గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 19, 2014

బ్యాంకు బకాయిల ఎగవేతలో...సీమాంధ్ర బడాబాబుల కంపెనీల సింహభాగం...!

-బ్యాంకులకు సున్నం వేస్తున్న బడాబాబులు
-రాజకీయ అండదండలతో ఎగనామం
-సింహభాగం సీమాంధ్ర కంపెనీలదే!
-లెక్కలు బయటపెట్టిన ఏఐబీఈఏ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ బ్యాంకుల్లో మొండి బాకీల పేరుతో పేరుకుపోయిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా ఆరువేల ఐదు వందల కోట్లు! కచ్చితంగా చెప్పాలంటే 6525.34 కోట్లు! కళ్లు తిరిగే ఈ లెక్కను బ్యాంకు ఉద్యోగుల సంస్థ ఏఐబీఈఏ బయటపెట్టింది.

table1ఇది కూడా అధికారికంగా కోర్టుల్లో కేసులు పడిన 413 ఖాతాలకు సంబంధించిన సొమ్మే! ఈ మొండి బాకీబకాయిదారుల్లో సింహభాగం ఘనత వహించిన పెట్టుబడిదారులు, బడాకంపెనీలవే కావడం ఒక విశేషమైతే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అనేక కంపెనీలు ఇందులో చోటు దక్కించుకోవడం మరో విశేషం. మొత్తంగా జాతీయ స్థాయిలో చూస్తే 4085 ఖాతాలకు సంబంధించి 70,367 కోట్లు మొండిబకాయిలుగా ఉన్నాయి. కోర్టులో కేసులు ఉన్న ఖాతాల సొమ్మే ఇంత ఉంటే.. ఇక ఇతరత్రా మొండిబకాయిలు ఎంత ఉంటాయన్నది ఊహిస్తే విస్మయం కలుగకమానదు! నిజానికి 1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత వాటి కార్యకలాపాలు సామాన్య ప్రజలకు ఎంతగానో చేరువకు వచ్చాయి. అయినా.. ఇప్పటికీ దేశ జనాభాలో 50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవంటే ఆశ్చర్యమే! 
దాదాపు ఐదు లక్షలకు పైచిలు కుగ్రామాల్లో బ్యాంకులే లేవంటే చిత్రమే! వీరందరికీ బ్యాంకింగ్ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉంది. కానీ.. ప్రధానంగా వ్యాపార, కార్పొరేట్ వర్గాలకే అత్యధిక స్థాయిలో రుణాలు అందుతున్నాయి. బ్యాంకు అధికారులు ఫిర్యాదులు చేసి, కోర్టులకు వెళుతున్నా.. మొండి బకాయిలపై తదుపరి కార్యాచరణలో ప్రభుత్వం విఫలమవుతున్నది. బడా కంపెనీలు ప్రతి ఒక్కటీ ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా అధికారపక్షం అండదండలు అనుభవిస్తుండటంతో మొండి బాకీలు జగమొండి బాకీలుగా తయారవుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం...ఆ సవాళ్లను అధిగమించే పేరుతో ప్రైవేటీకరణ జపం చేస్తున్నది. గ్లోబల్ కాంపిటిషన్ పేరుతో బ్యాంకు విలీనాలకు సిద్ధపడుతున్నది. ఏ స్ఫూర్తితోనైతే 1969లో బ్యాంకుల జాతీయకరణ చేశారో.. ఆ స్ఫూర్తిని మంటగలుపుతున్నది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. తిరిగి 1969కి ముందు రోజులకు హడావుడిగా పరుగులు తీస్తున్నది. ఈ చర్యలను నిరసిస్తూ బ్యాంకుల జాతీయకరణ 45వ వార్షికోత్సవమైన జూలై 19న డిమాండ్స్‌డేగా పాటించాలని ఏఐబీఈఏ పిలుపునిచ్చింది. ప్రాధాన్యతారంగాలైన వ్యవసాయం వంటివాటికి మరిన్ని రుణాలు ఇవ్వాలని, అన్ని ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వం పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నది. మొండి బాకీల వసూలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.
table
table
table

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి