గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మార్చి 02, 2014

పచ్చి మోసం...!!


తెలగాణకు సీమాంధ్రులు
మరో దగా చేసిరయా!
రాష్ట్రమ్మేర్పడనుండగ
పచ్చిమోసమును జేసిరి!!

నాల్గు రాష్ట్రములలోపల
ఏర్పరచగ దలచినట్టి
నేషనలిన్స్టిట్యూటాఫ్
డిజైన్ ఒకటి కొల్లగొనిరి!

కేంద్ర క్యాబినెట్ లోపల
సీమాంధ్రకు జెందినట్టి
మంత్రులు కుట్రలను పన్ని
ఎన్‍ఐడిని కొల్లగొనిరి!

ప్రధాని సాక్షిగ వారలు
తెలంగాణకును ప్రతిపా
దించినదానిని ఆంధ్రకు
తరలింపగ సమకట్టిరి!

అస్సామున జోర్హాట్‍లో,
ఎం.పి.లోని భోపాల్ లో,
హర్యానను కురుక్షేత్ర,
ఏ.పీ.లో హైద్రబాదు!

నాలుగు ప్రాంతములందున
భారీప్రాజెక్ట్సేర్పా
టును జేయగ బూనినతరి
యిట్టి మోసమును జేసిరి!

హైదరబాదున పెట్టెడి
ప్రాజెక్టును విజయవాడ
తరలిస్తూ నిర్ణయింప
బరితెగించినారు వారు!

టీకాంగ్ నేతలు చూచియు
నోరుమెదపకుండుటేమి?
బిల్లు సవరణములు లేవు,
భారీ ప్రాజెక్ట్సులేవు!

సీమాంధ్రా కేంద్రమంత్రి
బృందమిట్లు చేయగాను
వ్యతిరేకింపకయుండిన
టీ నేతల నేమనవలె?

క్షమియింపరు, క్షమియింపరు,
తెలగాణులు క్షమియింపరు!
ఈ ద్రోహము క్షమియింపరు!
కాంగ్రెస్సును క్షమియింపరు!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


5 కామెంట్‌లు:

Trader చెప్పారు...

kshaminchakapothe ekkadaina dookandi andharu kata kattukoni... mee edupu mare over aipothondhi asalu. hyd nokkesaru, dabbulu nokkesaru, 60 years development nokkesaru.. inkaa enni kavali meeku. mundhu asalu hyd lo unna institutes ni sarigga chuskotam nerchukondi. future lo current kuda undadhu inka aa telangana lo. ee edupulu ippatitho aipovu.. kastha opika unchukondi.. inko 5 years edusthune undaali. tax benefits valla industries anni inka seemandhra ke. hyd lo current undadhu, small scale industries nasanam aipothai, migilina vaatini mee kcr, ktr collections kosam ani mooyinchestaru. pandaga cheskondi.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇంత కుట్రఉన్న సీమాంధ్రులను మేం సోదరులుగా ఎలా చూడాలి? మీలాంటి కుళ్ళుబోతులున్నంతకాలం దేశం బాగుపడదు. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు భయపడవనగా...సింహాలు భయపడతాయా? అరవై ఏండ్లు పోరాటం చేసి, సాధించిన తెలంగాణను ఆమాత్రం వృద్ధిచేసుకోలేనివాళ్ళమా? నీ ఏడుపులు కట్టిపెట్టి నీ ట్రేడింగులు చూసుకో, తగుదునమ్మా అని ఎవడో పిలిచినట్టు సొల్లువాగుడు వాగుతున్నావు. వెళ్ళు...వెళ్ళు! మమ్మల్ని ఆదరించిన సీమాంధ్రులే మావాళ్ళు! ఆదరించని వాళ్ళు మావాళ్ళు కాదనుకుంటాము. ఎవరు ఆదరించినా, ఆదరించకపోయినా మా బతుకు మేం బతుకుతాం. నీ కరెంటు నీవియ్యకపోతే మాకు బతుకుండదా? మాకుండే దారులు మాకున్నాయి. వెళ్ళవయ్యా...వెళ్ళు!

Trader చెప్పారు...

mee daarulu meekunnappudu maakedho isthunnaru ani edavatam enduku mari ? maaku theliyanidha mee daari... maa kashtanni dourjanyamga laakkotam.. adhe ga mee daari.. kanivvandi.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీదొక కష్టం...మేం దౌర్జన్యంగా లాక్కున్నాం అని బిల్డప్పు...! అసలు మేం దౌర్జన్యం చేసేవాళ్ళమైతే నీలాంటివాళ్ళను ఎప్పుడో తన్నితగలేసేవాళ్ళం. కాని మేం అలాంటివాళ్ళం కాం. మా నీళ్ళు, నిధులు, వనరులు, భూములు, కొలువులు అక్రమంగా, దౌర్జన్యంగా కొల్లగొట్టింది మీ సీమాంధ్రులు. మాపై పడి ఏడుస్తున్నది మీరు. మమ్మల్ని ఏడుస్తున్నారనడం...మొగుణ్ణి కొట్టి మొర మొర అనడమే. సిగ్గులేని రోషం లేని జన్మ...రావద్దన్నా మా బ్లాగుల్లోకి తగుదునమ్మా అని రావడం...అడ్డమైన పిచ్చికూతల్ని కూయడం...నీకే చెల్లింది. ఇక రాకు వెధవకూతలు కూయకు. వెళ్ళు!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఈ టపా చదవండి : పోరు తెలంగాణ...http://porutelangana.in/సీమాంధ్రకు-ప్రోత్సాహకాల

కామెంట్‌ను పోస్ట్ చేయండి