తెలంగాణ సభ్యుల తీవ్ర నిరసనల మధ్య పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ చేసిన ఆర్డినెన్స్ చట్ట రూపం దాల్చింది. ఈమేరకు ఇవాళ రాజ్యసభలో ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ చేసిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ బిల్లును ఆమోదించింది. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ కురియన్ బిల్లు ఆమోదం పొందినట్టు సభలో ప్రకటన చేశారు.
రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చుతూ ఇవాళ రాజ్యసభలో జరుగుతోన్న చర్చలో తెలంగాణ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ప్రేక్షకపాత్ర వహించారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. ఆంధ్రా సభ్యులు బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నా టీ టీడీపీ సభ్యులు మిన్నకున్నారని మండిపడ్డారు. పోలవరం బిల్లును అడ్డుకోవడంలో తెలంగాణ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ గిరిజనుల ప్రయోజనాలను పట్టించుకోని వారిని ప్రజాకోర్టులో నిలదీస్తామని హెచ్చరించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి