-లాంగ్‌స్టాండింగ్ ఇన్‌స్పెక్టర్లకు స్థానభ్రంశం
-హైదరాబాద్‌తోపాటు మొత్తం జోన్ల నుంచి డిప్యూటేషన్‌కు అవకాశం
-హైదరాబాద్‌తోపాటు మొత్తం జోన్ల నుంచి డిప్యూటేషన్‌కు అవకాశం
పోలీసుశాఖలో డిప్యూటేషన్లు పూర్తిచేసుకున్న సీఐలకు త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నారు. నిబంధనల ప్రకారం పోలీస్ అధికారులు కనీసం రెండేండ్లపాటు లూప్‌లైన్‌లో పనిచేయాలి. అలాకాకుండా ఏండ్లకేండ్లుగా లా అండ్ ఆర్డర్‌లోనే కొనసాగుతున్న సీఐలకు తర్వలోనే స్థానభ్రంశం చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం రెండేండ్లు లూప్‌లైన్‌లో డిప్యూటేషన్ పూర్తి చేసుకున్న ఇన్‌స్పెక్టర్లకు లా అండ్ ఆర్డర్‌తోపాటు ఇతర విభాగాల్లో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సీఐడీతోపాటు ఇంటెలిజెన్స్, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌ఐబీలో దాదాపు వంద మంది సీఐలు రెండేండ్లపాటు డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రేంజ్ మినహా మిగిలిన రేంజ్‌ల్లో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్న సీఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కానీ హైదరాబాద్ రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్లకు మాత్రం ఇంతవరకు పోలీస్‌శాఖ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో గందరగోళం ఏర్పడింది. హైదరాబాద్ రేంజ్‌లో 70 మంది ఇన్‌స్పెక్టర్లు రెండున్నరేండ్లు వివిధ విభాగాల్లో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నారు. వీరిలో 25 మంది ఇన్‌స్పెక్టర్లు విల్లింగ్ తీసుకొని రేంజ్ ఐజీకి రిపోర్ట్ చేశారు.
కానీ హైదరాబాద్ రేంజ్ ఐజీ ఇప్పుడు ఎక్కడా ఖాళీల్లేవని, పోస్టింగ్ సాధ్యంకాదని చెప్పడంతో సమస్య ఏర్పడింది. నిబంధనల ప్రకారం రేంజ్‌లో చాలాకాలంగా లా అండ్ ఆర్డర్‌లో ఉన్న సీఐలను బదిలీ చేయాలి. ప్రతి ఏడాది డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నవారు ఎంతమంది? లాంగ్ స్టాండింగ్ ఎంతమంది? మళ్లీ ఎంతమందిని ఈ ఏడాది డిప్యూటేషన్ కింద లూప్‌లైన్‌కు పంపించాలన్న నివేదికలు రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో రూపొందుతాయి. పని ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియను అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీనితో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్న సీఐల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డిప్యూటేషన్ పూర్తిచేసుకున్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వడంలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదులందాయి. దీంతో మంత్రి ఇటీవల డీజీపీతోపాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రేంజ్ ఐజీ, డీఐజీలతో సమావేశం ఏర్పాటుచేశారు.
లాంగ్ స్టాండింగ్‌లో ఉంటూ కేవలం లా అండ్ ఆర్డర్‌లోనే విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌స్పెక్టర్లను డిప్యూటేషన్‌పై లూప్‌లైన్‌కు పంపించాల్సిందేనని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనితో డిప్యూటేషన్ పూర్తిచేసుకున్న అధికారులకు ఈ వారం చివర్లో పోస్టింగులు ఇచ్చేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ కసరత్తు ప్రారంభించారు. అలాగే హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న సీఐలను లూప్‌లైన్‌కు పంపేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ విధంగా తెలంగాణవ్యాప్తంగా 120 మందికిపైగా సీఐలు లూప్‌లైన్‌కు బదిలీ కానున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి