విద్యుద్భవనమ్మును విభ
జించుటలో కుట్రలేల?
ఒకటే అంతస్తున ఈ
కార్యాలయ ద్వయమ్మేల?
మరల తెలంగాణుల నట
అమాయకులజేసి దోచు
కుట్ర లింక సాగుకొఱకు
ఒకటే చోటను ఉందురె?
రెంటికి కార్యాలయములు
వేరువేరుగానుండిన
గొడవలేవి రాకుండును!
సఖ్యత పెనుపొందగలదు!!
అట్లు కాక కావలెనని
ఒకే భవనమందు రెండు
కార్యాలయముల నేర్పా
టును చేయగ బూనుటేల?
కలిసియుండి దుఃఖమంది
తిమి! ఇప్పుడు విడిగ నుండి
సుఖముల బొందెదమంచును
జూడ, ఇట్టి అశుభమేల?
ఇంకా సీమాంధ్ర కుట్ర
లన్ని మరల మరల చేయ,
మోసపోవుటకు మనమిట
చెవిపువ్వుతొ వున్నామా?
మూటముల్లె సర్దుకొనియు
పోవునట్టి తరుణంలో,
ఇంకా ద్రోహము చేయుట
సీమాంధ్రుల నైజమయ్య!
వారు మంచి వారు అగుచొ
వేరు వేరు కార్యాలయ
ముల కోరగ వలయునయ్య!
ఒకేచోటు కోరనేల?
ఒకేచోట రెండు ఉన్న
ముందు ముందు పాలనపర
మైనవి అగు ఇబ్బందులు
కలుగుననుచు వద్దంటిమి!
పాలన పరమైన దొసగు
లేవి యైన ఎదురైనచొ,
రెండు రాష్ట్రములకు వైర
మేర్పడునయ, కాన, వద్దు!
విద్యుత్ సౌధలొ తెలగా
ణులె వుందురు! ఎర్రగడ్డ
లోనను ఏర్పాటు జేయు
చోటను సీమాంధ్రులుండ్రు!!
ఇంకా సీమాంధ్ర పెత్త
నమ్మే కొనసాగుకొరకు
కుట్రచేయ, సాగనీయ
మయ్యమేము ఈ రోజున!
ఎవరి దారి లోన వారు
ఉండినచో శాంతి గలుగు!
ఒకేచోట ఉండి కుట్ర
చేయ, లడాయిలు పుట్టును!!
కావున విభజనకమిటీ
ఇప్పుడు ఆంధ్రులు జేసెడి
కుట్రల ఛేదించి, వార్ని
వేరే చోటకు పంపుడు!
*** *** *** ***
ఇదే అంశంపై మరింత సమాచారానికై:
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతొ...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి