- 14న పవర్ పంచాయితీలోనే తేల్చుకుంటాం
- గోదావరి బోర్డుకు స్పష్టం చేసిన ఏపీ సర్కార్
విద్యుత్ వివాదాలపై ఆంధ్రా సర్కారు జగమొండిగా వ్యవహరిస్తున్నది. మా విద్యుత్ ఉత్పత్తి మాకే అన్న విధానానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టంచేసింది. సీలేరు బేసిన్ జల విద్యుత్‌తో తెలంగాణ వాటాపై గురువారం సాయంత్రం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. సీలేరు బేసిన్ (లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు) జల విద్యుత్ ఉత్పత్తి వివాదం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిలోకి చేరిన విషయం తెలిసిందే. గోదావరి బోర్డు ఆదేశాలను ఏపీజెన్‌కో బేఖాతర్ చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం బోర్డు దృష్టికి తీసుకువచ్చింది.
దాంతో గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ జే చంద్రశేఖర్ అయ్యర్ గురువారం హైదరాబాద్‌లో ఏపీ ఇంధన శాఖ, ఏపీజెన్‌కో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనూ ఆంధ్రా సర్కార్ అదే ధోరణిని వ్యక్తంచేయడం గమనార్హం. ఈనెల 14న రెండు రాష్ర్టాల విద్యుత్ వివాదాలపై ఢిల్లీలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు లోబడి తాము వ్యవహరిస్తామని, అంతవరకు బోర్డు ఆదేశాలను అమలుచేయలేమని పేర్కొంది. అదే విషయాన్ని రాతపూర్వకంగా తమకు అందజేయాలని గోదావరి బోర్డు ఆంధ్రా సర్కారుకు సూచించినట్లు సమాచారం.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
Manadi manam lakkunnappudu valladi vallaku iccheyadam mancidi.valla power basin manakenduku sir?
మొదటినుండీ అన్యాయానికి గురైనవారే...ఎప్పటికీ...ఇప్పుడుకూడా...అన్యాయానికే గురికావాలా? విద్యుదుత్పత్తికి సంబంధించి అన్నీ ఆంధ్రాలో నిర్మించి, తెలంగాణకు మొండి చేయి చూపడం న్యాయమా? నిజాం రాజుల హయాంలో భద్రాచలం ఎవరి ఏలుబడిలో వుంది? భద్రాచలం ఆంధ్రావాళ్ళదెలా అవుతుంది? వాళ్ళది వాళ్ళు లాక్కోవడం అన్యాయమైన మాట! ఇంకోవిషయం 1956 తర్వాత భద్రాచలంను ఆంధ్రావాళ్ళకు పాలించడం చేతకాకనే ఖమ్మంలో చేర్చారు. భద్రాచలం వాళ్ళదెలా అవుతుంది? ఇది అన్యాయం...అంటే్...ఆంధ్రా పెత్తందారులు, నాయకులు కలసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకోసం చేస్తున్న ధనార్జన కుట్ర! ప్రజలకు ఏమాత్రం లాభకరం కాకున్నా, డిజైన్‍ను మార్చి ఎవరికీ ఇబ్బంది లేకుండా పోలవరంను నిర్మించడానికి మార్గాలున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అన్యాయానికి పూనుకోవడం అమానుషం కాదా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి