-రిటైర్మెంట్ వయసు పెంపునకు ప్రయత్నం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్ హైకోర్టులో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు మరో కుట్రకు తెరలేపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ఆంధప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన జీవో ఆధారంగా మరో రెండేండ్లు ఉమ్మడి హైకోర్టులో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టులో ఉద్యోగుల విభజన పూర్తికానప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన జీవో తమకూ వర్తిస్తుందని, 60 ఏండ్లు నిండే వరకు పోస్టుల్లో కొనసాగనివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆశ్రయించారు.ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు ఉద్యోగులు తమ దరఖాస్తులను రిజిస్ట్రార్‌కు అందచేశారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న సిబ్బంది సైతం అదే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ రెండు రాష్ర్టాలకు కలిపి ఒక్కటే ఉమ్మడి హైకోర్టును కొనసాగించాలని పునర్వ్యస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం జారీచేసిన పదవీ విరమణ పెంపు జీవోతో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది.
హైకోర్టులో ఉద్యోగులు 58 ఏండ్లకు రిటైరైతే మిగతా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కానీ వయస్సు పెంపుతో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతుంది. సిబ్బంది జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నప్పటికీ, ఉద్యోగుల భర్తీ, కొనసాగింపు, వారిపై ఇతరత్రా చర్యలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో జరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధంలేకుండా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయస్సు పెంపుతో తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఉద్యోగులకు జరిగే అన్యాయంపై హైకోర్టు తెలంగాణ ఉద్యోగుల సంఘం, హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చింది. ఉమ్మడి హైకోర్టులో ఉద్యోగుల విభజన పూర్తికాలేదని, ఇప్పుడు ఆంధ్రప్రాంత ఉద్యోగుల పదవీవిరమణ వయసును పెంచితే తాము ఆందోళనకు దిగుతామని తెలంగాణ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి