గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 24, 2014

ఉమ్మడి రాజధానిలో సొమ్మొకరిది...సోకింకొకరిది...!


-ఒకే ప్రాంగణంలో రెండు ప్రభుత్వాఫీసులు వద్దు
-అక్రమ ఉద్యోగుల పెన్షన్ భారం ఎవరిదో తేల్చాలి
-సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంలం పరిష్కరించుకుంటాం
-మూసేసిన ఫైళ్లన్నీ అందుబాటులోకి తెండి
-మా అభ్యంతరాలు కేంద్రానికి చెప్పండి
-ఏ ప్రాజెక్టుకు ఎంత అప్పు చేశారు? ఎంత ఖర్చు చేశారు?
-ప్రధాన కార్యదర్శి విభజన ప్రజెంటేషన్ సందర్భంగా కేసీఆర్
-సమగ్ర వివరాలివ్వలేకపోయిన అధికారులు
-జూన్ 2లోగా పూర్తి వివరాలందించాలన్న గులాబీ బాస్
-సీమాంధ్ర సీఎం సచివాలయంలో వద్దు..
-గవర్నర్ దృష్టికి తీసుకొచ్చిన టీఆర్‌ఎస్ అధినేత

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన, పౌరసేవల ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించబోదని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వాళ్లు ఇక్కడి సేవలు వాడుకుని మామీద ఆ ఖర్చు రుద్దడమేంది? దీనివల్ల మా ఖజానా మీద అదనపు భారం పడుతుంది...ఆ ఖర్చులు వాళ్లనుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోండి. ఈ విషయమై కేంద్రానికి కూడా లేఖ రాయండి అని ఆయన అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసన్నకుమార్ మహంతితోపాటు పలువురు సీనియర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి 21 కమిటీలు రూపొందించిన రిపోర్టుల్లోని సారాంశాన్ని 45 పేజీల నివేదిక రూపంలో అధికారులు కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుమారు 3 గంటలపాటు దీంట్లోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన కేసీఆర్ పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారు. 

హైదరాబాద్‌లోని ఉమ్మడి ప్రభుత్వ సంస్థల నిర్వహణ వ్యయం గురించి ఆరా తీసి వాటి నిర్వహణకయ్యే వ్యయాన్ని ఇరు రాష్ట్రాలు భరించేలా మార్పులు చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించేందుకు అయ్యే ఏ ఖర్చూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించబోదని ఆయన స్పష్టం చేశారు. ఒకే ప్రాంగణంలో ఇరు రాష్ర్టాల కార్యాలయాలకు ఒప్పుకొనేది లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎంకు సచివాలయంలో కాకుండా మరోచోట కార్యాలయం చూడాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణకు కేటాయించిన అప్పు మొత్తం వివరాలు తెలుసుకుని ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారో సమగ్రంగా వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్నవారు 80 వేల మంది ఉన్నారని, వీటి భారం తెలంగాణ ఖజానాపై పడే పక్షంలో ఆ మొత్తం వివరాలు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలిసింది. ఫైళ్ల విభజన ప్రజెంటేషన్ సందర్భంగా మూసివేసిన ఫైళ్ల సంఖ్య గమనించిన కేసీఆర్ ఆ ఫైళ్లన్నీ తమకు అందుబాటులో ఉంచాలన్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థల వ్యయం పంచండి...
ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ సందర్భంగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, అపార్డ్‌లాంటి సంస్థలు ఇరు రాష్ట్రాలకు సేవలందిస్తాయని అధికారులు వివరించారు. వాటి నిర్వహణ ఖర్చు వివరాలు వాకబు చేసిన కేసీఆర్ ఆ వ్యయాన్ని తెలంగాణ సర్కార్‌కే అంటగట్టడం సమంజసం కాదని చెప్పినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 70 సంస్థలు షెడ్యూల్ 9లో ఉన్నాయని, వాటిలో మీట్, ఫిషరీస్ లాంటి సంస్థలను రద్దు చేస్తున్నట్లు అధికారులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో ఇప్పటికీ ఉన్నవారికి తోడుగా అదనంగా 42 ఐఏఎస్, 23 ఐపీఎస్, 33 ఐఎఫ్‌ఎస్ అధికారులు కావాలని కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎస్ కేసీఆర్‌కు చెప్పారు. ఫైళ్ల విభజన చర్చ సందర్భంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఫైళ్ల విభజన పూర్తయిందని అధికారులు చెప్పారు. మొత్తం ఫైళ్లు 44లక్షల 72వేల 132 కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 6లక్షల 48వేల 505, తెలంగాణవి 6లక్షల 29వేల 925, ఉమ్మడివి 2లక్షల 77వేల 33 ఉన్నాయని వివరించారు. మరో 29లక్షల 16వేల 589 పైళ్లను నిబంధనల ప్రకారం క్లోజ్ చేసినట్లు అధికారులు చెప్పగా వాటిని పునః సమీక్షించుకునేందుకు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ ఆదేశించారు. 


అధికార నివాసాలు ఒకేచోట వద్దు...
తెలంగాణలో మొత్తం 68వేల 182 స్థిరాస్తులు, భవనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అసెంబ్లీ, సచివాలయం, మండలి, అధికారుల నివాసాలు, మంత్రుల నివాసాలు, కార్యాలయాల విభజన పూర్తయిందని అధికారులు చెప్పారు. ఇందులో ఎమ్మెల్యే క్వార్టర్లు బ్లాకులుగా విభజించి బ్లాక్-1 ఒకరికి, బ్లాక్-2 ఒక రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఒక్కో రాష్ట్రానికి 56 చొప్పున కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్ దీనికి అభ్యంతరం చెబుతూ ఒకే ప్రాంగణంలో ఇరు రాష్ట్రాలకు ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ పరిధిలోకి వచ్చే కాంట్రాక్టుల వివరాలను అడిగిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకున్న కాంట్రాక్టులను తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందా? అని అధికారులను ప్రశ్నించారు. కొనసాగించడం లేదా రద్దు చేయడంలో కొత్త ప్రభుత్వానికి పూర్తి అధికారం, స్వేచ్ఛ ఉంటుందని సీఎస్ చెప్పారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, జిల్లా కేంద్రాలనుంచి జాతీయ రహదారులకు అనుసంధానంపై అడిగి తెలుసుకున్నారు. హోంశాఖపై చర్చ సందర్భంగా తెలంగాణలో 6వేలమంది పోలీసుల భర్తీ అవసరమవుతుందని అధికారులు తెలిపారు. 

ఇరిగేషన్‌పై అభ్యంతరాలు..
జలవనరులకు సంబంధించి కేంద్రం అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికారులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. కృష్ణ, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌లను ఏర్పరిచి నీటి వినియోగం, నిర్వహణ, పంపిణీ చేస్తారని వివరించారు. కేసీఆర్ స్పందిస్తూ ఉమ్మడి రాష్ట్రం ఆధారంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి తన తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరుతాం అని చెప్పినట్లు తెలిసింది. విద్యుత్ రంగంపై అధికారులు పూర్తి సమాచారం వెల్లడించలేక పోవడంతో పూర్తి వివరాలు కావాలని కేసీఆర్ ఆదేశించారు. బిల్లులోని సెక్షన్ 94 ప్రకారం పన్ను రాయితీల అంశంపై కేసీఆర్ ఆరా తీశారు. 

పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి...
ఆర్థిక చర్చ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలకు సంబంధించి కూలంకషంగా వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణకు పన్నులు, పన్నేతర ఆదాయంతోపాటు ఫైనాన్స్ కమిషన్ సూచనల ప్రకారం కేంద్రంనుంచి వచ్చే వాటాను కలుపుకుని రాబోయే 10 నెలల్లో రూ. 50,759కోట్లుగా లెక్కచూపారు. 2013-14లో పన్నుల ఆదాయంలో భారీ క్షీణత నమోదైందని చెప్పారు. గత అనిశ్చితుల కారణంగానే ఇలా ఉందని, కొత్త సర్కార్ ఏర్పడితే మార్కెట్‌లో విశ్వాసం పెరిగి ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయని అధికారులు చెప్పినట్లుగా తెలిసింది. ఇక తెలంగాణకు రూ. 67,000 కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు వివరించారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఋణంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతంలో ఏఏ ప్రాజెక్టు కింద ఎంత ఖర్చు పెట్టారు..? ఎంత ఆయకట్టు వచ్చింది...? ఏఏ ప్రాంతంలో రైతాంగానికి మేలు జరుగుతోందనే అంశాలతో కూడిన నివేదిక కావాలని కేసీఆర్ కోరారు. 

ఉద్యోగుల పూర్తి వివరాలు కావాలి..
అధికారులు ఉద్యోగుల వివరాలు ఇచ్చినపుడు రాష్ట్రంలో మొత్తం 12.94లక్షల ఉద్యోగుల్లో రాష్ట్రస్థాయి, జోన్, మల్టీజోన్, జిల్లా అధికారులెందరు వివరాలివ్వాలని ఆయన కోరారు. రెండున్నర లక్షల ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఎందరు, తెలంగాణకు ఎందరో స్పష్టతకావాలని ఆయన అడిగారు. న్యాయశాఖ, సర్వీస్‌శాఖ, జీఏడీ ఇతర ప్రభుత్వ కీలక శాఖలన్నీ చర్చించుకుని ఈ సమస్యలన్నీ పరిష్కరించేలా రిపోర్టు ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వివాదాలతో ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళేలా ఉండరాదని కూడా ఆయన కోరారు.

వివరాలివ్వలేక పోయిన అధికారులు...
అధికారులిచ్చిన 45 పేజీల నివేదికలో కేసీఆర్ అనేక లోటుపాట్లు గుర్తించినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న పలు కంపెనీల పేర్లు, కార్పొరేషన్లు, డైరెక్టరేట్లు, బోర్డులు ఈ నివేదికలో కనిపించడం లేదు. వాటి సంగతేంటని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అయితే వివరాలు అందుబాటులో లేక అధికారులు జవాబివ్వలేకపోయారు. లోటుపాట్లను సవరించి అపాయింటెడ్ డే అయిన జూన్ 2 లేదా మొదటివారంలోగానీ పూర్తిసమాచారాన్ని తనకు అందించాలని కోరారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అర్థం చేసుకుని నీటి కేటాయింపులు, ఆర్థిక వనరుల కేటాయింపు, ఆస్తి అప్పుల కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా జాగ్రత్తలు చెప్పారు. 

29వ రాష్ట్రంగా ఏర్పడుతున్న తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూడా బాగుపడాలి, బాగుండాలి, దేశంలోని ఇతర రాష్ట్రా లతో సమానంగా అభివృద్ధి చెందాలి...కానీ ఏ విషయంలనూ వివక్షత రాకుండా అధికారులే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా అనుమానాలు పెరిగేలా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు ఉండరాదు అని ఆకాంక్షిస్తున్నట్లుగా కేసీఆర్ అన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, ఏకే గోయల్, పేర్వారం రాములు, రమణాచారి, రామచంద్రుడు, ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్‌లు ఎస్పీ టక్కర్, పీవీ రమేష్, బీ వెంకటేశం, నాగిరెడ్డి, ప్రదీప్‌చంద్ర, సురేష్‌చందా, రేమాండ్ పీటర్, బీ శ్యాంబాబు, అజయ్ మిశ్రా, సంతోష్‌రెడ్డి, ప్రేంచంద్రారెడ్డి, ఎస్‌కే జోషి, డీజీపీ ప్రసాద్‌రావు, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
ప్రధాన కార్యదర్శి బృందంతో సమావేశం అనంతరం కేసీఆర్ గవర్నర్‌ను కలిశారు. లేక్‌వ్యూ గెస్టుహౌస్‌లో సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు ఉండటం సమంజసం కాదని, దీంతో రెండు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య పొరపొచ్చాలు పెరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ అధినేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దృష్టికి తెచ్చారు. సచివాలయంలో ఒకే ప్రాంగణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కొనసాగడం సమంజసంగా ఉండదని, సీమాంధ్ర ముఖ్యమంత్రి పనిచేసేలా మరో చోట ఏర్పాట్లు చేయడం మేలని సూచించినట్లు తెలిసింది. ఇక కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో ఒక అంతస్తులో తెలంగాణ ఉద్యోగులు, మరో అంతస్తులో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడం వల్ల సామరస్య వాతావరణం ఉండకపోవచ్చని, అలా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మధ్య మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం రూపొందించిన నివేదికలోని లోటుపాట్లు కూడా వీరి మధ్య చర్చలో చోటుచేసుకున్నట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అవును సొమ్ము ఒకరిది సొకు ఒకరిది. ఇన్నేళ్ళ పాటు అభివృద్ది చేసిన సీమాంధ్రుల సొమ్ము, తెలంగాణా దోపిడీదారుల సోకు. లోటు బడ్జెట్టుతో వెలుతున్న సీమాంధ్ర మీద పడి ఇంకా ఏడ్వడమే కొంత మంది లక్ష్యం. వీరినే క్రై బేబీస్ (Cry Babies) అంటారు. దేశం మొత్తం వీరికే రాసిచ్చినా వీరు తమ ఏడుపు మానుకోరు. బాబులు మీకు ఇచ్చింది చాలా ఎక్కువ. సీమాంధ్రకు అన్యాయం చేసి మరీ మీకిచ్చారు. పది సంవత్సరాలు ఉమ్మడి అని చెప్పారు. అంతేకానీ, ఉన్నదంతా దోచిపెడతామని మీరు సోమరుల్లా ఉండమని ఎవరూ చెప్పలేదు. సోమరితనాన్ని మానండి సోదరులారా. కాస్త సిగ్గు తెచ్చుకుని బాధ్యతలు కూడ నిర్వర్తించండి.

Unknown చెప్పారు...

సీమంధ్ర ఉద్యోగులను తరిమేస్తాం. తోకలు కోసేస్తాం, అంటున్న తెలంగాణ వారు వారి పిల్లలను మంచి చదువులకోసం, లేదా వివిధ పోటీ పరీక్షల కోసం ఆంధ్రాప్రాంతాలకు పంపడం దేనికి. అన్ని వివరాలు సేకరించుకునే వారు ఈ వివరాలు సేకరించడం లో ఉపేక్ష దేనికి ? సీమాంధ్ర వారు తెలంగాణాలో ఉండడానికి సిగ్గు కావాల్సినపుడు మరి మీపిల్లలు ఇక్కడ ఉండడానికి మీకేం కావాలి. మీ ప్రజలని ఆదరించి అభిమానించే మనసు మాది. అందరం కలిసుందాం. అందరం అభివృధ్ధి సాధిద్దాం. మీ పోరాట పటిమ చాలా గొప్పదని ఇక్కడ ప్రజలందరూ అనుకుంటూ ఉంటాము. ఒక అలుపెరుగని ఉద్యమకారుడు రాజ్యాధినేత అయినపుడు స్వరం, స్వభావం మార్చుకుంటూ మరింత యసస్సు ను సాధించాలి.

Unknown చెప్పారు...

ఎక్కడి వారు అక్కడే.....
తెలంగాణా లో ఉన్న సీమాంధ్ర వారు వెంటనే ఖాళీ చేయాలి. ఇక్కడపడి తినడానికి సిగ్గులేదు.(ఊరికే పోషిస్తున్నారా?) ఎక్కడి వారు అక్కడే అన్న సిధ్ధాంతం మీకు వర్తించదా ? సీమాంధ్ర వారి వివరాలు సేకరించేవారు ఆంధ్రాలో ఉంతున్న తెలంగాణా వారి వివరాలు సేకరించడం లో వివక్ష దేనికి. ఎంతమంది మీ పిల్లలు ఇక్కడ కాలేజీలలో చదువుతున్నారు. పోటీ పరీ్క్షల కోచింగుల కి మీ పిల్లలను ఇక్కడికి ఎందుకు పంపాలి ? అక్కడుంటున్న అంధ్రా వారికి సిగ్గు ఉండాలని డిమాండ్ చేస్తున్న మీకు ఇక్క్డ డుంటున్న తెలంగాణా వారికి ఉండఖ్ఖర్లేదా ? వీరి వివరాలు సేకరించరేం ?అందరూ మనవారే అనుకునే మనస్తత్వం ఆంధ్రావారిది. మీ సిధ్ధాంతం మీరు ఫాలో అయి అపుడు ఎదుటి వారిపై ప్రయోగించండి. అంతేకాదు, ఈ సిధ్ధాంతం మీ ప్రాంతమ్లో స్థిర పడిన అన్నిఇతర రాష్త్రాలవారి మీదా ప్రయూగిస్తారా ?
మీ పోరాట పటిమని మెచ్చు కునే ప్రజలు ఇక్కడ లేకపోలేదు. ఒక అలుపెరుగని ఉద్యమకారుడు అధినేత అయిననాడు స్వరం మారాలి, స్వభావం మారాలి. సమదృష్టి రావాలి. చరిత్రకారుడుగా మిగలడాని భగవంతుడు మీకొక అవకాశం ఇచ్చాడు. చరిత్ర హీనుడుగా ఉండాలనుకోవడం మీ దౌర్భాగ్యం. భౌతికంగా విడిపోయినా కలిసి అభివృధ్ధి సాధిద్ద్దాం. ప్రపంచ పౌరులుగా ప్రగతి సాధిద్దాం. మన తెలుగు వారి సత్తా ప్రపంచానికి చాటుదాం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సీమాంధ్రులు అభివృద్ధి చేసింది తెలంగాణులనా? తమ సొంత వ్యాపారాలనా? అరవైఏండ్లుగా తెలంగాణమీదపడి దోచుకున్నారు. ధనవంతులయ్యారు...అన్నివిధాల అభివృద్ధిపొందారు. సీమాంధ్రులు అభివృద్ధి చేసింది ఏముంది...తమను తాము అభివృద్ధి పరుచుకోవడం తప్ప! తెలంగాణలో ఎయిర్ పోర్టు పెట్టారా? ఫ్యాక్టరీలు నెలకొల్పారా? ప్రభుత్వాసుపత్రులను నెలకొల్పారా? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎక్కడవేసిన గొంగడి అక్కడే వుంది. మా తెలంగాణులను దోచి మీరు గొప్పగా మీ నగరాలను తీర్చిదిద్దుకున్నారు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి...ఇలా చెప్పుకుంటూపోతే చాలా పట్టణాలు అభివృద్ధి చేసుకున్నారు. మా తెలంగాణలో ఇలాంటి పట్టణాలేమున్నాయో చెప్పండి! మా ఆజంజాహీ మిల్లు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ...లాంటి పరిశ్రమల్ని కూడా లేకుండా చేశారు. నిజాం కాలంనాటి "మామునూరు ఎయిర్ పోర్టు"ను కానరాకుండా చేశారు...మీ సీమాంధ్రులు ఏం అభ్యివృద్ధి చేశారు? హైదరాబాదులో సర్కారు బడులు పెట్టారా? ప్రభుత్వ ఆసుపత్రులను పెట్టారా? సామాన్య పౌరులకు అవసరపడే వేటిని అభివృద్ధి చేశారు? మీ వ్యాపారాలను పెంచే...ప్రైవేటు హాస్పిటల్స్‍ను కట్టుకున్నారు, కార్పొరేట్ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ కార్లూ, మొదలైనవి తిరగడానికి, రవాణాకై, రోడ్లు వేయించారు...ఆ వేసినవాళ్ళూ మీ కాంట్రాక్టర్లే! ఇలా మమ్మల్ని దోచి, మీరు అభివృద్ధిచెందారు. మేం అణచివేతకు గురైవున్నామేగానీ, అభివృద్ధిచెందామా? దోపిడీ చేసి, పరాన్నభుక్కులై...మా కొలువులు, నీళ్ళు, నిధులు, భూములు కొల్లగొట్టారు...గొప్పవాళ్ళయ్యారు. ఇప్పటికీ మా ఉద్యోగాలు వదలడానికి కూడా సిద్ధంగాలేరు మీ సీమాంధ్రులు. మీ రాష్ట్రం ఏర్పడ్డాక...గతంలో ఏపీలో ఎన్ని ఉద్యోగాలున్నాయో అన్ని ఉద్యోగాలు అంతకన్న ఎక్కువ ఉద్యోగాలు మీకు వస్తాయి కదా! మరి మా తెలంగాణలో మేం ఉండాలి...మీ సీమాంధ్రలో మీరు ఉండాలి కదా! తెలంగాణ ఆస్తుల్నీ, ఉద్యోగాల్నీ పంపకంచేయాలని ఏడుస్తున్నారెందుకు? మా సొమ్ముకు ఆశపడికాదా? పదేండ్లు ఉమ్మడిగా ఇక్కడ ఉంటే అయ్యే ఖర్చులు ఎవడు భరించాలి? మా తెలంగాణ సొమ్ము ఖర్చుచేయాలని కాదా? అంటే ఏమిటి...సొమ్మొకనిది...సోకొకనిది కాదా? మాకు నీతులు చెప్పొచ్చాడండీ శ్రీరామచంద్రుడు...తేరగా దోచుకోవడానికి! సోమరిపోతులు మీరు...మేం కాము. మీరు పరాన్నభుక్కులు! మేం కాయకష్టం చేసుకొని జీవించాం...మీరు మాకు రావాల్సిన ఉద్యోగాలను అక్రమమార్గాలలో కొల్లగొట్టారు...నిజానికి అసలైన సోమరిపోతులు మీరే! తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్‍గా ఏర్పడ్డాక ఉమ్మడి హక్కులను కాలరాచి, సీమాంధ్రులే ఏకపక్షపాలన చేసి, మమ్మల్ని బానిసల్ని చేశారు. చప్రాసీ నౌకర్లు మాకు...ఆఫీసర్ల నౌకర్లు మీకు...ఆలోచిస్తే తెలుస్తుంది...ఎవరు ఎవర్ని అభివృద్దిచేశారో...ఎవరు సోమరిపోతులో? మమ్మల్ని పరిపాలించి...ఉమ్మడి బాధ్యతల్ని ఎగరగొట్టి మీరే వృద్ధి పొందారు...ఎవరు బాధ్యతల్ని మరచి, సిగ్గులేకుండా తమ స్వార్థంకోసం సంపాదనకోసం ఎవరు ఎగబడ్డారు? మీ సీమాంధ్రులు కారా? మమ్మల్ని సిగ్గుతెచ్చుకొమ్మంటున్నారు...బాధ్యతలు నిర్వర్తించమంటున్నారు....అసలు సిగ్గులేనివారు మీరు...బాధ్యతలు నిర్వర్తించకుండా వున్నది మీరు. లాబీయింగులతో మమ్మల్ని మోసగించి వృద్ధిపొందింది మీరు...మేం కాం. మమ్మల్ని ఏ విమర్షలయితే చేశారో అవన్నీ మీకే వర్తిస్తాయని తెలుసుకోండి! మరోసారి మమ్మల్ని నిందించడానికి తగుదునమ్మా అని మా బ్లాగుల్లోకి రాకండి. పొండి. సిగ్గులేని జన్మలు...

Unknown చెప్పారు...

ఓహో ప్రత్యుత్తరమీయలేని నా వ్యాఖ్యని తొలగించారన్న మాట. అయితే ఇది కూడా తొలగించగలరు. కాని సంతూషం ఎందుకంతే మీరు చదివారు. అర్ధంచేసుకున్నారని అర్ధమయింది. ధాంక్స్ .

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అన్ని ప్రశ్నలూ, సమాధానాలూ మీవే అయినప్పుడు నేను చెప్పేదేముంటుంది? పై వ్యాఖ్యల్ని నేను చూడడంలో ఆలస్యం కావడంతో ఎంతగా అభాండాలువేస్తున్నారు? మీకు సమాధానం ఇవ్వడానికి జంకి మీ వ్యాఖ్యను తొలగించారనే నిర్ణయానికి మీకై మీరే రావడం తొందరపాటు చర్య.

సీమాంధ్రుల (అక్రమార్కుల) విషయంలో మేం చాలా స్పష్టమైన విధంగానే స్పందించాము. మా నిర్ణయాలు కూడా స్పంష్టంగానే వున్నాయి. సీమాంధ్రులు సీమాంధ్రలోనే పనిచేయాలి. తెలంగాణులు తెలంగాణులు తెలంగాణలోనే పనిచేయాలి. మిమ్మల్ని అనేటప్పుడు...మా తెలంగాణులు సీమాంధ్రలో వున్నారుకదా...వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? అని మీ బాధ. మా తెలంగాణులు ఆంధ్రలో పనిచేయరు. వెనక్కి పంపించండి. మేమూ అదే కోరుతున్నాం. ఇక పోతే మా పిల్లలు పోటి పరీక్షలకై ఆంధ్రకు వస్తున్నారు...(సిగ్గులేక) అని మీ ఉవాచ. మీ కార్పొరేట్ విద్యా ప్రకటనల....విద్యావ్యాపార కుట్రల ప్రకటనల ప్రభావం...మా తెలంగాణులను మోసగించాయి. ఎండమావులను చూసి జలమని భావించి పరిగెత్తారు. ఆంధ్రలో చదివితే ఉద్యోగాలు తొందరగా వస్తాయని మీ ప్రకటనలను చూసిన మా అమాయక తెలంగాణులు తమ పిల్లల్ని ఆంధ్రాలో లక్షలకు లక్షలు పోసి చదివించారు...చదివిస్తున్నారు....కానీ...వారికి తెలియని ఒక మోసం ఇందులో వుంది. ఇది మా అమాయక ప్రజలు తెలుసుకోలేకపోయారు. మీరు ఆంద్రావాళ్ళకిచ్చినంత విలువ తెలంగాణులకివ్వరనీ...ఆంధ్రవాళ్ళకు ఏవిధంగానైనా ఉద్యోగాల కల్పన చేస్తారు...తెలంగాణులను ఉపేక్షిస్తారనీ మా అమాయక తెలంగాణ ప్రజలకు తెలియదు. ఇప్పటినుంచీ...తెలంగాణలోనే ప్రిపేర్ అవుతారు. మాకు మాతోనే కాంపిటీషన్ వుంటుంది కాబట్టి ఉద్యోగాలలో సీమాంధ్రులతో పడేబాధ వుండదు...సీమాంధ్రలో కోచింగ్ తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు. అయినా మావాళ్ళు మీ సీమాంధ్రకు వచ్చి ఎవరినీ మోసగించలేదు కదా! మీరు మాత్రం మా తెలంగాణుల్ని మోసగించి మా ఉద్యోగాలు కొల్లగొట్టారు...కాబట్టే మీ సిమాంధ్రులు (అక్రమార్కులు) అంటే మాకు కోపం...చులకన భావం...! లాభార్జనకై దేనికైనా...ఏ వెధవపనికైనా పూనుకుంటారు...నీతిమాలినవారు అని మ భావన.

అందరూ మా వారే అనుకునే మనస్తత్వం మా సీమాంధ్రులది...అని మీరంటున్నారు...ఎంతమంది ఇలా అనుకుంటున్నారు? అలా అనుకుంటే తెలంగాణలో అరవై ఏండ్లనుండి ఉద్యమం ఎందుకున్నది? సీమాంధ్రులు స్వార్థపరులు...నీతిమాలినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో ఉన్నప్పుడు మీరు చేసిన దోపిడీ ఎలా మరిచిపోతాం...? దోచుకుంటున్నప్పుడు ఈ నీతిసూత్రాలు ఎక్కడ దాచిపెట్టారు? ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు వున్నాయి..అనే మాట అక్షరాలా మీ సీమాంధ్రుల పట్ల నిజమైన మాట! పైకి నీతులు...వెనుక గోతులు...ఇదీ సీమాంధ్రుల దుష్టనీతి! కళ్ళుపెట్టుకొని చూడండి. ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా ఇదే! అసలు ఉద్యామాలు ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియదా? మీ అన్యాయాల వల్లనే మేం ఉద్యమిస్తున్నాం...ఇక మా ఉద్యమ నేతకు సమదృష్టి రావాలనడం హాస్యాస్పదం. ఎవరిపై సమదృష్టి చూపాలి? దోపిడీదార్లపైనా? దోపిడీకి గురైనవాళ్ళపైనా? మీరు మాట్లాడేదానిలో ఏమైనా అర్థం ఉన్నదా? మీరు దోచుకుంటారు...మేము మాత్రం మిమ్మల్ని మాతో సమానంగా మర్యాదగా చూడాలి. లేకుంటే మాకు సమదృష్టి లేనట్టులెక్క! ఎంత నీతిమంతులండీ...దిగొచ్చారు సత్యలోకంనుండి! ఎదుటివారికి నీతులు చెప్పకుండా...ఇప్పటివరకు తెలంగాణులకు జరిగిన అన్యాయంలో మీ సీమాంధ్రులకు ఎంత భాగస్వామ్యం ఉందో బాగా ఆలోచించండి...ఆ తర్వాత మా బ్లాగుల్లోకి నీతులు చెప్పడానికి రండి. మేం ఇప్పటి వరకూ అన్యాయానికి గురై వున్నాం...ఈ అన్యాయాల్ని ఇప్పుడిప్పుడే సరిచేసుకుంటున్నాం. అక్రమార్కులను తప్పకుండా ఏరిపారేస్తాం. రెండు రాష్ట్రాలేర్పడ్డాక ఇంకా తెలంగాణ ఉద్యోగాల్ని కోరుకోవడం సీమాంధ్రుల స్వార్థం... కాబట్టి మీ సీమాంధ్రులకు ఏమైన సిగ్గు శరం ఉంటే వెంటనే సీమాంధ్రకు పొండి...దొంగ సర్టిఫికేట్లతో ఇంకా ఇక్కడే కొనసాగాలని చూడకండి...ఇలా చేస్తే మీకు సమదృష్టి ఉందని మేం అనుకుంటాం...లేకుంటే మీకు సమదృష్టి లేదని తెలుసుకొని...అది మోలో ఎలా తేవాలో చేతలతో నిరూపిస్తాం. వాదనలు అనవసరం. స్వస్తి.

YJs చెప్పారు...

You are right!
I agree with you.
నేను మాట్లాడేది కూడా స్థానికం గురించే.
తెలంగాణలో తెలంగాణావాళ్ళు మాత్రమే వుండాలి. కదా?
మరి తెలంగాణావాళ్ళు తెలంగాణలో మాత్రమే వుండాలి. ఫ్రపంచంలో ఇంకెక్కడా వుండడానికి వీల్లేదు. మీ సమాధానం?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలంగాణులకు సీమాంధ్రులు చేసినంత ద్రోహం, మోసం, కుట్ర, దోపిడీ, నయవంచన ప్రపంచంలో ఎవరూ చేసివుండరు. మేమనేది ఇలాంటివాళ్ళు మా తెలంగాణలోవుండవద్దు...అని! మేం అమాయకుల...ఇలాంటి నీచమైన పనులు మాకు తెలియవు...చేయముకూడా! కాబట్టి సీమాంధ్రులంతటి అక్రమార్కులు మా తెలంగాణలో ఉండవద్దని! ఇక పోతే...తెలంగాణులు తెలంగాణలోనే ఉండాలి...ప్రపంచంలో ఇంకెక్కడా వుండడానికి వీలులేదు...అని మీరనడం...హాస్యాస్పదమైనమాట! ఎందుకంటే ద్రోహానికీ, వంచనకూ, దోపిడికీ గురైంది మేం...ఇలాంటి మాకు ప్రపంచంలో చోటు దొరకవద్దు...మీరు ఆక్రమించిన తెలంగాణ ఉద్యోగాల్లోనూ చోటు దొరకవద్దా? అంటే మేము రెంటికీ దూరమైపోవాలి...మీరు మాత్రం మీ ప్రాంతంలోని ఉద్యోగాలూ, మాప్రాంతంలోని ఉద్యోగాలూ...ఆఖరికిప్రపంచంలోని ఉద్యోగాలు అనుభవిస్తారన్నమాట! ఎంతటి నీతిపరులు! సత్యవంతులు! నూతిలో పడినవాళ్ళు నూతిలోనే వుండాలి...పైన ఉన్నవాళ్ళు ఇంకా పైపైకి పోవాలి! భేష్...గొప్పమాట! మీరు బతకాలి...మేం బతకవద్దు. ఎంత గొప్పమాట! అందుకే మీ సీమాంధ్రులను మేం నమ్మనిది! ఎంతైనా మీ సీమాంధ్ర బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు! ఎక్కడివాళ్ళు అక్కడే అంటే...ప్రపంచంలో ఎక్కడా ఉండవద్దని కాదు. మేం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండకూడదంటే...మీరు కూడా ఉండకూడదు....సరేనా...దీనికి మేం ఒప్పుకుంటాం...మీ సమాధానం?

YJs చెప్పారు...

నా ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదా?

1. ఆంధ్రలో చదివితే ఉద్యోగాలు తొందరగా వస్తాయని మీ ప్రకటనలను చూసిన మా అమాయక తెలంగాణులు తమ పిల్లల్ని ఆంధ్రాలో లక్షలకు లక్షలు పోసి చదివించారు...చదివిస్తున్నారు.
దీనికి ఋజువు చూపించండి.
2. కచరా తెలంగాణాకి కాపలా కుక్కలానే వుంటాను, నాకు పదవులు అక్కర్లేదు అని అందరి సమక్షంలో తెలియజేసి ఇప్పుడు సీ.యం. కావాలని అనుకోవడం, అన్న మాట మీద నిలబడకపోవడం కాదా? మీరు సమర్ధిస్తారా?
3. మీరు మాత్రం తెలంగాణాలో, ప్రపంచంలోని ఉద్యోగాలు అనుభవిస్తారన్నమాట! కానీ సీమాంధ్రులు మటుకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇధి యెంతవరకు సమంజసం?
4. "ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు." అని రాసిన మీరే సీమాంధ్ర ప్రజలను వుద్దేశించి ఈ కింది విధంగా రాయడం యెలా సమర్ధించుకుంటారు ?
అ. "సిగ్గులేనివారు"
బ్. "సిగ్గులేని జన్మలు"
చ్. "సీమాంధ్రులు స్వార్థపరులు"
ద్. "దేశభక్తి...రాష్ట్రభక్తి కించిత్తైనా లేని ఈ ఆంధ్రవాళ్ళు "తెలుగుతల్లి" అని ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు"
ఎ. "వీళ్ళను మన తెలంగాణులు బలవంతంగా "ఆంధ్రా గో బ్యాక్" అని తరిమేదాకా పోరు. సిగ్గు శరం ఏమైనా ఉంటే పోయేవాళ్ళే గదా"

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి YJs! అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టు...ప్రశ్నించడానికి మీరు లాయరూకారు...జవాబివ్వడానికి నేను ముద్దాయినీ కాను. పనుల ఒత్తిడివల్ల నేను వ్యాఖ్యల జోలికి వెళ్ళలేదు. అంతమాత్రాన కొండవీటి చాంతాడంత ప్రశ్నావళిని నాపై సంధించడం ఏం బాగాలేదు. మీ ప్రశ్నలకు సమాధానాలు నా టపాలలో...నా వ్యాఖ్యలలో దొరుకుతాయి...ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది లేదని... సమాధానం ఇవ్వద్దనుకున్నా...కానీ...మనస్సు మార్చుకుని రాస్తున్నాను.

1. ఆంధ్రా విద్యాసంస్థల్లో చదివీ గ్రూప్ వన్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో తెలంగాణులు కావడం మూలాన ఉపేక్షకు గురై ఉద్యోగాలు రాక నిరాశ చెందినవాళ్ళు కోకొల్లలు! కార్యాలయాల్లో అధికారులు సీమాంధ్రకు చెందినవాళ్ళు చూపిన పక్షపాతం అంతా ఇంతా కాదు. ఇది జగమెరిగిన సత్యం. (సీమాంధుల్లోనే తెలివైనవాళ్ళు ఉంటారుగానీ, తెలంగాణులలో ఉండరా?)

2. కేసీఆర్ గారిని కచరా అని సంబోధించడంలోనే మీ కుటిలత...అపహాస్యం...బహిర్గతమవుతోంది! అయినా ఆయనను అడగవలసిన ప్రశ్న నన్ను అడగడం ఏమిటి? నేను ఆయననే సమర్థిస్తాను. ఎందుకంటే, ఇక్కడ శ్రీకాంతచారి మరణం తర్వాత ఆయన ఆత్మహత్యలు జరగకూడదని సోనియాతో...తెలంగాణ ఇస్తే వెంటనే టీఆరెస్‍ను విలీనంచేస్తానన్నారు. అయినా సోనియా పెడచెవినిబెట్టారు. ఫలితం...1200మంది అమరవీరుల బలిదానం! తీరిగ్గా ఎన్నికలను పురస్కరించుకొని గత్యంతరం లేక సోనియా తెలంగాణను ప్రకటించింది. మరి మా అమరవీరులను బ్రతికించి ఇవ్వగలదా? అడిగినప్పుడు తెలంగాణ ఇవ్వక...గతజలసేతుబంధనం లాగా...ఇప్పుడివ్వడంవల్ల అమరవీరులు బతికి వస్తారా?
ఆయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు...కానీ మా తెలంగాణులు బంగారు తెలంగాణ సాధన ఆయన వల్లనే సాధ్యమవుతుందని...ఆయననే ముఖ్యమంత్రి కావాలన్నారు...మరోసారి దళితుడిని ముఖ్యమంత్రిని చేయమన్నారు. ఇది మా సమస్య...మీకేంబాధ?

3. ఇది న్యాయంగా (స్థానికత ఆధారంగా) ఉద్యోగాల్లో చేరినవాళ్ళుగాక అక్రమార్కులనుద్దేశించి ఎక్కడివాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేయాలన్నాను. దీనిలో అభ్యంతరమేమున్నది?అక్రమార్కులు పంపివేయబడతారు...నిజమైన స్థానికులు ఇక్కడే ఉంటారు...ఇంతమాత్రానికే ప్రపంచంలోని ఉద్యోగాలమాట ఎందుకు?

4. ఈ బ్లాగులో మీ సీమాంధ్రులు మా తెలంగాణుల్ని ... ఎంత హేళనగా..నీచంగా అన్నారో మీకేమెరుక? ...తెలబాన్‍లు, సోమరిపోతులు, తాగుబోతులు, చదువులేనివాళ్ళు, భాషరానివాళ్ళు, తెలివిలేనివాళ్ళు, ఏడుపుగొట్టువాళ్ళు, సిగ్గులేనివాళ్ళు(మొదటి వ్యాఖ్య చూడండి)...ఇలా...మమ్మల్ని అనవచ్చుగానీ మేము మిమ్మల్ని ఏమీ అనవద్దా? అయినా సీమాంధ్ర ప్రజలను నేను ఏమీ అనలేదే?వాళ్ళు మా సోదరులు. నేను సీమాంధ్ర అక్రమార్కులనూ, దగాకోర్లనూ, దోపిడీదార్లనూ అన్నాను.

ఇన్ని మాటలెందుకు? మీరు మమ్మల్ని ఇన్ని విధాలుగా హీనపరచవచ్చు గానీ...మేము మాత్రం మిమ్మల్ని ఏమీ అనవద్దు! మమ్మల్ని మీరు అమర్యాదకు గురిచేయవచ్చు, మర్యాద నేర్పవచ్చు గానీ ...మీరు మాకు మాత్రం మర్యాద ఇవ్వరు...ఇదండీ మీ నీతి! పోనీండి పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కారు అని సరిపెట్టుకుంటాం.

మళ్ళీ చెబుతున్నా...అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అని...మళ్ళీ మళ్ళీ ప్రశ్నలతో రాకండి. మర్యాద ఇవ్వనివాళ్ళకు మర్యాద చేయడం తగనిపని! మంచి ఉద్దేశ్యంతో వస్తే స్వాగతిస్తా...దురుద్దేశంతో వస్తే...తిరస్కారమే! స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి