- బ్రిటిష్‌నాటి కట్టడం దక్కించుకునేందుకు యత్నం
- తమకు కేటాయించాలంటూ గవర్నర్‌కు లేఖలు
- ఇచ్చే ప్రసక్తేలేదంటున్న తెలంగాణ అధికారులు

రాష్ట్రం విడిపోయినా తెలంగాణపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. విభజనలో తమకు కేటాయించని ఓ పురాతన భవనాన్ని సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పాత డీజీపీ కార్యాలయంలో ఉన్న పురాతన భవనాన్ని తమకు కేటాయించాలంటూ గవర్నర్‌కు లేఖల మీద లేఖలు రాస్తు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
విభజనలో భాగంగా సీఐడీ నూతన భవనాన్ని ఏపీ పోలీస్ డీజీపీ కార్యాలయంగా, పాత డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణ పోలీస్ డీజీపీ కార్యాలయంగా కేటాయించారు. ఆంధ్ర సీఐడీ విభాగం కోసం ఏసీ గార్డ్స్‌లోని పాత సీఐడీ కార్యాలయాన్ని, తెలంగాణ సీఐడీకి తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని మూడో ఫ్లోర్‌ను కేటాయించారు. చారిత్రక నేపథ్యం..ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పాత డీజీపీ కార్యాలయంలో ఉన్న పురాతన భవనంపై ఆంధ్రా అధికారుల కన్నుపడింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని స్వాధీనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ పోలీస్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అత్యంత పటిష్ఠంగా ఉన్న ఈ భవనంలో 1896 నుంచి 1992 వరకు పోలీస్ బాస్‌లు విధులు నిర్వర్తించారు. అంతటి చారిత్రకనేపథ్యం ఉన్న భవనాన్ని తమకు కేటాయించాలంటూ నెలరోజులుగా గవర్నర్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్నట్టు తెలిసింది. తమకు భవనాల కొరత ఉందని కట్టుకథలు చెప్తూ తెలంగాణ డీజీపీకీ లేఖలు రాశారు. దీనిపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఘాటుగానే స్పందించారు. బ్రిటీష్ కాలం నుంచి నిజాం రాజులు, తెలంగాణ పోలీస్‌శాఖ వరకు ప్రత్యేకమైన నేపథ్యం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ భవనం వదులుకోబోమని వారు చెప్పినట్టు సమాచారం. విభజన జరిగిన తర్వాత ఆ భవనానికి సంబంధించి కరెంట్‌బిల్లు చెల్లించడంతోపాటు భవన మరమ్మతులు తెలంగాణ పోలీస్ శాఖే చేయించిందని, అలాంటి భవనంపై తమకే పూర్తి హక్కులుంటాయని తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు.
నూతన సీఐడీ భవనం, పాత సీఐడీ భవనం, హైదరాబాద్‌రేంజ్ ఆఫీస్.. ఇలా పోలీస్‌శాఖలో ఉన్న ప్రధాన కార్యాలయాలన్నీ ఆంధ్ర పోలీస్ శాఖకే కేటాయించడంతో తెలంగాణ పోలీస్‌శాఖకు భవనాల కొరత ఏర్పడింది.
తాజాగా బ్రిటీష్ కాలంనాటి చారిత్రక కట్టడం పాత డీజీపీ కార్యాలయాన్ని కూడా కేటాయించాలని ఆంధ్రా అధికారులు అడగడం కుట్రపూరితమే అవుతుందని తెలంగాణ పోలీస్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకేచోట రెండురాష్ర్టాల పోలీస్‌శాఖలు పనిచేయలేవనే కారణంతోనే వేర్వేరుగా కార్యాలయాలు కేటాయించారు. తెలంగాణ పోలీస్ ప్రధానకార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈ హెరిటేజ్ భవనం తమకే చెందుతుందని గవర్నర్‌కు రాసిన లేఖలో తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. ఈ భవనాన్ని త్వరలోనే ఆధునీకరిస్తామని ఉన్నతాధికారులు టీ మీడియాకు తెలిపారు. చారిత్రక నిర్మాణాలకు పుట్టినిల్లులాంటి తెలంగాణలో ఈ భవనం తెలంగాణ పోలీస్‌శాఖకే చెందేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అన్ని భవనాలు ఆంధ్రాకేనా?

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!