యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజన బిల్లు తెచ్చిందని సీమాంధ్రుల మనోభావాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను చేపట్టిందని మోడీ ఆనాడు విమర్శించారు. ఆయనే ఇప్పుడు హడావిడిగా ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ మొదటి కేబినెట్ సమావేశంలో హడావిడిగా తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌తో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేయడం సీమాంధ్రులకు కొమ్ముగాయడం తప్ప ఇంకేమీ కాదు. దాదాపు 300 గ్రామాలు, రెండు లక్షల జనాభాను, 27 వేల గిరిజన కుటుంబాలను 90 వేల ఎకరాల సాగుభూమిని 10 వేల ఎకరాల అటవీ భూమిని ముంపుకు గురిచేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అవసరాన్ని సమీక్షించి సవరించాల్సింది పోయి ముంపు సాకు చూపి 7 మండలాలను సీమాంధ్రకు ఇవ్వడం ఏమిటి?
మొదటి నుంచి మోడీ తెలంగాణ పట్ల ప్రతికూల ధోరణినే కనబరుస్తున్నారు. 2013 సెప్టెంబరు 13న ప్రచార బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసే దాకా పలు సందర్భాల్లో మోడీ మాట్లాడిన మాటలు, చేసిన చేతలు ఆయన తెలంగాణ పట్ల ప్రతికూలుడు అనే వెల్లడిస్తున్నాయి. ఉత్తి పుణ్యానికి చెప్పుడు మాటలు విని ఆయన తెలంగాణ పట్ల ప్రతికూలతను పెంచుకున్నారు.
తన మంత్రివర్గ సహచరులుగా ఎవరు ఉండాలన్నది పూర్తిగా ప్రధాని ఇష్టమే. ప్రత్యక్ష ఎన్నికలలో ప్రజలు ఎన్నుకొనని వారిని కూడా తన కేబినెట్ మంత్రిగా నియమించుకున్న మోడీ, ఎందుకనో పూర్తి మెజారిటీతో కమలం పువ్వు గుర్తుపై గెలిచిన దత్తాత్రేయను మాత్రం పక్కన బెట్టారు. మనవాడు అని కాదు కానీ యావత్తూ దక్షిణాదిలో దత్తాత్రేయలాంటి నాయకుడు ఆ పార్టీలో ఇంకొకరు లేరు.
బీజేపీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన నాయకుడు ఆయన. కేంద్రమంత్రిగా అవుననిపించుకున్నాడు. జనసంఘ్ కాలం నుంచి వీరు పార్టీలో ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. దత్తాత్రేయ ఓబీసీ కూడా. ఏ రకంగా చూసినా దత్తాత్రేయకు ఉన్న అనర్హత ఒక్కటీ కానరావడం లేదు. తెలంగాణవాడు కావడం తప్పా. కానీ ప్రతి రాష్ట్రం, ప్రతి కులం, ప్రతి ప్రాంతం తమకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటాయి. ఇది అవాంఛనీయమేమీ కాదు. 1952 నుంచి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం ఉంటూనే ఉన్నది. 1977లో మొరార్జీ కేబినెట్‌లో మినహా అన్ని మంత్రివర్గాల్లో తెలంగాణ వారున్నారు. ఇప్పుడు కొత్తగా మోడీ తెలంగాణ నుంచి ఒక్కర్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి మంత్రిపదవులు ఇచ్చిన మోడీ ఎందుకనో తెలంగాణకు మొండిచేయి చూపారు. 70 ఏళ్లు పైబడిన వారిని కేబినెట్‌లోనికి తీసుకోనన్న నియమం పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. అలా చూసినా దత్తాత్రేయ 70 ఏళ్ల లోపు వాడే.
మోడీ ఏప్రిల్ 22న ఎల్బీ స్టేడియంలో, అంతకు ముందు ఆగస్టు 11న నిజాం గ్రౌండ్స్‌లో తెలంగాణ పట్ల ప్రతికూలంగానే మాట్లాడారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడుల చెప్పుడు మాటలనే మోడీ అచ్చమైన హిందీలో వల్లించి వెళ్లారు. ఆయన మాటలు విని తెలంగాణ బీజేపీ నాయకులు సైతం నివ్వెరపోయారు. ఆయన మాటల వల్ల తెలంగాణ ప్రజల్లో ఏర్పడిన నైరాశ్యం, ప్రతికూలతను తగ్గించడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు నాలుగు రోజుల తర్వాత సుష్మా స్వరాజ్‌ను ప్రత్యేకంగా పిలిపించి ఇంకో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజన బిల్లు తెచ్చిందని, సీమాంధ్రుల మనోభావాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను చేపట్టిందని మోడీ ఆనాడు విమర్శించారు. అలా విమర్శించిన ఆయనే ఇప్పుడు హడావిడిగా (కాంగ్రెస్ తయారుచేసిన ఆర్డినెన్సు సమంజసమా, కాదా అని ఆలోచించకుండా) ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ తల్లిని చంపి బిడ్డను బతికించినట్లుందని మోడీ నోరారా తన తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేసి వెళ్లారు. తర్వాత కర్ణాటకలో జరిగిన ఒక సభలో కూడా ఇవే మాటలు మాట్లాడారు. ఏ సందర్భంలో కూడా మోడీ తెలంగాణ పట్ల సానుకూలతను ప్రదర్శించలేదు. ఈ సూక్ష్మాలు పట్టించుకోని అమాయక స్వభావులైన తెలంగాణ ఓటర్లు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలను గెలిపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మల్లారెడ్డిని మల్కాజిగిరి నుండి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు దత్తాత్రేయను సికిందరాబాద్ నుంచి గెలిపించారు. ఐదుగురు బీజేపీ శాసనసభ్యులను గెలిపించారు. 15 మంది తెలుగుదేశం శాసనసభ్యులను గెలిపించారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తెలంగాణలో బాగా పెరిగింది.
తెలంగాణ బీజేపీ నాయకులు ఎంత నెత్తినోరు కొట్టుకుని పొత్తు వద్దని చెప్పినా వినకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నరేంద్ర మోడి సై అన్నారు. అయినా తెలంగాణ ఓటర్లు మోడీపై అభిమానం చూపారు. మరి ఎందుకని మోడీ అలా మాట్లాడినట్లు? ఇద్దరు నాయకుల చెప్పుడు మాటలు విన్నారా? ఆయనలోనే ఆ భావన ఉందా? రెండింటిలో ఏది నిజమైనా, ఆయన పదవిలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు మేలు జరగదన్నది మాత్రం నిజం అనిపిస్తున్నది. మేలు చేయకపోనీ, చెప్పుడు మాటలు విని కీడు చేయవద్దన్నది తెలంగాణవాదుల విన్నపం. ఈ విషయంలో తెలంగాణ భాజపా నాయకులు పూనుకొని ఏదైనా చేయాల్సి ఉంది.
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వయసులోనూ, అనుభవంలోనూ చిన్నవాడు అనుకుంటే, సీనియర్లు, వృద్ధనాయకులు పలువురు ఉన్నారు. జంగారెడ్డి, బాల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితరులు ప్రత్యేక ప్రయత్నం చేసి తెలంగాణ పడుతున్న కష్టాలను, అవస్థలను, తిప్పలను మోడీకి వివరించే ప్రయత్నం చేయాలి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన ఆర్థిక, సాంస్కృతిక నష్టాలను అర్థమయ్యేలా వివరించాలి. ఆరు దశాబ్దాలుగా రెండు లక్షల ఉద్యోగాలు కోల్పోయి, నెలకు కొన్ని వందల కోట్ల రూపాయల పరపతిని నష్టపోయి, తెలంగాణ అన్నిరంగాల్లో వివక్షకు గురైంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి దొంగలు దోచిన ఇల్లులా ఉంది. మాట్లాడితే రాజధాని హైదరాబాద్ అభివృద్ధి అంటారు. హైదరాబాద్‌లో 90 శాతం ఆస్తులను గడసరి తనంతో రాజకీయ అధికారంతో వారే దక్కించుకున్నారు. నగర అభివృద్ధి ఫలాలు వారే అనుభవించారు. ఉద్యోగాలు పొందారు. పిల్లల్ని చదివించుకున్నారు. అమెరికాకు పంపించుకున్నారు. కోట్లకు పడగలెత్తారు. హైటెక్ సిటీ, మల్టీప్లెక్స్‌లు, మల్టిస్టోర్స్ బిల్డింగ్‌లు, ఫార్మా ఇండస్ట్రీ లు, ఫాంహౌస్‌లు అన్నీ వారివే. 200 కోట్ల టర్నోవర్ దాటిన తెలంగాణ పారిశ్రామిక వేత్తలను వేళ్ల మీద లెక్కించవచ్చు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ వారికి ఎక్కడా సందుపడ నివ్వలేదు. సంపాదించుకోనివ్వలేదు.
తెలంగాణలో, రాజధానిలో ప్రతి చిన్నా, పెద్దా ఉద్యోగాన్ని వారే దక్కించుకున్నారు. ప్రతి అవకాశాన్ని వారే చేజిక్కించుకున్నారు. చివరికి ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోకి కూడా వారే చోరబడ్డారు. నగర పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు, హోంగార్డులు కూడా వారే. జ్యూడిషియరీలోనైతే 80 శాతం మంది ఉద్యోగులు వారే. ఏపీపీఎస్సీ ఎంపిక చేసిన గ్రూప్ 1, 2 తదితర ఉద్యోగాల్లో 85 శాతం మంది సీమాంధ్రులే ఉన్నారు. ఇవి చాలవని తెలంగాణాలో ఎక్కడ గుంటెడు భూమి పచ్చగా ఉంటే అక్కడ గుంటూరు, కోస్తా కొంగలే వచ్చి వాలాయి. ఇలా వచ్చిన వారి పిల్లలు దొంగ ఎస్సీ, ముల్కీ సర్టిఫికెట్లతో ఇక్కడి ఇంజనీరింగ్ వైద్య విద్యలో అక్రమంగా దూరిపోయారు. 1956 తర్వాత జరిగిన అడ్మిషన్లను జాగ్రత్త పరిశీలిస్తే ఇలాంటి వారు వందలు కాదు, వేలల్లో ఉన్నారని తేలుతుంది. పీవీ నరసింహారావు విద్యామంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా సెటిలర్ మెడికో ఒకరు ఇలా దొంగ సర్టిఫికెట్‌తో పట్టుబడ్డారు. నిజానికి ఆ మెడికో అడ్మిషను రద్దుచేసి జైలులో పెట్టాలి.
కానీ తెలంగాణ పట్ల ఎంతో పట్టింపు ఉండే పీవీతోనే "జరిగింది ఏదో జరిగిపోయింది మెడికో మూడో సంవత్సరంలో ఉండిపోయింది కాబట్టి, ఎస్సీ సౌకర్యాలు వాడుకోకుండా చదువు పూర్తిచేసుకోవచ్చు" అని నిండు శాసనసభలో ప్రకటన ఇప్పించారు. ఇలాంటి కేసులు కోకొల్లలు! వీలైనన్ని సక్రమ అక్రమ పద్ధతుల్లో వారు ఇక్కడి విద్య, ఉద్యోగ సంపాదన అవకాశాలను కొల్లగొట్టారు. ఇక్కడి వనరులను, భూములను ఆక్రమించుకున్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ కాలనీలు, క్వార్టర్లలో ఉన్న 100 నివాసాల్లో 85 ఇళ్ళను వారే ఆక్రమించుకున్నారు. వారు హైదరాబాద్‌లో ఎంతగా నిండిపోయారంటే ఆంధ్ర పట్టణాల్లోని హైస్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు ఆ స్కూల్స్, సిల్వర్ జుబ్లీ ఫంక్షన్లు ఇక్కడే చేసుకునేటంత. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు. ఇస్త్రీ దుకాణం, ఇడ్లీ బండీ మొదలుకొని అన్నీ ఉపాధి అవకాశాలను వారే దక్కించుకున్నారు. అన్యాయాన్ని సహించక మా రాష్ట్రం మాకు కావాలంటే రాచిరంపాన పెట్టారు. కేంద్రం తెలంగాణను ఏర్పరిచింది. దీంతో సీమాంధ్రుల అక్కసు మరీ పెరిగిపోయింది. చిత్ర విచిత్ర పుకార్లు, చివరి దోపిడీ దొంగ ఏడుపులు మొదలుపెట్టారు. ఏ లెక్కలు చూసినా, ఏ రంగంలో చూసినా ఆరు దశాబ్దాల పాటు మూడు తరాల వారు తెలంగాణ బిడ్డల ఉసురు పోసుకున్నారు. ఆ ఉసురు ఊరికే పోతుందా...దాని ప్రభావం వారిపై పడుతుందా...అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
మాకు అన్యాయం జరిగిపోయిందని మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లు ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైతేనేం మోడీని కన్విన్స్ చేయగలిగారు. మంచిదే. ఆయన వాళ్ళ చెప్పుడు మాటలు వింటే విననీ, వారికి అదనపు నిధులు ఇస్తే ఇవ్వనీ, కానీ దొంగలు పడి దోచిన ఇంటిలా ఉన్న తెలంగాణ పట్ల సానుభూతి చూపకపోవడం మాత్రం అన్యాయం. రకరకాల పద్ధతుల్లో కట్నాలు, కానుకలు, ఆచారాలు అంటూ గడసరులైన మొగపెళ్ళివాళ్ళలా వారున్నారు. అప్పుసప్పూ చేసి ఉన్నది ఊడ్చి ఆడపిల్ల పెళ్ళి చేసిన ఇంటిలా తెలంగాణ ఉంది. ఈ విషయాన్ని మోడీకి అర్థమయ్యేట్లు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నాయకులదే. తెలంగాణపట్ల వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మోడీపై ఉంది. రాజధర్మాన్ని పాటించాలంటే ఆయన తెలంగాణ పరిస్థితిని జాగ్రత్తగా గమనించాల్సిందే. అన్యాయం జరిగిన వారిని ఆదుకోవాల్సిందే. ఆయనకు ఆ సద్భుద్ది కలగాలని భగవంతుని కోరుకోవడం కన్నా, తెలంగాణ వారు ఇప్పుడు ఏమీ చేయలేరనుకోవడానికి కూడా లేదు. తెలంగాణ వారికి తెలిసినన్ని నిరసన రూపాలు, ఉద్యమ కార్యాచరణలు బహుశా ఇండియాలో ఇంకెవ్వరికీ తెల్వవు. మోడీ పదేపదే తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే దాన్ని సక్కగ చేసే ఒడుపు తెలంగాణ వారికి ఉంది. కేసీఆర్ ఇచ్చిన ఒక్క బంద్ పిలుపుకు స్పందించి దాన్ని విజయవంతం చేసిన అవగాహన తెలంగాణ వారిది. తెలంగాణ ప్రజల సమర్ధతకు, ఉద్యమశీలతకు ఇది ఒక తార్కాణం మాత్రమే. కాబట్టి ఆయన ఇప్పటికైనా కళ్ళుతెరిచి తెలంగాణకు జరిగిన వివక్షను అర్థం చేసుకొని, తగినవిధంగా స్పందించాలి. లేకుంటే తెలంగాణ ప్రజల నిరసనను ఎదుర్కోవాల్సివుంటుంది.
-దుర్గం రవీందర్
నమస్తే తెలంగాణ దినపత్రిక
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
3 కామెంట్‌లు:
ఇది ఎవరికి వర్తిస్తుందో వారికి:
ఒక దరిద్రపుగొట్టు మొహంవాడు మన బ్లాగుల్లోకి వచ్చి ఏడుస్తున్నాడు...తన మనస్సులోని కుళ్ళునంతా వెళ్ళగక్కుతున్నాడు...తన ఈర్ష్యనూ,ద్వేషాన్నీ శాపనార్థాలద్వారా ప్రకటిస్తున్నాడు...!
ఓరీ అసందర్భప్రలాపీ...ఈర్ష్యాళూ...ఉడుకుమోతువాడా! రెండు రాష్ట్రాలేర్పడి ఎవరిపాలన వారికి వచ్చినా..ఇంకా తెలంగాణపై పడి దోచుకోజూడడం ఎందుకు? అలాంటి ఉద్దేశం వాళ్ళలో ఉన్నదని పసిగట్టిన తెలంగాణులపై ద్వేషం రగిలించుకుంటూ మండిపడడం ఎందుకు? మాపై మండిపడితే మేం ఏమీ మండిపోం...మీ హృదయాలే మండీ...మండీ మీరే కాలి మనశ్శాంతిలేకుండా పోతారు. నేను గతంలోనే చెప్పాను...పిల్లి శాపనార్థాలూ...ఏనుగుపోతుంటే కుక్కలు మొరిగినట్టు మొరగడాలూ మమ్మల్నేమీ చేయలేవు...కుక్క బెదిరించి చెప్పు ఎత్తుకుపోయినట్టు నీ దొంగఏడుపులూ...శాపనార్థాలూ...మొరుగుళ్ళూ ఉన్నాయి. ఇవి మాకు లెక్కలోనికి రావు. ఎందుకంటే మేం స్వచ్ఛమైనవాళ్ళం...ఎవరికీ ద్రోహం చేయలనికోరుకొనేవాళ్ళంకాం...కాబట్టి! పో..పో...మళ్ళీ రాకు ఈ బ్లాగులోకి! వచ్చావా సిగ్గులేనివానివే!
You are right Madhusushan
ధన్యవాదాలు మిత్రమా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి