గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 20, 2014

మేం...మా రాష్ట్రంలోనే...పనిచేస్తాం...!


-కమల్‌నాథన్‌కు స్పష్టం చేసిన టీ ఉద్యోగులు
-ఐఏఎస్‌లు సీమాంధ్ర ఏజెంట్లుగా మారారని విమర్శ
-జూలై మొదటి వారానికి తుది జాబితా

గ్రామ సచివాలయం నుండి తెలంగాణ సెక్రటేరియట్‌వరకు తెలంగాణ వారే ఉండాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారంనాడు కమలనాథన్ కమిటీ సభ్యులతో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలున్నా సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాలతో కలిపి ఆరువేల మంది తెలంగాణ ఉద్యోగులను అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారని వారందరినీ వెంటనే బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఐఏఎస్‌లు తెలంగాణ ప్రభుత్వంలో ఏపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి కేటాయించిన 3 వేల మంది నాలుగోతరగతి ఉద్యోగులను వెంటనే సొంత రాష్ట్రానికి కేటాయించాని వారు కోరారు. నెలాఖరులో రిటైర్ కానున్న అడిషనల్ కమిషన సతీష్‌కుమార్‌ను ఏపీకి ఎలా కేటాయించారని నిలదీశారు. 

తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు, సీమాంధ్రవారిని వారి రాష్ట్రానికి ఇవ్వాలన్న తమ డిమాండ్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.కమిటీతో చర్చలు జరిపిన వారిలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, మహబూబ్‌నగర్ శాసనసభ్యులు వీ శ్రీనివాస్‌గౌడ్, సెక్రటేరియట్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు టీ రాజ్‌కుమార్‌గుప్తా, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కష్ణయాదవ్, కార్యవర్గ సభ్యులు నాగరాజు, రామారావు, తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు ఏ పద్మాచారి, ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు భిక్షం నాయక్, శ్రీనివాస్, కిషోర్, జే హరిగౌడ్ ,తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నరేందర్‌రావు, ప్రతినిధులు యాసిన్, గడ్డం జ్ఞానేశ్వర్ ఉన్నారు.

ఇద్దరు సీఎస్‌లతో కమిటీ భేటీ..
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మతో కమిటీ గురువారం సమావేశమైంది. ఉద్యోగుల విభజనలో అవకతవకలు, ఉద్యోగసంఘాల అభ్యంతరాలపై చర్చించారు. ఈ నెల 27న మరోసారి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, కమలనాథన్‌తో కలిపి సమావేశం నిర్వహిస్తారని, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చిస్తారని అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల ఉద్యోగులకు అనుగుణంగా మార్గదర్శక సూత్రాలను ప్రకటిస్తామని కమిటీ పేర్కొన్నది. జూన్ 27న అభ్యంతరాలను, అనుమానాలను స్వీకరిస్తామని, జూలై మొదటివారంలో తుది మార్గదర్శకసూత్రాలను ఇస్తామని తెలియచేసింది.

తెలంగాణ ఉద్యోగులను అణచివేశారు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీమాంధ్ర ఏజెంట్ల మాదిరిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఏ పద్మాచారి కమిటీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల విషయంలో స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంతే స్పష్టతను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చట్టపరిధిలోని నిబంధనల ప్రకారమే మా ఉద్యోగులంతా మా రాష్ర్టానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నరేందర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఖాళీలున్నా 75 మంది సెక్రటేరియట్ ఉద్యోగులను సీమాంధ్రకు పంపించారని, 76మంది సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణకు కేటాయించారని తెలిపారు.

రెండు రాష్ట్రాల వెబ్‌సైట్లలోనూ ఉద్యోగుల జాబితా
రెండు రాష్ట్రాల ఉద్యోగుల జాబితాను వెబ్‌సైట్లలో పొందుపరచాలని కమలనాథన్‌కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసి రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా ఉద్యోగుల విభజనలో పీటముడి కొనసాగుతోంది. ఎవరి సొంత రాష్ట్రంలో వారే పని చేయాలని తెలంగాణవాదులు, ఆప్షన్ ఇవ్వాల్సిందేనని సీమాంధ్రులు పంతాలకు పోవడంతో ఉన్నతాధికారులకు ఎటూపాలుపోవడం లేదు. గురువారం జరిగిన సమావేశంలో ఉద్యోగులకు ఆప్షన్స్ విషయంలో నిర్ణయానికి రాలేకపోయారు. దీనితో ఆప్షన్స్ విషయంలో ఉద్యోగుల జాబితాను తయారు చేసి తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచేందుకు ఆర్థిక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వెబ్‌సైట్‌లోని జాబితా మేరకు అభ్యంతరాలను స్వీకరించి, ఉద్యోగుల విభజనపైన తుది నివేదికను సిద్ధం చేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈనెల 27న మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఒరే చిన్నజీవీ! ముందు నీ ఏడుపు ఆపరా!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అడ్డమైన చెత్తవాగుడు వ్యాఖ్యలను ప్రచురించరనే విషయం నీ మొహానికి ఎప్పుడు తెలుస్తుంది?

కామెంట్‌ను పోస్ట్ చేయండి