గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 13, 2015

"నీ దొంగ ప్రాజెక్టులకు అనుమతులున్నాయా...???" -మంత్రి టి. హరీశ్ రావు ప్రశ్న

-ఏపీలో అనుమతుల్లేని ప్రాజెక్టులకు నీళ్లు నిలిపేస్తావా?
-ఏపీ సీఎంపై విరుచుకుపడిన మంత్రి హరీశ్‌రావు
-ఇంజినీర్లకు చేతినిండా పని కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని వ్యాఖ్య

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. 2013లోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున 35 రోజులపాటు 70 టీఎంసీలు తీసుకోవచ్చంటూ డీపీఆర్ కోసం ఉమ్మడి ప్రభుత్వం ఈ పథకానికి జీవో ఇస్తే, దానిని చంద్రబాబు కొత్త ప్రాజెక్టు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏపీలో హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా?అని నిలదీశారు. ఒకవేళ అనుమతులు లేని ఆ ప్రాజెక్టులకు నీళ్లు నిలిపివేస్తే మేము కూడా ఆలోచిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

harish



అందుకు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ రంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌వాసులకు తాగునీళ్లు ఇచ్చేందుకు చంద్రబాబు అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇంకా వాటా కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌పై తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఆగస్టులోపు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఏ అనుమతులతో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి కేటాయింపులు కేవలం రాష్ర్టాలకు సంబంధించిన విషయమని, ఏ ప్రాంతానికి, ఏ ప్రాజెక్టుకు నీటిని కేటాయిస్తారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని గతంలోనే కేంద్రం, సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి