"అభివృద్ధి"యె అవకాశం!
మార్పుతెచ్చు చోదకం!
ఎట్టి పనియు మొదలైనా,
వెనుకనె అభివృద్ధి యుండు!!
సెక్రెటేరియట్‍ను ఎర్ర
గడ్డలోన పెడుదమన్న,
సాగరు ప్రక్షాళనన్న
హైదరబా దెమ్మెల్యే
లడ్డుపడుదురే? ఇంక
గగ్గోలులె? కోపాలే?
అంతర్జాతీయకళా
క్షేత్రం కడదామంటే,
కుంటి, గ్రుడ్డి సాకులేల?
అడ్డగింప జూడనేల?
"ఎర్రగడ్డ" సచివాలయ
మే "పికెట్"కు తరలినచో,
నష్టమెవ్వరికి జరుగును?
ఎర్రగడ్డ ప్రజలకె గద!
అభివృద్ధియె తొలగుకదా!!
ఎన్‍టీఆర్ స్టేడియమున
కళాభారతిని కట్టుట
నెమ్మెల్యేలడ్డుకొనిన
నష్టమెవ్వరికి జరుగును?
లోయర్ ట్యాంక్‍బండ్ నివాసు
లకె జరుగును యోచింపుడు!!
ప్రభుత్వమ్ము నిర్ణయించు
ప్రదేశములలొ నిర్మించిన
ఆ ప్రదేశములె వృద్ధిని
పొంది వెలిగిపోవును గద!
కళాభారతి నశోక్‍నగర్
విడచిన వేరొక చోటకు
పద్మరావొ, తలసానో
సంతసాన కొనిపోదురు!!
తరువాతను అశోక్ నగర్
పరిస్థితియు నెటకుపోవు?
ఏ వృద్ధియు లేకుండా
చరిత్రలో నిలిచిపోవు!!
ఎమ్మెల్యే లైదేండ్లే!
ప్రజలో? స్థిరనివాసులే!!
అశాశ్వతులె అడ్డుపడిన
శాశ్వతులకె నష్టమ్మగు!!
యోచింపుడు ప్రజలారా
ఏమి చేయవలెనొ యిపుడు!!!
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
(సవాల్ రెడ్డిగారి వ్యాసంకోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి