- డిగ్రీ లెక్చరర్ల స్థాయిలో వక్రీకరణ
- తెలంగాణలో 330 మంది ఆంధ్ర డీఎల్‌ల అడ్డా
- ఆంధ్రలో అవస్థలు పడుతున్న 120 మంది
జోనల్ పోస్టులుగా చూపించి తెలంగాణలో తిష్ఠ వేసేందుకు ఆంధ్ర అధికారులు కుట్రలు చేస్తున్నారు. డిగ్రీ లెక్చరర్ల స్థాయిని తగ్గించి వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో తిష్ఠవేసిన 330 మంది డిగ్రీ లెక్చరర్ల కారణంగా ఆంధ్రలో 120 మంది తెలంగాణవాసులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2011లో ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సీమాంధ్ర అధికారుల కుట్రలకు బలవుతున్నారు. గ్రూప్ వన్ స్థాయి పోస్టును జోనల్ పోస్టుగా చూపించి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారిని అటు ఇటు కాకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైన పనిచేసే అధికారం ఉన్న పోస్టులను జోనల్ పోస్టులుగా చూపిస్తూ ఏపీ కాలేజీయేట్ విద్య కమిషనర్ గతంలోనిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం మేరకే కమల్‌నాథన్ కమిటీకి ఉద్యోగుల వివరాలు అందజేశారని డిగ్రీ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.- తెలంగాణలో 330 మంది ఆంధ్ర డీఎల్‌ల అడ్డా
- ఆంధ్రలో అవస్థలు పడుతున్న 120 మంది
జోనల్ క్యాడర్‌గానే గుర్తించడంవల్ల భవిష్యత్‌లో ఏపీ జోనల్‌లోనే ఉండిపోవాల్సి ఉంటుందని, తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశాన్ని కోల్పోతామంటున్నారు. ప్రస్తుతం ఏపీలో తెలంగాణ డిగ్రీ లెక్చరర్లు 120 మంది వరకు పనిచేస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఏపీ లెక్చరర్లు 330 మంది పనిచేస్తున్నారు. వీరంతా తెలంగాణలోనే ఉండి పోయేందుకు జోనల్ పోస్టుగా డీఎల్ పోస్టులను చూపించాలని కుట్రలు చేశారు. డీఎల్ పోస్టులను స్టేట్ క్యాడర్ పోస్టులుగా గుర్తించాలని, తిరిగి తెలంగాణకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీలోని తెలంగాణ డిగ్రీ లెక్చరర్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్మిక విభాగంలోనూ ఇదే కుట్రలు..
స్టేట్ క్యాడర్ పోస్టుకు చెందిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టును మల్టీ జోనల్ పోస్టులుగా చూపిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక క్యాడర్ పోస్టును మార్చాలంటే ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో రాష్ట్రపతి ఆమోదం లేకుండా దొంగ జీవోలు తీసుకువచ్చి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టులను మల్టీజోన్‌గా చూపించడంతో తెలంగాణ ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ విషయంపై కార్మికశాఖలో తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పోస్టును తక్షణమే స్టేట్ క్యాడర్‌గా చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీమాంధ్ర ప్రభుత్వం చేసిన కుట్రలను తక్షణమే అడ్డుకోవాలని, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారంతా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో తొమ్మిదో షెడ్యూల్‌లో గాని, పదో షెడ్యూల్‌లో గాని ఎక్కడా చూపించకపోవడంతో అందులో పనిచేస్తున్న దాదాపు 50 అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో కూడా రెండురాష్ర్టాలు స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని లేబర్ డిపార్టుమెంట్ అధికారుల బందం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి