-పాతవన్నీ రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.. కొత్త కార్డులకు గ్రీన్‌సిగ్నల్
-పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
-రాష్ట్రంలోని కుటుంబాలకంటే అధికంగా ఉన్న కార్డులు
-కొత్త కార్డుల్లో బోగస్‌కు అవకాశం ఇవ్వొద్దు
-పరిమితికి మించి ఉన్న కార్డులను డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాలి: కేసీఆర్
-పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
-రాష్ట్రంలోని కుటుంబాలకంటే అధికంగా ఉన్న కార్డులు
-కొత్త కార్డుల్లో బోగస్‌కు అవకాశం ఇవ్వొద్దు
-పరిమితికి మించి ఉన్న కార్డులను డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాలి: కేసీఆర్
పాత రేషన్‌కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడనుంది. కొత్త రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను చేపట్టనుంది. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్యకంటే రేషన్‌కార్డులు ఎక్కువ ఉండటంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్మయం వ్యక్తం చేశారు. తక్షణమే పాత కార్డులు రద్దు చేసి.. కొత్తవి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ బోగస్‌కు అవకాశం లేకుండా చూడాలని, ఇందుకు పకడ్బందీగా విధివిధానాలు రూపొందించాలన్నారు. పౌరసరఫరాల శాఖపై అధికారులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 83.59 లక్షల కుటుంబాలు ఉంటే.. తెల్ల రేషన్‌కార్డులు 91 లక్షలకుపైగా, గులాబీ రంగువి 15 లక్షలు, అంత్యోదయ కార్డులు 40 వేలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. కుటుంబాలకంటే 32 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయనివెల్లడించారు. రేషన్‌కార్డుల జారీలో గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పరిమితికి మించి ఉన్న కార్డులను డీలర్లు తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని.. లేకపోతే అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు అందుబాటులోకి తేవడంతోపాటు బోగస్ విషయంలో కఠినచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలోఅర్హులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. ఏకీకృత విధానంతో కార్డుల జారీ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణలో పెట్రోల్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి