గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 22, 2014

"మీ బోనం మీదే.. నా సంస్కృతి నాదే..." -చంద్రబాబు

-తెలంగాణ బహుజన పండుగను గుర్తించని చంద్రబాబు


తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలకు సీమాంధ్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సెలవు మంజూరీకి నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్రపండుగగా ప్రకటించి సెలవిచ్చినందున ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సెలవు దినంగా ప్రకటించాల్సిందిగా స్వయంగా ఆంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కోరినా ప్రయోజనం లేకపోయింది. సంఘం చేసిన విజప్తిని చంద్రబాబు తోసిపుచ్చారు.

దీంతో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల సీమాంధ్ర పాలకుల వ్యతిరేకత మరోసారి బయటపడిందని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవలే బోనాల తొట్టెల పండుగకు తలసాని నివాసానికి వెల్లిన చంద్రబాబు, తన ప్రవర్తనతో తెలంగాణ సంస్కృతిని కించపరిచారు. పవిత్రంగా భావించే తొట్టెల పండుగలో కాల్లకున్న బూట్లతోనే ఆయన పాల్గొన్నారు. తెలంగాణ బహుజనుల పండుగ పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తించిన బాబు, తెలంగాణ రాష్ట్ర పండుగను గుర్తించ నిరాకరించి మరోసారి తన తెలంగాణ వ్యతిరేకతను చాటుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏం జేస్తం మా ఖర్మ: తెలంగాణ ఉద్యోగులు

బోనాల పండుగ నాడు తమకు సెలవు ఇవ్వకపోవడం పట్ల సీమాంధ్ర సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు తెలంగాణ ఉద్యోగులు టీ మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణ వచ్చిన సంబురం లేకుండా పండుగ పూటకూడా మాతోని బాబు పనిచేయించుకుంటున్నడు. ఇప్పటికే ఇక్కడ మాకు అనేక అవమానాలు జరుగుతున్నయి. మావోల్లు అందరు తెలంగాణల పండుగ చేసుకుంటుంటాంటే మీమేమో సీమాంధ్రల ఏడుసుకుంట పనిచేయాల్సి వచ్చింది. ఏం జేత్తం మా ఖర్మ" అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటిల వైఖరి మరోసారి బయటపడిందని తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు విమర్శించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

కోస్తా-సీమల్లో ఓణమ్ పండగకి కూడా సెలవివ్వరు. ఏ రాష్ట్రంలో పనిచేస్తే ఆ రాష్ట్ర నిబంధనలు పాటించాల్సిందే కదా?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నేనూ అదే రాశాను..."మీ బోనం మీదే.. నా సంస్కృతి నాదే..." అని చంద్రబాబు అంటున్నాడని! ఇతర రాష్ట్రాల సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించడానికి సంస్కారం వుండాలి. మనది భిన్నమతాలు, సంస్కృతులున్న దేశం. ఐనా మేం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మూర్ఖుల్లా వ్యవహరిస్తామంటే ఎవరేంచేస్తారు? మీ రాష్ట్రం మీ ఇష్టం. మధ్యలో మా ఉద్యోగులు బాధలకు గురవుతున్నారు అంతేగదా! మీకు చీమకుట్టినట్టైనా ఉండదు. మిమ్మల్ని మేం ఆదేశించగలమా? మొదట్నుంచీ దౌష్ట్యం గల సీమాంధ్రపాలకులకు ఎవరు చెప్పగలరు? అందుకే పరమతసహనం ఉండాలి, పరసంస్కృతి సహనం ఉండాలన్నాను. సంస్కారం ఉండాలన్నాను. మీలాంటి వంతపాడేవాళ్ళుంటే ఇలాంటి పాలకులు అలానే చేస్తారు. మానవత్వంతో ఆలోచించండి...ఏది సమంజసమో!

కామెంట్‌ను పోస్ట్ చేయండి