గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 20, 2014

వారు వారే...మనము మనమే!


తెలగాణులు సీమాంధ్రులు
వేరు వేరు ఉపాధులే!
నిన్నటి వరకును వారలె
తెలగాణకు పాలకులయ!

సీమాంధ్రా వలసవాద
పాలనమ్ము జరిపి మనను
దోచినంత దోచి దోచి
ఇప్పటికిని వదలకుండె!

వలసవాద పాలనమ్ము
నెరపబూని తెలగాణలొ
ఆంధ్రపార్టి లిప్పటికిని
బానిసలను నిలుపుకొనెను!

అరువదేండ్లుగాను తెలం
గాణ దోపిడుల డుల్చగ
ఉద్యమించి సాధించిన
తెలగాణను కానరైరి!

తెలంగాణ అస్తిత్వము
గానకుండ బానిసలే
ఆంధ్ర పార్టి అడుగులకును
మడుగులొత్తుచుండిరయ్య!

ఇట్టి బానిసల నాధా
రమ్ముగ జేకొని వారలు
తెలంగాణలోన మరల
జెండా పాతగనుండిరి!

తెలగాణకు ఆంధ్రపార్టి
ఇంకా కావలయునా?
ఆంధ్రపార్టి బానిసలను
గొయ్యితీసి పాతేయుడు!

మన రాష్ట్రం మన సంస్కృతి
మన అస్తిత్వము మనదే!
వలస పాలకుల దోపిడి
మనకు వలదు, మనకు వలదు!


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి