-విభజన ప్రక్రియ తాబేటి నడక
-ఆరునెలల వాయిదాకు అధికారుల స్కెచ్
-అడ్డగోలు ఆటంకాలతో ఎడతెగని జాప్యం
-ఇదంతా చేయడం మన ఆదాయ మార్గాలను కొల్లగొట్టేందుకే..
రాష్ట్ర విభజన ప్రక్రియకు సీమాంధ్ర అధికారులు మోకాలడ్డుతున్నారు. ఆదాయ మార్గాలు అధికంగా ఉన్న సంస్థలను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అడుగడుగునా ప్రక్రియకు అడ్డుపడుతున్నారు. ఆయా సంస్థల లెక్కలు తీస్తే ఇన్నేళ్ల వివక్ష ఎక్కడ బయట పడుతుందోనన్న భయం ఒక కారణం కాగా.. అప్పనంగా వస్తున్న ఆదాయానికి భారీ గండి పడుతుందన్న భయం మరోవైపు వారిలో కనిపిస్తున్నది.
దీనికితోడు దశాబ్దాలుగా జీతం, గీతం వచ్చే కొలువుల్లో తిష్ఠ వేసిన అధికారులు ఆఖరి ఘడియలోనూ వీలైనంత వెనుకేసుకోవచ్చునని కుట్రలు సాగిస్తున్నారు. ఓ ఆర్నెళ్లపాటు విభజన ఆపగలిగినా రూ.కోట్లు కూడబెట్టుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రధానంగా ఏపీఐఐసీ మొదలు కొని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై సీమాంధ్ర ఉన్నతాధికారులు పెత్తనాలు చెలాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌజ్ కార్పొరేషన్(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ)ను విభజించేందుకు సీమాంధ్ర అధికారులు ససేమిరా అంటున్నారు.
అన్ని శాఖల్లో విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్నా ఇక్కడ మాత్రం ఇంకా మొదలే కాలేదు. లెక్కలు పూర్తి కాలేదంటూ మరో ఆర్నెళ్లు ఇక్కడే తిష్ఠ వేసేందుకు సీమాంధ్రులు వ్యూహరచనలు చేస్తున్నారని సమాచారం. దీని కోసం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మొదలుకొని ఉన్నతాధికారులంతా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేపట్టారు. సెంట్రల్ వేర్‌హౌజ్ కార్పొరేషన్‌కు 50 శాతం వాటా ఉన్నందున అక్కడి నుంచి అనుమతులు రావాలంటూ పేచీ పెడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన తెలంగాణ ఉద్యోగులను ఉన్నతాధికారులు కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నీ అక్కడే...
ఇక ఈ సంస్థ నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే 78 శాతం గోడౌన్లు సీమాంధ్రలోనే కట్టేసుకున్నారు. ఇందులో ఎక్కువగా 1985 తర్వాత టీడీపీ హయాంలో నిర్మించినవే కావడం గమనార్హం. ఇరుప్రాంతాల్లోనూ సమాన ప్రాతిపదికన నిర్మించలేదని లెక్కలే చెబుతున్నాయి. విభజన ప్రక్రియ నిజాయితీగా కొనసాగిస్తే తెలంగాణకు సింహభాగం ఆంధ్రా నుంచి రావాల్సి ఉంటుంది. అలాకాక ఏ ప్రాంతంలో ఉన్న గోడౌన్లను ఆ రాష్ట్రానికే కేటాయిస్తే తెలంగాణకు తీరని నష్టం కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన గోడౌన్లు కనుక మార్కెట్ విలువ ప్రకారమైనా చేస్తే సీమాంధ్ర నికర ఆదాయం నుంచి తెలంగాణకు వాటా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.
వీరిది మధ్యప్రదేశ్ బాట..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సాగుతోంది. దాని కోసం కొన్ని విధివిధానాలను రూపొందించారు. కానీ ఏపీ వేర్‌హౌజ్ కార్పొరేషన్‌లో మాత్రం ఈ ప్రాతిపదికను పాటించకుండా సీమాంధ్రులకు మేలు చేసే విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర విభజన విధానాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడ బుక్ వ్యాల్యూ ప్రకారం(పాత ధరలు) విభజన లెక్కలు తీశారు. ఇక్కడా దాన్ని పాటించాలని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర విభజనలో సర్వత్రా మార్కెట్ విలువ, జనాభా ప్రాతిపదికన పంపిణీ కార్యక్రమం చేపడుతుండగా...ఇక్కడ భిన్నమైన మార్గాన్ని పాటించాలని ఒత్తిడి తెస్తున్నారు.
సంస్థకు సంబంధించిన ఆస్తులు, ఆదాయం వంటి వివరాలన్నీ లెక్క తీసి విభజించే పనిని కేపీఎంజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు ఏప్రిల్ 26న అప్పగించారు. సదరు సంస్థకు రూ.13.50 లక్షలు కూడా చెల్లించి డీమెర్జర్ ప్లాన్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ ప్రతినిధులు కార్యాలయానికి పలుమార్లు వచ్చినా వీరు వివరాలు ఇవ్వకుండా తిప్పి పంపిస్తున్నారు. దాంతో విభజన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సంస్థ ఉన్నతాధికారులు ఢిల్లీలోని సెంట్రల్ వేర్‌హౌజ్ కార్పొరేషన్‌కు లేఖల మీద లేఖలు రాస్తూ జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలను కూడా చక్కదిద్దుకునేందుకు గడువును సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారని సమాచారం.
ఇందుకేనా?..
గిడ్డంగుల సంస్థకు నికర ఆదాయ మార్గాలు అనేకం ఉన్నాయి. ఏటా రూ.140 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. దాంతో పాటు రిజర్వ్ ఫండ్ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంది. భారత ఆహార సంస్థ నుంచి వేర్‌హౌజ్ కార్పొరేషన్‌కు రూ.150 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పుడే విభజన చేపడితే వీటిలో నుంచి తెలంగాణకు కచ్చితంగా నిజాయితీగా 42 శాతం పంచి ఇవ్వాల్సి వస్తుంది. దానికితోడు ఇపుడు అనేక గోడౌన్ల నిర్మాణాలు సీమాంధ్రలో ఉన్నాయి. విభజనను వాయిదా వేయిస్తే వాటిని ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేయించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇందుకోసం తాజాగా శ్రీకాకుళంలో 50 వేల టన్నుల సామర్థ్యం గల ఐదు గోడౌన్ల నిర్మాణ ప్రతిపాదన త్వరలోనే నిర్వహించబోయే బోర్డు సమావేశంలో ప్రవేశ పెట్టి ఆమోద ముద్ర వేయించుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.
విభజన వేళ ఈప్రతిపాదనలేమిటని అడిగిన తెలంగాణ ఉద్యోగులపై ఇతర కారణాలు సాకుగా చూపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిసింది. తెలంగాణకు చెందిన జనరల్ మేనేజర్లు పని చేస్తోన్న ప్రాంతాల్లో మేనేజింగ్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీల పేరిట వేధింపులకు దిగి భయాందోళనకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా అపాయింటెడ్ డేట్‌లోపే విభజనను పూర్తి చేయాలని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
సీమాంధ్ర అక్రమార్కుల ఆగడాలు అన్నీ...ఇన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయించాలి...
అప్పుడుగానీ...వీళ్ళ తిక్కకుదరదు...మన తెలంగాణులకు న్యాయంజరగదు!
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
ఒక పనికిరాని వెధవ తెలబాన్ధ్రుడు మన తెలంగాణుల్ని తాగుబోతులంటున్నాడు...మొన్న సాక్షిలో ఋజువయింది...ఎవరు తాగుబోతులో! అలాగే మీ సీమాంధ్రులే మా ఉద్యోగాల్ని కొల్లగొట్టి పరాన్నభుక్కులై సోమరిపోతులై పందుల్లా మా జీతాల్ని మెక్కారు...అనే విషయం తెలియకుంటే వాడు వెధవల్లోకెల్లా వెధవే! మళ్ళీ మన బ్లాగుల్లోకి వచ్చి ఏడుస్తున్నాడు...తిన్నదరగక సోంబేరి వెధవ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి