గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 01, 2014

తెలంగాణ హెచ్‌వోడీల్లో 18,662 మంది సీమాంధ్రులే


-వారంరోజులు స్వరాష్ట్ర వారోత్సవాలు
-ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

తెలంగాణ రాష్ట్రంలోని హెచ్‌వోడీల్లో 18,662 మంది సీమాంధ్రకు చెందినవారే ఉన్నట్లు తెలంగాణభవన్‌లోని వార్‌రూంకు సమాచారం వచ్చిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణకు చెందిన వారు కేవలం 1,385 మందే పనిచేస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పోలీసు, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీతోపాటు మరికొన్ని ప్రభుత్వ శాఖల నుంచి వార్‌రూంకు సమాచారం రావాల్సివుందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా వార్‌రూంను సందర్శిస్తున్నారని, తమ ప్రాంతానికి చెందిన నాయకులు రాజకీయ లబ్ధికోసమే వార్ రూంపై విమర్శలు చేస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగులు అంటున్నారని శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. 3,240 మంది స్వయంగా వార్ రూంకు వచ్చి ఫిర్యాదు చేశారని, మరో 320 మంది లేఖల ద్వారా ఫిర్యాదులు చేశారని తెలిపారు. 

809 మంది మెయిల్స్ చేయగా, 4,357 మంది వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేశారని చెప్పారు. 146 మంది తప్పుడు ఫిర్యాదులు చేశారని వివరించారు. సీమాంధ్రులు ఉద్యోగాలు కొల్లగొట్టడంపై తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతో కోపంగా ఉన్నారని, ఇకనైనా సీమాంధ్రులు తమ స్వస్థలాలకు వెళ్లకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారన్నారు. ఎవరి ప్రాంతంలో వారు ఉద్యోగాలు చేయాలని కేసీఆర్ అంటుంటే సీమాంధ్ర నాయకులు పెడార్థాలు తీస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.60 కోట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. జూన్ 2న స్వరాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని అన్ని గ్రామాల్లో వారం రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి