమిటీ పేరుతో కాలయాపన చేస్తుంది. తెలంగాణ ప్రజలు అసహనం, ఆవేశంతో ఊగిపోతారు. ప్రజల ఆవేశం, ఆకాంక్ష ప్రతిఫలించాలంటే ఒక వేదిక, సందర్భం కావాలి. ఉద్యమ వ్యూహకర్త అయిన కేసీఆర్ తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామా ఆయుధంగా కేంద్రంపై ఎక్కుపెట్టిండు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు తోకముడిచి వీపు చూపారు. 12 మంది టీఆర్‌ఎస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఉద్యమంలో ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తేటతెల్లమైంది. రాజీనామాలతో భయపడి వీపుచూపిన తెలంగాణ టీడీపీ వారిని ఈ స్థానాల్లో బాబు పోటీకి దింపాడు. దీనికి తెలంగాణ టీడీపీ వారు వారించినా వినలేదు. 12 చోట్ల టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అట్లా తెలంగాణ టీడీపీని బలితీసుకున్నాడు బాబు. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ్యులను సంతలో సరుకులను కొన్నట్లుగా కొని ఏడాది పసిగుడ్డు తెలంగాణ సర్కారును గొంతు నులిమి చంపాలనే పథక రచన చేసిండు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగం చేయాలనుకున్నాడు. కానీ కేసీఆర్ బాబు తవ్విన బావిలో పడడానికి ఎన్టీఆర్ కాదు కదా! బాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. 


బాబుకుట్రకు రేవంత్‌రెడ్డి బలి. ఏమంత రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేని రేవంత్‌రెడ్డి ఎగిరెగిరిపడి ఎల్లెల్కల పడ్డడు. ఆంధ్రా నోట్ల కట్టలను రేవంత్ నెత్తిన పెట్టి భస్మాసుర హస్తంలా ప్రయోగించాడు. ఆంధ్రాబాబు. ఇందులో అడ్డంగా దొరికి జైలు పాలయ్యాడు. పాపం రేవంత్. ఈ విధంగా బాబు ఉచ్చులో మరొకరు బలి. బాబుకు బలైన వారి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఓ గ్రంథమైతది. అలాగే ఇటీవల రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 27 మంది బలయ్యారు. అందుకే తెలంగాణ టీడీపీ నాయకుల్లారా మీరు మేల్కోకపోతే మీరు ఆంధ్రాబాబు వల్ల బలి కావడం ఖాయం.

- ఎ.పి. జితేందర్‌రెడ్డి,పార్లమెంట్ సభ్యులు
- బెక్కెం జనార్దన్, న్యాయవాది


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, జులై 21, 2015

వినిపిస్తలేదా.. గోదావరి గోస?!

dam


గోదావరి పుష్కరాలు ఒక విషయాన్ని ప్రజలముందు సాక్ష్యాధారాలతో పెట్టాయి. సమైక్య ప్రభుత్వాలు తెలంగాణకు గోదావరి నదిలో ఆఖరుకు ఏం మిగిల్చాయో కళ్లకు కట్టాయి. మహారాష్ట్రలోని నాసిక్, నాందేడ్‌లో పుష్కరాలకు బోలెడు నీళ్లున్నాయి. ఏపీలోని రాజమండ్రిలో పుణ్యస్నానాలకు ప్రవాహాలున్నాయి. కానీ తెలంగాణలో ప్రాజెక్టుల నీళ్లు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ముందుభాగంలో మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఒడిసిపట్టింది. వెనుక భాగంలో ఏపీ కడుపునిండా నీళ్లు మళ్లించుకుంది. మధ్యలో ఉన్న మనమే అన్యాయమై పోయాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడే ఎగువన ఉన్న మహారాష్ట్ర వరుస బ్యారేజీలతో వాటాను మించి గోదావరి నీటిని ఆపుకుంది. 

-పైన.. కింద రాష్ర్టాలు కళకళ
-మధ్య తెలంగాణకెందుకీ విలవిల
-వరుస బ్యారేజీలతో ఒడిసిపట్టిన మహారాష్ట్ర
-ప్రాజెక్టులతో వాటా భద్రపరుచుకున్న ఏపీ
-అనాథల్లా మిగిలిన తెలంగాణ ప్రాజెక్టులు
-కుట్రపూరిత అంతర్‌రాష్ట్ర ఒప్పందాలు
-నీళ్లులేని చోట ప్రాజెక్టులు కట్టిన పాలకులు
-బ్యారేజీ డిజైనే లేకుండా కాల్వల నిర్మాణాలు
-స్వరాష్ట్రంలో సవరణలకు సర్కారు యత్నాలు
-రాజకీయ కక్కుర్తితో మోకాలడ్డుతున్న ప్రతిపక్షాలు

అవి పూర్తవుతున్నా సమైక్య ప్రభుత్వాలు చోద్యం చూశాయి. ఓట్ల అవసరం వచ్చినపుడు డ్రామాలు చేశాయి. అంతే తప్ప ఆ రాష్ట్రంతో పోటీపడి ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించి నీళ్ల మీద హక్కులు, వాటాలు సాధించేందుకు యత్నించలేదు. కలిసి ఉన్నంత కాలం గోదావరి అంటే ధవళేశ్వరం బ్యారేజీయే అంటూ కృత్రిమ చరిత్రను మనపై రుద్దిన సమైక్య పాలకులు... సీమాంధ్ర ప్రాంత వాటా జలాల్ని మాత్రం చుక్క నష్టపోకుండా జాగ్రత్త పడ్డారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకుండా సర్వశక్తులు ఒడ్డడం ద్వారా తమకు వచ్చే నీటికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. 


తెలంగాణలో గోదావరి ఘోష విన్న పాపాన పోలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఇపుడైనా మన హక్కులు సాధించుకునేలా గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకుందామంటే ఇపుడు దానికి బయటివాడికి తోడు ఇంటివాడూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. డిజైన్లు.. డిమాండ్లు.. అంటూ ఇక్కడి నాయకులు కూడా భగీరథ యత్నాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. నవ్వెటోళ్ల ముందు జారిపడేలా... తమ రాజకీయాలతో తెలంగాణ ప్రజల కంటో వేలు పెట్టి పొడుస్తున్నారు. 


తన వాటా తాను చూసుకున్న ఆంధ్ర నాయకత్వం..


మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకంలో పుట్టే గోదావరి 1,465 కిలోమీటర్ల మేర ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఈలోగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మీదుగా తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మహారాష్ట్రకు 888.90 టీఎంసీలు, కర్ణాటక 19.90 టీఎంసీలు, మధ్యప్రదేశ్ 625.46 టీఎంసీలు, ఒరిస్సా 292.96 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1480 టీఎంసీలు కేటాయింపు ఉంది. ఈ లెక్కన ఉమ్మడి రాష్ట్రంలోని కేటాయింపుల్లో తెలంగాణ దాదాపు 945 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవాలి. ఇది ఈ ప్రాంత హక్కు. మహారాష్ట్ర తన వాటా జలాల్ని వినియోగించుకునేందుకు భారీ ఎత్తున ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో అనేకం పూర్తికాగా... మిగిలినవి చివరి దశలో ఉన్నాయి. 


బాబ్లీ పై ఏకంగా 12 వరుస బ్యారేజీలు కట్టి గోదావరిని ఒడిసిపట్టింది. జైక్వాడ్, ఎస్సారెస్పీ మధ్య 79 టీఎంసీలను వాడుకోవాల్సిన మహారాష్ట్ర 102 టీఎంసీలను వాడుకుంటున్నది. 12 బ్యారేజీలు కట్టినపుడు సమైక్య పాలకులు పట్టించుకోకపోవడంతో తెలంగాణ 23 టీఎంసీల నీటిని కోల్పోయింది. అయితే నాటి పాలకులు ఆంధ్ర ప్రాంతానికి మాత్రం నష్టం రానివ్వలేదు. ఇక ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తన వాటా 535 టీఎంసీల్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 230 టీఎంసీల వరకు నీటిని వాడుకుంటున్నది. పోలవరం, పట్టిసీమ పేరుతో 272-300 టీఎంసీల గోదావరి జలాల్ని వాడుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టుకున్నాయి. అంటే తనకు రావలిసిన వాటా కంటే ఎక్కువగానే నీటిని వాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. 


జలసంఘం అంచనాలే...


అధికారంలో ఉన్నన్నాళ్లూ తెలంగాణకు గోదావరినదిలో హక్కులను రక్షించడం చేతకాని పార్టీలు.. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం గోదావరినదిలో గరిష్టంగా ప్రయోజనం పొందేలా ప్రాజెక్టులు రీ డిజైన్ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నాయి. మహారాష్ట్ర అంగీకరించనని తేల్చి చెప్పినచోట ప్రాజెక్టు ఎలా కడతారో..ఎలా పూర్తి చేస్తారో వారికో తెలియాలి. వివాదాలున్నచోటే కట్టితీరాలనడం ఏం విజ్ఞతో వారే చెప్పాలి. కేంద్ర జల సంఘం అధికారిక లెక్కల ప్రకారం.. 1965 నుంచి 2010 వరకు పెరూర్ దగ్గర దాదాపు 1500 టీఎంసీల గోదావరిజలాలు అందుబాటులో ఉన్నాయి. ఎగువ ప్రాంతం నీటిని వాడుకున్న తర్వాత 600 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుంది. అందుకే ప్రభుత్వం వృథాగా సముద్రంలో కలుస్తున్న మూడు వేలకుపైగా టీఎంసీల నీటిని సాగుకు మళ్లించేందుకు భగీరథ యత్నం మొదలుపెట్టింది. 


అంతకంటే మంచి ప్రదేశం ఉందా?


గోదావరిలో ప్రాణహిత కలిసేచోట నీటిని లెక్కిస్తే వెయ్యి టీఎంసీలకు పైగా లభ్యత ఉంటుందనేది అంచనా. ఇందులో ఎగువ ప్రాంతం వారు వాడుకుంటే మేడిగడ్డ వద్ద 522 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. వాస్తవానికి ఎగువ ప్రాంతం వారు తమ వాటాలను వినియోగించుకోవడం లేదు. దానివల్ల జలాల లభ్యత వ్యాప్కోస్ చెప్పినదానికంటే ఎక్కువగానే ఉంటుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే పుష్కలమైన నీటిని మళ్లించవచ్చనేది వ్యాప్కోస్ నివేదిక. 


అందువల్లనే ప్రభుత్వం నీటి లభ్యత, ఎక్కువ రోజులు నీరు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో దానికి అంగీకరించింది. కానీ రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు దీన్ని చూస్తూ చేజేతులా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కంతనపల్లి ద్వారా దేవాదులకు పుష్కలమైన నీటిని అందించాలని సర్కారు వ్యూహాన్ని రచిస్తుంటే సర్వే సమయంలోనే ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. 


తెలంగాణకు నీళ్లు ఇవ్వని నాడు ఇంట్లో పండుకున్న వారు ఇపుడు ప్రాజెక్టులకు కదలిక తెస్తుంటే యుద్ధ ప్రకటనలు చేస్తున్నారు.ఓవైపు కళ్ల ముందు ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నది. అవినీతి ఆరోపణలు తప్ప అక్కడి ప్రతిపక్షాలు ప్రాజెక్టును ఆపాలని మాత్రం అనడం లేదు. ఆ సోయి తెలంగాణలోని ప్రతిపక్షాలకు లేక పోయింది. సర్వే స్థాయిలోనే నిర్ణయాలు జరిగినట్టు రచ్చరచ్చ చేసి రాజకీయలబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయి.


తెలంగాణలో తడిసిన భూములెన్ని?


పేరుకు గోదావరి నది తెలంగాణలో సుదీర్ఘంగా ప్రవహిస్తున్నా.. దానిపై కట్టిన ప్రాజెక్టులెన్ని? కట్టిన వాటిలో నిల్వ ఉన్న నీరెంత? అవి పొలాల్ని తడిపినదెంత? పరిశీలిస్తే గుండె చెరువవుతుంది. సమైక్య పాలనలో కట్టింది ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మాత్రమే అదీ పూర్తి చేయనేలేదు. మిగిలిన ఒకటి రెండూ పూర్తిగా అంతర్‌రాష్ట్ర వివాదాల్లోకి నెట్టి చేతులు దులుపుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి దశలో 12 లక్షలు, రెండో దశలో ఆరు లక్షలు,మొత్తంగా 18 లక్షల ఎకరాలకు నీరు అందించాలి. ఇప్పటికీ కనాకష్టంగా ఏడున్నర లక్షల ఎకరాలకు నీరందడం లేదు. 


1975లో లెండి ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు పూర్తికాలేదు... నాలుగు దశాబ్దాల కింద మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న లోయర్ పెనుగంగ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప అడుగు ముందుకు పడలేదు. సింగూరు రిజర్వాయర్‌పై 4.8.1978లో కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీన్ని మొదలు పెట్టి నిజాంసాగర్ 58 టీఎంసీల సామర్థ్యానికి ఎసరు తెచ్చారు. చారిత్రక ఇచ్చంపల్లి ప్రాజెక్టుది కన్నీటి గాథ. నిజాం హయాంలో పనులు మొదటిపెట్టి అప్పట్లో ప్లేగు వ్యాధి విజృంభించడంతో పనులు నిలిపివేశారు. దీనిపై 7.8.1978న మహారాష్ట్రతో ఒప్పందం కూడా జరిగింది. ప్రాజెక్టుకు ఎఫ్‌ఆర్‌ఎల్ నిర్ధారించక ఆగి పోయింది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రం ఎఫ్‌ఆర్‌ఎల్ 150 మీటర్లుగా నిర్ధారించారు. దేవాదుల ప్రాజెక్టు.. చెప్పింది వేరు. కట్టింది వేరు ఇపుడు పట్టుమని పదివేల ఎకరాలకు కూడా సాగునీరు అందని దుస్థితి. 


ఇక ప్రాణహిత ప్రాజెక్టుపై 6.10.1975, 7.8.1978ల్లో రెండు పర్యాయాలు మహారాష్ట్రతో ఒప్పందాలు జరిగాయి. కానీ నలభై ఏండ్లయినా ప్రాజెక్టు సామర్థ్యం, ఎఫ్‌ఆర్‌ఎల్ చర్చలు కొలిక్కి రాలేదు. మహారాష్ట్ర అంగీకారం లేకుండా, కనీసం మెయిన్ డ్యాం డిజైన్ కూడా రూపొందించకుండా కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టుకు కాల్వలు కట్టి ప్రజలకు సినిమా చూపించారు. సమైక్య ప్రభుత్వం తీరు చూసి ఒళ్లుమండి 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఈ ప్రాజెక్టు మాకు అంగీకారం కాదు. మీరు చేస్తున్న వ్యయం మొత్తం నీళ్లలో పోసినట్టే.. జాగ్రత్త అంటూ ఘాటుగా లేఖ రాసినా పట్టించుకోలేదు. 

వరుస బ్యారేజీలు అవసరమని చెప్పిన హనుమంతరావు ...


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజినీరు హనుమంతరావు గతంలో తన సుదీర్ఘ అనుభవంతో గోదావరిపై నీటి లభ్యత ఆధారంగా వరుస బ్యారేజీల ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో ఎనిమిది చోట్ల బ్యారేజీలను ప్రతిపాదించారు. అందులో పెద్ద బెల్లాల , సూరారం, కంతనపల్లి ఉన్నాయి. ఆయన ప్రతిపాదించిన సూరారం అనే బ్యారేజీయే ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మేడిగడ్డ. తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ చేస్తున్న రీడిజైన్ ప్రణాళికలను చూసి కేసీఆర్‌కు నేను తెలియదు. కానీ ఆయన గోదావరిపై రూపొందిస్తున్న ప్రణాళిక చాలా బాగుంది. హ్యాట్సాఫ్... అని గోదావరి ప్రాజెక్టులపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డ్ ఇంజినీర్ చెప్పారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, జులై 20, 2015

ఇదే...మన అచ్చమైన తెలంగాణ వేడుక...!!!

దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది. శక్తి ఆరాధనలలో ఇదీ ఒక భాగమే. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం...బోనాల పండుగ.


bonalu

ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అచ్ఛమైన తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. 
ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతుంటై. కనీసం ఆ ఒక్క రోజైనా నిఖార్సయిన గ్రామీణ వాతావరణాన్ని కన్పింపజేయడం బోనాల పండుగలోని విశిష్టతగా చెప్పాలి. బోనం అంటే భోజనమే. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం కూడా. ఇదే ఇందులోని పరమార్థం.


పిల్లల సంరక్షణలో అమ్మవారు


జాతరలో కొందరు మొక్కుబడి చెల్లించుకునేందుకు వెళ్తారు. మరి కొందరు ఉత్సాహం ముప్పిరి గొనగా దైనందిన జీవితం నుండి మార్పు కోరి తమ వాళ్ళతో కలిసి సరదాకు వెళ్తారు. ఇంకొందరు భక్తి ఆవేశం తన్మయించగా జాతరలో తామే ఒక భాగంగా మారుతారు. ప్రధానంగా బోనాల జాతర అంతరార్థం మరోటి ఉంది. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసమే ప్రజలను ఇలా ప్రతి ఏడూ బోనాలు సమర్పించుకొనేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. 


bonalu2

తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 


bonalu

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడులను సందర్శించడం ఒక మహాజాతరను తలపిస్తుంది. ఈ బోనాల ఆచారం ప్రాచీనకాలంలోనూ ఉన్నదనేందుకు శ్రీనాథుని హరవిలాస కావ్యంలోనే చక్కని ఉదాహరణ ఉంది. నానావిధ పాకములుగ/ నానాలుగ జేసి నాలుగై దట్టికలన్/ బోనాము దొంతి బేర్చిరి అంటారందులో. ఈ ఆధునిక కాలంలోనూ ఏ మాత్రం తీసిపోని విధంగా జాతర జరుగుతుంది. ఈ పండుగ సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు, వేపమండలతో అలంకరణ చేసుకోవడం ఓ ప్రత్యేకతగా కనిపిస్తుంది.


ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల విశేషాల మాలిక ఇక్కడ-


ఘటోత్సవం:


అమ్మవారికి ఎదురువెళ్ళి పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఘటం అంటే కలశం. కలశంతో అమ్మవారికి స్వాగతం పల్కడం. పూర్ణకుంభ స్వాగతమన్న మాట. 

bonalu

ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు ఆవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందు రోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఘటంపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేస్తూ, భక్తుల పూజలు అందుకుంటారు. ఘటోత్సవం ద్వారా అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు లెక్క. ఆలయానికి వెళ్ళ లేని వృద్ధులు, వికలాంగులు తమ ఇండ్ల వద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించి, మొక్కులు తీర్చుకొని తరిస్తారు. 


సాక సమర్పణ:


సాక అంటే శాఖ. అంటే చెట్టుకొమ్మ. వేపమండను పసుపు నీటి సాకలో ఉంచి, అమ్మవారికి సమర్పించడం. దీనినే సాకివ్వడం లేదా శాఖ సమర్పణం అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లి సాక సమర్పిస్తే, ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని ప్రజల నమ్మకం.


ఫలహారపు బండ్లు:


బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు.


పోతురాజుల వీరంగం:


బోనాలలో వీరొక ప్రత్యేకత. పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. శరీరమంతా పసుపు రాసుకొని, లంగోటి (వస్త్రము) కట్టుకొంటారు. కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుకతో నుదుట కుంకుమ దిద్దుకొంటారు. నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొంటారు. నడుం చుట్టూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపుతాడుతో చేసిన కొరడాను ఝుళిపిస్తూ, తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ మహాభక్తి పారవశ్యంతో కదలి వెళతారు. అమ్మ వారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపజేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళ్ళే జనాలను ప్రపంచం తనివి తీరా చూడాల్సిందే తప్ప వర్ణించ మాటలు రావు.


రంగం వేడుకలు:


రంగం అంటే భవిష్యవాణి వినిపించడం. బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ (మాతంగి) జీవితం అమ్మవారికే అంకితం. ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగానే ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవాలకు రంగం వేడుకలో పాల్గొనవచ్చు.


గావు పట్టడం:


వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ, ఉద్వేగంతో ఊగి పోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఎదురుగా, మేళతాళాల మధ్య, లయబద్ధంగా నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుందని అంటారు. ఈ సందర్భంలో సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతుబలులు ఉండేవి. ఇప్పుడు వీటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు చూసి తరిస్తారు.


సాగనంపు:


గావు పట్టడం పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళతారు. ఇలా ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.


వ్యాస రచయిత: వనిత విజయకుమర్ ద్యాప


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, జులై 19, 2015

ఫిరాయింపుల చట్టం పరమార్థం ఏమిటి?

తెలంగాణ ప్రజలకు స్వయం పాలన సాధ్యం కాదని చెప్పడానికి, తెలంగాణపై మళ్ళా పట్టు సాధించడానికి పరాయి శక్తులు అనేక కుట్రలు పన్నుతున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణవాదం సుడిగాలిలా అన్ని మూలల్లో , అన్ని పార్శ్వాలలో చుట్టుకొంటున్నది. తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా సీమాంధ్ర వ్యాపార లాబీలు, మీడియా, వారి భుజాన వాలి ఉన్న చిలుకల్లాంటి కుహనా ఉద్యమకారులు, కుహనా మేధావులు కూడబలుక్కుని దాడి చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ శక్తులు ఏకం కావడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి చేస్తున్న యత్నాలకు మద్దతు ఇస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇతర పార్టీలకు చెందిన కొందరు శాసన సభ్యులు చేరడంపై వివాదం రేగుతున్నది. ఇట్లా చేరిన ఎమ్మెల్యేలు ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులవుతారని కొందరు స్పీకరుకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నిర్ణయం ఇంకా వెలువడవలసి ఉన్నది. స్పీకర్ ఎంత కాలంలోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. సభలో శాసన సభ్యుల ప్రవర్తనను ఏ న్యాయస్థానం ప్రశ్నించలేదు. ఇదే విధంగా సభాపతిని ఒత్తిడి చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల స్పీకర్ నిర్ణయం కోసం ఎంత కాలమైనా ఎదురు చూడవలసిందే. గతంలో సభాపతులు ఇటువంటి సంప్రదాయం నెలకొల్పారు. అందువల్ల నిర్ణయంలో జాప్యం జరిగితే దానిని కొత్త విషయంగా చూడకూడదు.


సభాపతుల నిర్ణయం ఎట్లా ఉన్నప్పటికీ ఈ విషయమై చర్చ మాత్రం సాగుతూనే ఉన్నది. అసలు ఎమ్మెల్యేలు పార్టీ మారడం సమర్థనీయమా కాదా? వీరు ఏ పరిస్థితులలో మారవలసి వచ్చింది? ఇప్పటి వరకు ఎన్నో సార్లు పార్టీ మారడం జరిగినా, అప్పుడు నోరు విప్పని మేధావులు ఇప్పుడే ఎందుకు దీనినొక చర్చనీయాంశంగా స్వీకరించారు? గతంలో జరగనంత రచ్చ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నదనే అంశాలు చర్చించుకోవడం అవసరం.

ఫిరాయింపు నిరోధక చట్టం ఏ నేపథ్యంలో వచ్చింది? వచ్చినప్పటి నుంచి అది పోషించిన పాత్ర ఎటువంటిది? ఫిరాయింపు నిరోధక చట్టం ప్రజాస్వామ్య బద్ధమైనదేనా? ఈ చట్టానికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొందరు పెద్ద మనుషులు పవిత్రతను ఆపాదించి ముందుకు తెస్తున్నారు ఎందుకు? అనే సందేహాలు కూడా నివృత్తి చేసుకోవలసిన సందర్భమిది.


venu


ఫిరాయింపు నిరోధక చట్టం చేయడం వెనుక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే, మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతిని, క్రమంగా బలపడుతున్న కేంద్రీకృత ధోరణులను అర్థం చేసుకోవాలె. 1980 నాటి మన దేశ పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలె. వివిధ దేశాలలో ఉద్యమాలు చెలరేగి హక్కుల కోసం ప్రజలు పాత వ్యవస్థలను కూలదోస్తున్న కాలంలో బ్రిటన్‌లో కానీ ఇతర దేశాలలో కానీ ప్రజాస్వామ్య చట్టాలు చాలానే వచ్చాయి. బ్రిటిష్ పార్లమెంటు చక్కగా రూపుదిద్దుకుంటున్న కాలంలో- శాసనకర్తకు ఎంతో స్వేచ్ఛ ఉండేది. పార్లమెంటు ఇప్పటితో పోలిస్తే ఆనాడు ప్రభుత్వాన్ని కొంత సమర్థవంతంగానే నియంత్రించేది. కానీ ఆ తరువాత కాలంలో అంతర్జాతీయ పోకడలలో మార్పు వచ్చింది.
 
ప్రజలు సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేయడం మొదలైంది. పార్లమెంటరీ ప్రభుత్వం క్యాబినెట్ ప్రభుత్వంగా మారింది. పార్లమెంటరీ వ్యవస్థలో ఉండే సార్వత్రిక ఆమోదం, సర్దుబాట్లు స్థానం లేకుండా పోయాయి. పార్లమెంటును, క్యాబినెట్‌ను ప్రధాని తన కనుసైగలతో శాసించడం మొదలైంది. 1980 దశకం అంటే మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు భూమిక తయారవుతున్న దశ అది. (ఆర్థిక సంస్కరణలు పీవీతోనే హఠాత్తుగా ప్రారంభం కాలేదని గ్రహించాలె) ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మౌలికంగా మార్చకుండానే, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ఆకాంక్షలు, రాజ్యాంగ నిర్మాతల భావనలకు విరుద్ధంగా కార్పొరేట్ పాలన అడుగుపెట్టడానికి రంగం సిద్ధమవుతున్న కాలం. 


కొత్త పారిశ్రామిక విధానంతో సహా అనేక కొత్త సంస్కరణలు అందమైన పేర్లతో వస్తున్న కాలమది. అప్పుడే కీలకమైన పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఫిరాయింపు నిరోధక చట్టం ముందుకు వచ్చింది. అనేక అప్రజాస్వామిక పోకడలు సాగుతున్న కాలంలో ఏ ప్రజా ఉద్యమం లేకుండానే, ఎవరి ఒత్తిడి లేకుండానే ఒక ప్రజాస్వామ్య చర్యను ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందనేది ఏ మాత్రం ఆలోచించినా అర్థమవుతుంది. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఆనాడు లోక్‌సభలో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు 401 మంది ఉన్నారు. ఇది అసాధారణం.
 
ఇంత మెజారీటీని చంకలో పెట్టుకొని బలమైన ప్రతిపక్షమంటూ లేనప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఫిరాయింపు నిరోధక చట్టం చేయవలసిన అవసరమే లేదు. దీనిని బట్టి ఈ చట్టం చేయడానికి వేరే కారణాలు ఉన్నాయని అర్థమవుతున్నది. ఆర్థిక రంగంలో విధానపరమైన మార్పు రావడం ప్రధాన కారణం. రాబోయే కాలంలో ప్రజా సంక్షేమ పథకాలు తగ్గిపోవడం, పారిశ్రామిక రంగానికి భారీ రాయితీలు ఇవ్వబోతున్నందున ఏ మాత్రం అసమ్మతి ఉన్నా తుంచి వేయడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు వివిధ అస్తిత్వాల వ్యక్తీకరణను తునిమి వేయడానికి దేశంలోని కేంద్రీకృత శక్తులకు ఈ చట్టం అవసరమైంది.


ఫిరాయింపు నిరోధక చట్టం అనేది శాసనకర్తల పాలిట టాడా చట్టం వంటిది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా ప్రతినిధికి పూర్తి స్వాతంత్య్రం ఉండాలె. తాను ఎన్నుకున్న ప్రజల తరఫున స్వేచ్ఛగా మాట్లాడడానికి, ఓటేయడానికి అవకాశం ఉండాలె. కానీ ఫిరాయింపు నిరోధక చట్టం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన- ప్రజా ప్రతినిధికి ఉండే ఈ స్వేచ్ఛను హరిస్తుంది. తన ప్రజల ప్రయోజనాలకు, తన అభిమతానికి విరుద్ధంగా ఉన్నా సరే, పార్టీ నాయకత్వం చెప్పినట్టు ఓటేయాలె. లేకపోతే సభ్యత్వానికి అర్హులు కావలసి వస్తుంది. ఉదాహరణకు తెలంగాణకు లేదా జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఎంతగా వాదించినా చివరికి పార్లమెంటులో విప్‌కు అనుగుణంగా ఓటు వేయక తప్పదు. కనీసం ఓటింగ్‌కు గైర్హాజరు అయినా పార్టీ నాయకత్వం సభ్యత్వాన్ని రద్దు చేయించగలదు. 


ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధి పాత్రనే కీలకమైంది. మొత్తం ప్రజాస్వామ్య సౌధం నిలబడేదే ఈ స్తంభంపైన. ఎంత గొప్పగా చెప్పుకున్నా- ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఇతర అంగాలైనా, పత్రికా వ్యవస్థ అయినా, స్వచ్ఛంద సంస్థలైనా ప్రజా ప్రాతినిధ్య సంస్థకు సాటిరావు. ప్రజాప్రతినిధి బాధ్యత అంత్యంత గురుతరమైనది, పవిత్రమైనది. రాజ్యాంగంలో ప్రజా ప్రతినిధికి గుర్తింపు ఉంటుంది. కానీ రాజకీయ పక్షాల ప్రస్తావనే లేదు. ఏ పక్షాన ఉన్నాడనే దానికి అతీతంగా ప్రజాప్రతినిధికి స్వీయ గుర్తింపు ఉంటుంది. అటువంటి ప్రజా ప్రతినిధి చేతులు కట్టేయడం ఈ ఫిరాయింపు వ్యతిరేక చట్టం పేరుతో సాధ్యపడింది. 


ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నది కదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఫిరాయింపు అనేది ఒక రుగ్మత కాదు. ఒక వ్యవస్థను పీడిస్తున్న రుగ్మత వల్ల కనిపిస్తున్న లక్షణమది. రాజకీయాలను వ్యాపార లాబీలు శాసించడం అనేది నేటి సమస్య. ఈ రుగ్మత వల్ల కనిపించే లక్షణమే ఫిరాయింపులు. సరళీకరణ విధానాల వల్ల దేశంలో అవినీతి పెద్ద పెట్టున పెరిగి పోయిందనేది అందరికీ తెలిసిందే. సామాజిక, ప్రకృతి వనరులన్నీ కొన్ని పాలక ముఠాల చేత పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతున్నదని, పెరిగిన అంతరాలు సమాన అవకాశాల హక్కులకు భంగకరమని మన అనుభవానికి వచ్చింది. ఈ పోడకలను అరికట్టడానికి బదులు, ఈ విధానాలను మరింత లగాయించి అమలు పరచడానికి వీలుగా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని, ఇతర ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలను అమలుపరిచారు. ఫిరాయింపు నిరోధక చట్టం ముసుగులో మొదలైన ప్రజాస్వామిక హక్కుల హరణం ఆ తరువాత భారీ ఎత్తున సాగింది. ఇరవయవ శతాబ్దం పూర్వార్ధం వరకు సాధించుకున్న హక్కులన్నిటినీ నామమాత్రం చేసింది.


రాజకీయ రంగాన్ని పీడిస్తున్న రుగ్మతను ముదరబెడుతూ దాని లక్షణానికి చికిత్స చేస్తున్నామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిన వారికి ఫిరాయింపులను నిరోధించి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే ఉద్దేశమే లేదు. అందుకనే ఫిరాయింపు నిరోధక చట్టం ఆచరణలో విఫలమైంది. పైకి చెబుతున్న లక్ష్యం నెరవేరలేదు. ఉదారవాద ప్రజాస్వామ్యంలో చట్టాలు కఠినంగా ఉండకూడదని కోరుకుంటాం. సాధారణంగా చట్టాలు అమలులోకి వచ్చే సరికి బలవంతులకు వర్తించవు. బలహీనుల పాలిట సంకెళ్ళుగా మారుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే ప్రజాస్వామ్యం నిరర్థకమవుతుంది. 


ఫిరాయింపు నిరోధక చట్టం ప్రభావం ఇందుకు భిన్నంగా లేదు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం వచ్చిన తరువాత ప్రజా ప్రతినిధి తన అసమ్మతిని ఓటు ద్వారా వ్యక్తం చేసే శక్తిని కోల్పోయాడు. కానీ వ్యాపార లాబీలు ప్రజా తీర్పును, ప్రజాస్వామ్య ఆకాంక్షలను వమ్ము చేయడానికి పెద్ద ఎత్తున ఫిరాయింపులను జరపడం మాత్రం సాధ్యం అవుతున్నది. ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చిన తరువాత ఈ మూడు దశాబ్దాలలో ఈ చట్టం విఫలమైందనడానికి దేశ వ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి లోక్‌సభ స్పీకర్ల తీర్పులలో వైరుధ్యాలున్నాయి. వివిధ సందర్భాలలో న్యాయస్థానాల స్పందన ఒకేలా లేదు.


ఫిరాయింపు నిరోధక చట్టం పాత్ర ఎటువంటిదో తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మన కండ్ల ముందే ఉన్నాయి. సీమాంధ్రకు చెందిన ఒక పాలక భూస్వామ్య- పెట్టుబడిదారీ వర్గం ఎన్టీఆర్‌ను కూలదోసి అతి సునాయాసంగా మరో నాయకుడిని ఆ స్థానంలో ప్రతిష్ఠించగలిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి బలమైన ప్రజా ఉద్యమం సాగుతున్న కాలంలో కూడా- వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టీఆరెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించగలిగారు. 


ఆనాడు స్పీకర్ సాగదీసి సాగదీసి శాసన సభ గడువు ముగుస్తున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించారు. అప్పుడు ఈ మేధావులు, పత్రికలు ఈ ఫిరాయింపును తూర్పార బట్టాయా? దానిని టీఆరెస్ నాయకత్వ వైఫల్యంగా ముద్రవేసిన ఘనులు కూడా ఉన్నారు. ఇప్పుడు న్యాయవ్యవస్థ తలుపు తట్టిన వారు ఆనాడు ఎక్కడున్నారు? ప్రజల ఆకాంక్షలను అంత బహిరంగంగా అవమానిస్తుంటే ఈ ప్రజాస్వామ్య మూల స్తంభాలన్నీ ఏ మడుగులో దాక్కున్నాయి?


తెలంగాణకు అనేక సమస్యలున్నాయి. హైదరాబాద్‌ను కాపాడుకోవడం, నీటి వాటా సాధించడం మొదలుకొని అనేక సందర్భాలలో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఓటేసే హక్కు శాసనకర్తకు ఉండాలె. తెల్లారితే ప్రజలకు జవాబు ఇచ్చుకోవలసింది ప్రజాప్రతినిధే. శాసన సభకు ఎన్నికైన సభ్యుడు మళ్ళా ప్రజల ముందుకు పోయినప్పుడు తాను ఏ విధంగా వారి ప్రయోజనాలను కాపాడిందీ చెప్పుకోగలగాలె. అట్లా కాకుండా, తాను ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం - చంద్రబాబు ఏజెంటు చెప్పినట్టు ఓటేశానని చెప్పుకుంటాడా! అట్లా చెప్పుకుంటే విధి నిర్వహణ అవుతుందా? ప్రజలు క్షమిస్తారా? 


తెలంగాణ ఉద్యమం ఇంకా సాగుతున్నది. తెలంగాణ శక్తుల ఏకీకరణ సాగుతున్నది. 1990 దశకంలో ఆకాంక్ష, 2001లో తెలంగాణ రాజకీయ శక్తి (టీఆరెఎస్) ఆవిర్భావం, 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష, 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఘట్టాల నేపథ్యంలో...పరిశీలిస్తూ పోతే తెలంగాణ అస్తిత్వానికి అనుగుణంగా ఉద్యమ గమనం, తెలంగాణ శక్తుల ఏకీకరణ ఎట్లా సాగుతున్నదో తెలుస్తుంది. ఈ మొత్తం పోకడకు భిన్నంగా సాగిన పార్టీ మార్పిడుల పట్ల మౌనం వహిస్తారు. కానీ చారిత్రక గమనానికి అనుగుణంగా సాగే పార్టీ మార్పులను మాత్రం ఫిరాయింపులు అంటారా? అందుకే కదా ’మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అంటారా...అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపుల పైనే కాదు, మీ పంచన గల మేధావులు, మీడియా ప్రవచిస్తున్న నీతిసూత్రాలు ఏమిటో, విలువలు ఏమిటో అన్నీ బహిరంగంగా చర్చించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా ఉన్నారు. 


తెలంగాణ ప్రజలకు స్వయం పాలన సాధ్యం కాదని చెప్పడానికి, తెలంగాణపై మళ్ళా పట్టు సాధించడానికి పరాయి శక్తులు అనేక కుట్రలు పన్నుతున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణవాదం సుడిగాలిలా అన్ని మూలల్లో , అన్ని పార్శ్వాలలో చుట్టుకొంటున్నది. తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా సీమాంధ్ర వ్యాపార లాబీలు, మీడియా, వారి భుజాన వాలి ఉన్న చిలుకల్లాంటి కుహనా ఉద్యమకారులు, కుహనా మేధావులు కూడబలుక్కుని దాడి చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ శక్తులు ఏకం కావడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి చేస్తున్న యత్నాలకు మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయాలలో విలువలు ఉండాలనే కోరుకుంటున్నారు. నాభి భాగానికి పైన కొట్టామా కింద కొట్టామా అనేది ధర్మయుద్ధానికి సంకుచితమైన నిర్వచనం. ప్రజల పక్షాన పోరాడడమే ధర్మ యుద్ధం. రేఖకు ఎవరు ఏ వైపున ఉంటారనేది ప్రధానం. ధర్మమేవ జయతే.


వ్యాస రచయిత: పరాంకుశం వేణుగోపాల స్వామి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, జులై 18, 2015

బాబు అతిశయం... దేశానికి అరిష్టం...!!!


రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఒక విషాదం. "నావల్ల తప్పు జరిగివుంటే, క్షమించండి" అని చంద్రబాబు స్వయాన తన తప్పును గుర్తించి క్షమాపణ కోరారు. కానీ, ఆయనఅతిశయాలు, ప్రచారార్భాటాలను నమ్ముకొని రాజకీయాలను ఈదగలనని, పక్క రాష్ర్టాన్ని ప్రత్యర్థిగా భావించి అక్కడి అస్తిత్వ పాలకుడిని తుడిచేయగలనని అనుకున్నంత కాలం.. బాబుకు ఆయనే ఒక సమస్యగా మారుతాడు తప్ప, ఆయన ఎత్తుగడలు మాత్రం నిజం కాలేవు.


చంద్రబాబు తొమ్మిదేళ్లు ఏలిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఒక దేశంగా, దానికి ఆయనో ప్రధానిగా వ్యవహారాలు నడిపిన అనర్థ ధోరణిని ఇప్పటి అవశేష ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగిస్తున్నారు. దీనికి ఇటీవల వికీలీక్స్ బయటపెట్టిన ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు వ్యవహారమే సాక్ష్యం. 


srinu


అప్పటి వాజపేయి ప్రభుత్వానిది సంకీర్ణ బలహీనత. దాన్ని ఆసరా చేసుకొని చంద్రబాబు అంతర్జాతీయ సంబంధాలను సైతం స్వయంగా నడిపి దేశానికి అనర్థాలు కొనితెచ్చిన సంఘటనలున్నాయి. దేశ భద్రతలోనూ మిత్రునిపట్ల అలసత్వం ప్రదర్శించిన వాజ్‌పేయి ప్రభుత్వ ధోరణి కూడా చంద్రబాబు అతిశయాలకు కారణమని చెప్పాలి. బహుశా 1998 లేదా 99లో కావచ్చు, రక్షణ శాఖ ముందస్తు అనుమతి లేకుండానే కోస్తా తుఫాను తాకిడి ప్రాంతాల చిత్రాలు తీయడానికి చంద్రబాబు ప్రభుత్వం అమెరికా సెటిలైట్ కంపెనీ (ఐకోనస్)తో ఎంవోయూ చేసుకుంది. అంతే.. అది పని కూడా ప్రారంభించింది. కానీ చెప్పిన పని పక్కన పెట్టి హైదరాబాబాద్‌లోని రక్షణ కర్మాగారాలు, వాటి స్థావరాల ఫోటోలు తీసుకెళ్లినట్లు ఆ తర్వాత బయటపడింది. ఆ విషయం అమెరికా మీడియాలో వెల్లడి ఐన తర్వాత మనదేశ మీడియాలోనూ వచ్చింది. ముందస్తుగా కేంద్రం అనుమతి పొందకుండానే ఒక విదేశీ కంపెనీతో ఒప్పందానికి వచ్చి దేశానికి అనర్థం చేసిన ఘన చరిత్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉంది. 


అపుడు విషయమంతా తెలిశాక రక్షణ శాఖ చంద్రబాబు ప్రభుత్వానికి తాఖీదు పంపింది. కేంద్రంలో తన పలుకుడి ఉపయోగించి ఆ ఒప్పందానికి మళ్లీ ఆమోదం తెచ్చుకోవడం బాబుగారి ఆ ఎపిసోడ్‌లో కొసమెరుపు. ఎంత సంకీర్ణ ప్రభుత్వమైనా దేశ భద్రత విషయంలో ఇంత అలసత్వం పనికిరాదు. కానీ ఇవాళ సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నది. వాజపేయి లాగ మోదీకి సంకీర్ణ బలహీనత కూడా లేదు. మళ్లీ అదే చంద్రబాబు ప్రభుత్వం మరో అనర్థ ధోరణికి పాల్పడిందని వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎలా చూస్తున్నదన్నది, ఎలాంటి చర్యలు తీసుకుంటదనేదే కీలకాంశం. మనం ఏ కోణంలో చూసినా వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్‌ను పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిది. 


అంతకన్నా మించి, తెలంగాణ రాష్ట్రం పట్ల ఏడాది కాలంగా ఏనీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు జరిపించాలి. అలాగే దేశ భద్రత దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ప్రయత్నించడాన్ని తీవ్రమైనదిగా గుర్తించి దర్యాప్తు జరపాలి.
దేశ సరిహద్దులు కాపాడే ఆర్మీ ఇంటలిజెన్స్ కూడా అలాంటి ట్యాపింగ్ టెక్నాలజీని కేంద్ర హోంశాఖ అనుమతితోనే కొనాలి. ఉదాహరణకు, గతంలో జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు వారి ఫోన్లను ట్యాప్ చేయడానికి హార్డ్ వేర్ ఇంటర్‌సెప్షన్ బేస్‌స్టేషన్‌ను ఖరీదు చేసిందట. ఏడాదిన్నర తర్వాత ఈ విషయం కేంద్ర హోంశాఖకు తెలిసింది. ఈ ఆంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకొని అప్పటి జనరల్‌పై పలువురు అధికారులను తీవ్రంగా ఆక్షేపించింది. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి ట్యాపింగ్ టెక్నాలజీని కేంద్ర అనుమతి లేకుండా ఎవరూ కొనుగోలు చేయరాదని చెప్పడానికి అంతకన్నా మరో నిదర్శనం అక్కర లేదు.


అయితే.. వికీలీక్స్ విడుదల చేసిన ఈ-మెయిల్స్‌లో ఏపీ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్‌పెక్టర్ దుర్గాప్రసాద్ హ్యాకింగ్ టీంతో ఈ-మెయిల్స్ ద్వారా జరిపిన సంప్రందిపులు నిజమా కాదా? తమ క్లయింట్ ఏపీ ఇంటలిజెన్స్‌కు ట్యాపింగ్ టెక్నాలజీ కావాలని హ్యాకింగ్ టీం సింగపూర్ ప్రతినిధి మెగ్లీటాకు ఓర్టస్ కన్సల్టింగ్ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి పంపిన ఈ-మెయిల్ నిజమా, కాదా? వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏమిటనేవి బహిరంగపర్చాల్సిన బాధ్యత మాత్రం కేంద్రంపై ఉంటది. 


తెలంగాణ అస్తిత్వ రాజకీయాన్ని బలహీన పరచడమే తన రాజకీయ లక్ష్యంగా పెట్టుకొని ఉండడం వల్లనే ఆయన గత జనవరి నుంచే ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని, ఆ విషయాన్ని వికీలీక్స్ బయట పెట్టిన ఈ-మెయిల్స్ చెబుతున్నాయని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు యాభై లక్షల రూపాయలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాక.. తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదని చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మనకు తెలిసినంత వరకు తెలంగాణ ఏసీబీ కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ట్యాపింగ్ చర్యలకు పాల్పడలేదని గమనించాలి. మరి ఇపుడు బయటపడ్డ ఈ-మెయిల్ ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని చంద్రబాబు ప్రభుత్వం ఎవరి కోసం కొనుగోలు చేయాలనుకునదనుకోవచ్చు? 25 నుంచి 50 మొబైల్ లైన్లను ట్రాక్ చేయాల్సి ఉంటుందని హ్యాకింగ్ టీంకు ఆర్టస్ సీఈవో పంపిన ఈ-మెయిల్స్‌లో వెల్లడైంది. 


అవి తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఫోన్లను ట్యాప్ చేయడానికేనా? అనేది మరో బలమైన అనుమానం. పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు ప్రభుత్వం అలాంటి ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే.. దాన్ని తీవ్రమైన పరిణామంగా కేంద్రం భావించాలి. చంద్రబాబు రాజకీయ అతిశయాలు, ఆర్భాటాలు అనేక అనర్థాలకు తావిస్తూవుంటాయి. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో అలవాటైన అతిశయ, ప్రచార అర్భాటాలు ఇంకా అతన్ని వీడినట్లు లేదు. కేంద్రం తన జేబులోనే ఉందనే ఒక్కప్పటి తత్వం ఆయనలో ఇంకా కొనసాగుతున్నది. అందువల్లనే ఇలా పక్క రాష్ర్టాన్ని వేధించడమే కాదు, దేశ భద్రత విషయాలు కూడా లెక్కలేకుండా, కేంద్ర అనుమతులు సైతం ఆయనకు తృణప్రాయంగా మారుతున్నాయి.


దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై చాలా కాలమే కావచ్చు. విదేశీ ప్రతినిధులు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపే వెసులుబాటు బాగా పెరిగి వుండొచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడితోనో, బ్రిటన్ ప్రధానితోనే ఏకాంత చర్చలు జరిపే అధికారం కేవలం ఈ దేశ ప్రధానికి, రాష్ట్రపతికి తప్ప మరెవరికీ ఉండదు. కానీ దాన్ని సైతం లెక్కచేయని చరిత్ర చంద్రబాబుకు ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్‌తో ఏకాంత చర్చలు జరిపి ఆయన చరిత్ర సృష్టించారు. అప్పటి ప్రతిపక్షనేత ఎంవీ మైసూరారెడ్డి అసెంబ్లీలో చంద్రబాబును నిలదీసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. ఆయా దేశాల అధ్యక్షులతో ఏకాంత చర్చలు జరిపే అధికారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకెక్కడిదని నిలదీశారు. 


అదొక ఘనత అన్నట్లు అప్పట్లో చంద్రబాబు ఆస్థాన పత్రిక, అమాయక జనాల చేత బాబుకు చప్పట్లు కొట్టించే ప్రయత్నాలు చేసేది, కానీ వాటిని రాజ్యాంగ ఉల్లంఘనలని ఏనాడూ చెప్పిన పాపానపోలేదు. అవే బాబు ఆస్థాన పత్రికలు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ కథనాలకు ప్రాధాన్యమిచ్చి రాయకపోవడాన్ని గమనించాలి. బాబు అతిశయాలు, ప్రచారార్భాటాలు దేశానికి ఉపయోగపడ్డాయో, అనర్థాలయ్యాయో తెలియదు కానీ ఆయన అతిక్రమణలు, ప్రచారార్భాటాలు మాత్రం మారలేదని వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్‌తో పాటు, మొన్న రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట సంఘటన కూడా చెపుతున్నది.


చివరగా..రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఒక విషాదం. "నావల్ల తప్పు జరిగివుంటే, క్షమించండి" అని చంద్రబాబు స్వయాన తన తప్పును గుర్తించి క్షమాపణ కోరారు. కానీ ఆయన అతిశయాలు, ప్రచారార్భాటాలను నమ్ముకొని రాజకీయాలను ఈదగలనని, పక్క రాష్ర్టాన్ని ప్రత్యర్థిగా భావించి అక్కడి అస్తిత్వ పాలకుడిని తుడిచేయగలనని అనుకున్నంత కాలం.. బాబుకు ఆయనే ఒక సమస్యగా మారుతాడు తప్ప, ఆయన ఎత్తుగడలు మాత్రం నిజం కాలేవు.


వ్యాస రచయిత: కల్లూరి శ్రీనివాస్ రెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!