-గవర్నర్, రాష్ట్రపతులకు ప్రత్యేక అధికారాలున్నాయి
-తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచందునాయక్
పోలవరం ఆర్డినెన్సు బిల్లుపై చర్చ జరిగి పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందినా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ప్రకారం దీని అమలును నిలువరించే అధికారం గవర్నర్‌కు ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచందునాయక్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందనేది నిర్వివాదాంశమని, వారి హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. ఢిల్లీలో బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ద్వారా సుమారు రెండు లక్షల మంది గిరిజనులు జీవనాధారం కోల్పోతారని, నిర్వాసితులవుతారని, పచ్చటి సాగుభూములు ముంపు ప్రాంతాలుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ఆర్డినెన్సు చట్టరూపాన్ని సంతరించుకున్నా గిరిజనుల హక్కులను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు ఈ చట్టం నిరోధకంగా మారుతుందని గవర్నర్ భావిస్తే దీని అమలును నిలువరించడానికి ఆయనకు అన్ని అధికారాలూ ఉన్నాయని అన్నారు.-తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచందునాయక్
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి