గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 21, 2014

ఆంధ్రా సర్కారు అలసత్వం.. విద్యార్థులకు శాపం...!

-వృత్తి విద్యా కోర్సుల అడ్మిషన్లు ఈసారి మరింత ఆలస్యమయ్యే దుస్థితి

ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు, మేనేజ్‌మెంట్ కోర్సుల అడ్మిషన్లు గత కొన్నేళ్లుగా ఆలస్యంగానే జరుగుతున్నాయి! ఆంధ్రా సర్కారు తీరు వల్ల ఈసారి మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఎదురవుతున్నది! గత ఏడాది(2013-14) విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, బీ ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభమై 22న ముగిసింది. సెప్టెంబర్ 24న సీట్ల కేటాయింపు జరిగింది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం(2014-15)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అలసత్వ నిర్ణయాల కారణంగా ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో సీమాంధ్ర ప్రభుత్వ వైఖరి కారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 
emcetతెలంగాణ విద్యార్థులకు తమ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని, ఏ ఒక్క తెలంగాణ విద్యార్థికీ అన్యాయం జరగనివ్వమని తెలంగాణ సర్కారు ఇప్పటికే కేబినెట్ తీర్మానం ద్వారా ప్రకటించింది. కానీ ఆంధ్రా సర్కారు మాత్రం తెలంగాణలో చదివే ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని అసంబద్ధ వాదనలు తెరమీదికి తెస్తూ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలు ఆలస్యం అయ్యేందుకు కారణమవుతున్నదని విద్యావేత్తలు అంటున్నారు. 1956 కంటే ముందు తెలంగాణలో నివాసం ఉన్న వారికి ఫీజులు చెల్లిస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. వీరిని గుర్తించేందుకు అప్పటికే చర్యలు చేపట్టింది. ఆంధ్రా సర్కారు ఇంతవరకూ ఫీజులు చెల్లిస్తామని ప్రకటించలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారా? లేదా? అని కౌన్సెలింగ్‌కు ముందే రెండు రాష్ర్టాలు చెప్పాల్సి ఉం టుంది. అప్పటివరకు అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయలేమని అధికారులు అంటున్నారు. ఆంధ్రా సర్కారు ఇంకా ఫీజులుపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తెలంగాణ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవాల్సి ఉం టుంది. తెలంగాణ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తే ఆలస్యమైన పని దినాల మేరకు విద్యా సంవత్సరాన్ని పొడిగిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే భరోసా ఇచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి