గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఏప్రిల్ 04, 2014

కల్ల "బొల్లిబాబు" లొల్లి మనకేలయ?


సీమాంధ్రా ఆధిపత్య
క్రమంలోన తొమ్మిదేండ్లు
పాలించిన బొల్లిబాబు
తెలగాణకు ఏమిచేసె?

"తెలంగాణ" అనుమాటను
అసెంబ్లిలో నిషేధించె!
మూడు రాష్ట్రముల నిడు నెడ,
"తెలంగాణ వద్దు" అనియె!!

నేడు "రైతురాజ్యమిత్తు"
నన్న బొల్లిబాబు, నాడు
విద్యుత్తును కోరు రైతు
లను బలిగొనె కాల్పులందు!

పదవికొరకు మామకపుడు
వెన్నుపోటు పొడిచినట్టి
యితడు తెలంగాణులకును
వెన్నుపోటు పొడువలేడె?

తెలంగాణకనుకూలమ
టంచు బలికి పొత్తుగూడి,
కేంద్రం తెలగాణ మిడగ
ఎత్తగొట్టలేదె యితడు?

"రెండుకండ్ల సిద్ధాంతం,
సమన్యాయం, సమైక్యాంధ్ర,
సామాజిక తెలంగాణ,
బీసి ముఖ్యమంత్రి" అనుచు,

పూటపూటకిట్లు మాట
మార్చి, తెలంగాణ వీర
యువకుల బలిదానమ్ముకు
బాధ్యుడయ్యినాడు ఇతడు!

లోకసభలొ నెగ్గినట్టి
బిల్లు, రాజ్యసభకు రాగ,
వెంకయ్యతొ కుట్రజరిపి,
అడ్డుకొనగ బూనలేదె?

ఇట్టి బాబు...పచ్చబాబు...
బొల్లిబాబు...సీమబాబు...
చంద్రబాబు...తెలంగాణ
రాష్ట్రమ్మున అవసరమా?

తెలంగాణకన్యాయము
చేయగ సమకట్టినట్టి
కల్ల "బొల్లిబాబు" లొల్లి
డుల్ల చేసి పంపుడయ్య!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

బొల్లి అనే పదం వాడడం బాలేదు. ఆయనను వ్యక్తిగతంగా దెప్పిపొడవడం అవసరమా చెప్పండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీరన్నది నిజమే! కానీ ఆ బాబు చేసిన, చేస్తున్న పనులకు, అతనివల్ల మన తెలంగాణకు కలిగిన కీడు మనసులో మెదలడంవల్ల కలిగిన బాధచేత అలా అనాల్సివచ్చింది! వ్యక్తిగతంగా అతడు స్వార్థపరుడు, తెలంగాణ ద్రోహి కాబట్టే అలా అనవలసివచ్చింది గానీ మరో విధంగా కాదు. అలా అనడం సమంజసమేనని నేననుకొంటున్నాను. ఎందుకంటే...అతడు మనకు చేసిన కీడుముందు నేననే ఈ "బొల్లిబాబు" అంత కీడు కలిగించేదేమీకాదు కాబట్టి!

Unknown చెప్పారు...

అసలు... 'వ్యక్తే' ప్రమాదకారి ఐనపుడు వ్యక్తిగతంగానే విమర్శిస్తారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్ని రకాలుగ అవమానించారో గుర్తు తెచ్చుకో బ్రదర్!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిజం చెప్పావు భయ్యా! స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి