గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 19, 2014

పదో షెడ్యూల్ కార్యాలయాలు విభజించాలి

- పోలవరం ముంపు గ్రామాల ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలి: దేవీప్రసాద్
రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో షెడ్యూల్‌లో నెలకొల్పిన కార్యాలయాలన్నింటినీ విభజించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో కమల్‌నాథన్ కమిటీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మరోసారి ఇదే విషయంపై ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను శుక్రవారం కలిసి సమస్యలు వివరించామని చెప్పారు. ఈ సందర్భంగా సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని విమర్శించారు.

csdeviprasadవీలైనంత త్వరగా మార్గదర్శకాలు విడుదల చేస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పని చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కూడా కలుగుతున్నదని చెప్పారు. హెచ్‌ఓడీలో మంజూరైన పోస్టుల ప్రకారం విభజన జరగాలని, తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రాంతానికి ఆర్డర్ టు సర్వ్ మీద వెళ్లి పని చేస్తున్న తెలంగాణ వారిని తిప్పి పంపించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముంపు గ్రామాల్లో పని చేసే ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వబోయే వేతనాలు ఆంధ్రప్రాంతంలో పని చేసే తెలంగాణ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి