గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మార్చి 26, 2014

ప్రజలందరి ఇష్టమే నెగ్గుతుంది!


తెలంగాణ ఏర్పాటుకు
సహకరించినట్టి వారు
మేమంటే మేమంటూ
తగవులాడువారలెవరు?

పొత్తు కుదరకుండుసరికి,
బీజేపీ, టీడీపీల్
ఒకరిపైన ఒకరు బురద
చల్లుకొనుచునున్నారయ!

రాజ్యసభలొ తెలగాణకు
ఒక్క వరము అడుగకుండ,
సీమాంధ్రకు వరములడిగి,
తెలగాణకు ద్రోహమిడిరి!

నాడు విషం కక్కినట్టి
తెలంగాణ వ్యతిరేకులు
వైసీపీ టీడీపిల
నేడిక్కడి పోటిలేల?

తెలగాణకు ద్రోహమ్మే
జరుగుచుండ నోరుమెదిపి
అడుగనట్టి టీకాంగ్రెస్
ఓట్లనిపుడు ఎటులకోరు?

అహర్నిశలు పదవులపై
కాట్లాడెడి ఈ నేతలు,
పదవిరాక, ఎడమొగమ్ము
పెడమొగమ్ముఐనారయ!

ఇట్టివారు తెలగాణను
త్వరగ బాగు చేతురెట్లు?
అంతఃకలహాల మునుగు
వారికి ఓట్లేతురెట్లు?

బీజేపీ, టీడీపీ,
వైసీపీ, కాంగ్రెస్సుల్
తెలగాణను మేలు నిడక
బానిసగా మార్చగలరు!

అనుచు తెలంగాణ రాష్ట్ర
సాధనమ్ముకై వెలసిన
పార్టీనే ఎన్నుకొనగ
ప్రజలందరు కోరుచుండ్రి!

ఎవరు నెగ్గుచో ఇచ్చట
బంగరు తెలగాణ స్వప్న
సాకారమ్మే జరుగునొ,
ఆ పార్టిని ఎన్నుదురట!

తెలంగాణలోన మిగత
పార్టీలన్నిటిని వదలి,
ఒకే ఒక్క పార్టినె ప్రజ
గెలిపించగ దలచెనంట!

ఇదియే నిజమగుచో ఇట
ఒకే ఒక్క పార్టి మాట,
అధికారము, శాసనమ్ము
రాజ్యమేలగలుగునయ్య!

కేంద్రమ్మును శాసించియు
వలసినట్టి సౌకర్యాల్,
నిధులు అన్ని తెచ్చుకొనగ
మార్గమ్మేర్పడగలదయ!

ఇటులైనచొ బంగరు తెల
గాణము శీఘ్రమ్ముగాను
ఏర్పడుటయె జరుగునయ్య!
బ్రతుకు బాగు పడునయ్యా!!

మరికొన్ని వివరములకై ఈ క్రిందివాటిపై క్లిక్ చేయండి:(నమస్తే తెలంగాణ సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి