గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 28, 2014

సీమాంధ్ర సిబ్బందిని సాగనంపండి

 
-నమస్తే తెలంగాణ ఎఫెక్ట్..
-జేఎన్టీయూహెచ్‌లో ఆందోళన
-వీసీని అడ్డుకున్న ఉద్యోగులు, విద్యార్థులు
-విధాన నిర్ణయాలకు కమిటీ ఏర్పాటు
VP-Rameshwararaoసీమాంధ్ర ప్రాంతానికి చెందిన డైరక్టర్లను, సిబ్బందిని పంపేయాలంటూ కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్ వద్ద విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బదిలీల్లో వల్లమాలిన ప్రేమ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనంతో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్, కిందిస్థాయి సిబ్బంది కదం తొక్కారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సిబ్బందిని వెంటనే పంపించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అడ్మినిస్ట్రేటీవ్ భవనం ముందు బైఠాయించారు.

తెలంగాణ కోటాలో పదవులు దక్కించుకున్న జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు స్వస్థలం జగ్గయ్యపేటని, అతనితోపాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 12 మంది డైరక్టర్లు, 22 మంది బీవోఎస్‌లు, 20 మంది హెచ్‌ఓడీలను వెంటనే సాగనంపాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీసీ రామేశ్వరరావుకు వర్సిటీ సిబ్బంది, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిపిన అధ్యాపక నియామకాలను కూడా రద్దు చేసి వెంటనే రీ నోటిఫికేషన్ జారీచేయాలని, అందులో కూడా తండ్రి స్థానికత ఆధారంగా తిరిగి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం తనకు లేదని రామేశ్వరరావు చెప్పడంతో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆయనను ఘెరావ్ చేశారు.

దీంతో చేసేదేమీలేక వీసీ రోడ్డుపైనే కూర్చుండిపోయారు. వివిధ విభాగాల డైరక్టర్లు వచ్చి విద్యార్థులు, సిబ్బందిని సముదాయించారు. ఆ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉన్నతాధికారులు వీసీ చాంబర్‌లో సమావేశమయ్యారు. సీమాంధ్ర సిబ్బందిని పంపించి వేస్తామని, అధ్యాపకుల భర్తీ రీ నోటిఫికేషన్ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతవిద్యాశాఖ మండలి చైర్మన్‌‍లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమావేశమనంతరం వీసీ తెలపడంతో విద్యార్థులు శాంతించారు. యూనివర్సిటీలో విధాన నిర్ణయాలపై పరిశీలనకు తెలంగాణకు చెందిన నలుగురితో వీసీ ఓ కమిటీ వేశారు.

కమిటీ చైర్మన్‌గా టీకేకే రెడ్డి, సభ్యులుగా పరీక్షల విభాగం సంచాలకుడు కూరపాటి ఈశ్వర్‌ప్రసాద్, ఎస్‌ఐటీ డైరక్టర్ గోవర్ధన్, కెమిస్ట్రీ హెచ్‌ఓడీ వెంకటరమణారెడ్డిలను నియమిస్తూ వీసీ రామేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు. శాశ్వత, తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీతోపాటు బదిలీల ప్రక్రియను, అడ్మినిస్ట్రేటివ్ డైరక్టర్లు, బీవోఎస్ చైర్మన్ల నియామకాలను ఈ కమిటీ పరిశీలించి, ఆమోదించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని వీసీ రామేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ సిబ్బంది, నాన్‌టీచింగ్ సభ్యులు, విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

పొరబడుతున్నారేమో.
ఇప్పుడు తాతపుట్టుక ఆధారంగా కదా స్థానికతను నిర్ణయించేది?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

వ్యంగ్యంగా అన్నా నిక్కము వక్కాణించితిరి. అభినందనలు! అంటే తాతలకాలం నుండీ తెలంగాణ నీళ్ళూ, నిధులూ, నియామకాలూ ఆంధ్రా అక్రమార్కులు దోపిడీ చేసినవిషయం మా కల్పన కాదని ఒప్పుకున్నట్టేగా! ఇలాంటి అక్రమార్కుల నుండి, మా తెలంగాణను కాపాడుకోవడానికి మేం తగిన జాగ్రత్తపడుతుంటే మధ్యలో మీ వ్యంగ్యాస్త్రాల అసలు రంగు కూనిరాగాలే దొంగలను పట్టిస్తున్నాయి. ఇకపోతే తెలంగాణ ఉద్యోగాలు అక్రమంగా కొల్లగొట్టి, ఇక్కడే రిటైరై, తెలంగాణ సొమ్మును పెన్షన్ రూపంలో పరాన్నభుక్కుల్లా తెగమెక్కాలనుకొనే అక్రమ పెన్షనర్లపై కూడా ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి. అప్పుడు తెలుస్తుంది వ్యంగ్యాలూ...గింగ్యాలూ ప్రయోగించడం...వృథా ప్రయాస అని! స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి