గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 01, 2014

ఏపీఐఐసీలో అంతా ఆంధ్రోళ్లే!


-తాత్కాలిక ఉద్యోగుల కేటాయింపులో వివక్ష
-ప్రధాన కార్యాలయంలో పెత్తనం
-తెలంగాణకూ ఆంధ్రా అధికారులేనట!
-టీ జోన్లల్లో భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)లో సీమాంధ్ర పెత్తనానికి అడ్డూఅదుపుల్లేకుండా పోతున్నాయి. 80 శాతానికిపైగా ఆంధ్ర ఉద్యోగులతో నిండిపోయిన ఈ సంస్థలో రాష్ట్ర విభజన ఏకపక్షంగా సాగుతోంది. ఉన్నతాధికారులు కూడా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపాయింటెడ్ డే నాటికి విభజన ప్రక్రియను పూర్తిచేయకుండా వారి పనులను చక్కదిద్దుకునేందుకు అవసరమైన సమయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏడాది పాటు ఉమ్మడిగా కొనసాగించవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో వెసులుబాటు కల్పించడాన్ని ఆసరాగా చేసుకొని విభజన ప్రక్రియను మరింత జాప్యం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగేలా చూసుకుంటున్నారు. 

తెలంగాణ రాష్ర్టానికి కూడా సీమాంధ్రకు చెందిన అధికారులనే కేటాయించారు. ఇది తగదంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్ రంజన్ పట్టించుకోవడం లేదు. కనీసం ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టానికి కేటాయించిన సీమాంధ్ర ఉద్యోగుల స్థానంలో మార్పులు తీసుకురావాలంటూ ఎండీని ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తెలంగాణ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరినా ఆయన పట్టించుకోలేదు. ఇక తెలంగాణ రాష్ర్టానికి కేటాయించిన అధికారుల్లో ఆంధ్రులే అత్యధికంగా ఉన్నారు. సీమాంధ్రకు చెందిన వారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేషీలో మేనేజర్‌గా వీ శశికళ, ఇంజినీరింగ్ విభాగంలో సీఈగా ఆర్ చెంచయ్య, మేనేజర్(ఈ)గా రఫ్‌ఖ్‌జానీ, ఎలక్ట్రికల్ డీజీఎంగా జీ శ్రీరాంమూర్తి, అసిస్టెంట్ మేనేజ్‌మెంట్ విభాగంలో సీజీఎంగా విజయ్ ఏ దేశ్‌ముఖ్, మేనేజర్‌గా ఎం పద్మజ, సెక్రటేరియల్ విభాగంలో మేనేజర్‌గా ఎం అనురాధ, లోకల్ అథారిటీ విభాగంలో మేనేజర్‌గా ఓవీటీ శారద, పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మేనేజర్‌గా ఏ సుధారాణి, ప్రాజెక్టు విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఆర్ కృష్ణమూర్తి, మేనేజర్లుగా ఎన్ ఆండాలు, సుస్మితపాల్, ఫైనాన్స్ విభాగంలో జీఎంగా ఎస్ శ్రీనివాసఫణి, ఎఎంగా పీ సురేశ్‌లను నియమించారు. తెలంగాణలోని హైటెక్ సిటీ, శంషాబాద్, జీడిమెట్ల, వరంగల్, కరీంనగర్, పటాన్‌చెరు జోన్లకు కూడా ఆంధ్రా అధికారులు, ఉద్యోగులను కేటాయించారు.

తెలంగాణ ఉద్యోగులు, అధికారులంతా తెలంగాణ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాలని కోరుకుంటారు. కానీ ఏపీఐఐసీలో మాత్రం వింత పోకడ కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ధర్మారెడ్డి, సురేందర్, నర్సింహారెడ్డిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేటాయించినా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని తెలిసింది. వారంతా అక్కడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. తెలంగాణకు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని టీ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగులు వారికి సూచించినా పట్టించుకోవడం లేదని తెలిసింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన తరుణంలోనూ ఏపీఐఐసీలోని తెలంగాణ అధికారులు సమైక్య భావనలో గడిపారన్న విమర్శలు ఉన్నాయి. దిగువ స్థాయి ఉద్యోగులు మాత్రమే తెలంగాణ సంఘంగా ఏర్పడి ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి