గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 23, 2014

ఎక్కడివారు...అక్కడే?


-యథాతథంగా జోనల్, మల్టీ జోనల్, జిల్లాస్థాయి అధికారులు
-చక్రం తిప్పుతున్న కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి
-తెలంగాణలో సీమాంధ్ర ఉన్నతోద్యోగులు 4 వేలకుపైగానే..
-సీమాంధ్రలో వెయ్యిలోపే తెలంగాణవాళ్లు
-పోస్టుల ప్రాతిపదికపై విభజన జరపాలని టీ ఉద్యోగ సంఘాల డిమాండ్

ఉద్యోగుల విభజన విషయాన్ని క్లిష్టతరం చేసేలా మార్గదర్శకాలు రూపొందించడంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. జోనల్, మల్టీ జోనల్, జిల్లా స్థాయి పోస్టులన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. పోస్టుల ప్రాతిపదికన విభజన జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ అధికారులను, తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర అధికారులను ఎక్కడివారిని అక్కడే కొనసాగించాలన్న నిబంధన ఇప్పుడు విభజన ప్రక్రియలోని పారదర్శకతకు గండి కొడుతున్నది. 

ఒకవైపు సచివాలయంలోని ఆర్థిక శాఖ సెక్రటరీలు.. మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని సీమాంధ్రకు చెందిన మరో అధికారి మార్గదర్శకాలను సీమాంధ్రకు అనుకూలంగా మలచడంతో పరిస్థితి అడ్డగోలుగా మారింది. సీమాంధ్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా ఇటు ఆర్థికశాఖ అధికారులు.. అటు కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని ఓ అధికారి చక్రం తిప్పినట్టు సమాచారం. అందుకే ఈ మార్గదర్శకాలను ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్ తిరస్కరించారని విశ్వసనీయంగా తెలిసింది. విభజన ప్రక్రియలో ఉద్యోగుల కేటాయింపు అత్యవసరం కావటంతో.. హోం శాఖలోని సదరు ఉన్నతాధికారి నోటి మాటగా చేసిన సూచనలనే.. ప్రామాణికంగా తీసుకుని పంపకాలు చేపడుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం.. జోనల్, జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి విభజన జరగటం లేదు. దీంతో ఈ పరిధిలోని అధికారులు ఎక్కడివారక్కడే కొనసాగే ప్రమాదం కనిపిస్తున్నది. నాలుగువేల మందికిపైగా సీమాంధ్ర అధికారులు తెలంగాణలో పని చేస్తుండగా.. తెలంగాణవాళ్లు వెయ్యిలోపే సీమాంధ్రలో ఉన్నట్టు సమాచారం. ఏ ప్రాంతంవారిని ఆ ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉన్నా చట్టంలో ఈ మేరకు మార్పులు చేయకపోవటం వల్ల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి పోస్టులకు తోడు జిల్లా స్థాయిలోని అధికారుల పోస్టుల్లోనూ సీమాంధ్రులే కొనసాగే అవకాశం ఉంది. ఎక్కడి వారక్కడే నిబంధన వల్ల ఈ దుస్థితి ఏర్పడుతున్నది.

జిల్లాస్థాయి ఉన్నతాధికారులైన జిల్లా రిజిస్ట్రార్, పంచాయతీ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా విద్యాశాఖాధికారి, సాంఘిక సంక్షేమ అధికారులు, ట్రెజరీ, వ్యవసాయశాఖ, కమర్షియల్ టాక్స్, ట్రాన్స్‌పోర్ట్‌లోని అధికారులెవరినీ కదిలించటం లేదు. రాష్ట్రంలో ఎక్కువశాతం మంది ఉన్నతస్థాయి అధికారుల్లో సీమాంధ్రులే ఉండటంతో పరిపాలనా పరంగా చిక్కులు వస్తాయని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను వీరు తూ.చ. తప్పకుండా పాటించాల్సి ఉన్నా.. ఏదో విధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు మందకొడిగా సాగించేందుకే ప్రయత్నించే ప్రమాదం లేకపోలేదని టీ ఉద్యోగులు అనుకుంటున్నారు. తన కింద పనిచేసే తెలంగాణ ఉద్యోగులను వేధించడంతోపాటు సర్వీస్ బుక్కులను తారుమారు చేస్తామని భయపెట్టే ప్రమాదముందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

పరస్పర ఒప్పందంతోనే సమస్యకు పరిష్కారం
ఈ లోటుపాట్లను తక్షణమే సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అవకాశం లేదు. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు చర్చించి ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ర్టానికి కేటాయించేలా పరస్పరం ఒప్పందం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. కీలక పోస్టుల్లోని అధికారులను సొంత రాష్ట్రాలకు పంపిస్తేనే పాలనాపరంగా ఇబ్బందులు ఉండవని టీ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

పోస్టుల ఆధారంగానే పంపిణీ చేపట్టాలి..
ప్రస్తుత విభజన ప్రక్రియ మొత్తం సచివాలయం, హెచ్‌వోడీలు, ఇతర రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే జరుగుతున్నది. వీటిల్లోనూ ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు సీమాంధ్ర ఉద్యోగులకు లబ్ధి జరిగేలా వ్యవహరిస్తుండటం వల్ల పరిస్థితి కిష్టంగా మారింది. ఉదాహరణకు మంజూరైన పోస్టులు 20 ఉంటే వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు జరగాలి. అయితే, ప్రస్తుతం ఆ క్యాడర్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కాకుండా ఎంతమంది ఉన్నారనే ప్రాతిపదికపై లెక్కలు తయారు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ క్యాడర్ వారందరికీ ఈ ప్రాంతంలోనే పోస్టింగ్ లభిస్తుంది.

విభజన ప్రక్రియలోనూ వారిని తెలంగాణకే కేటాయిస్తారు. అలా కాకుండా ఆ క్యాడర్‌లో ఉన్న ఇరు ప్రాంతాల ఉద్యోగులను విభజించటం వల్ల ఎక్కువ సంఖ్యలో ఉన్న సీమాంధ్రుల్లో కొంతమందిని తెలంగాణ క్యాడర్‌కు అంటగడుతున్నారు. దీనిని తెలంగాణ ఉద్యోగులు వ్యతిరేకిస్తూ పోస్టుల ఆధారంగానే నిర్ణీత దామాషా ప్రకారం కేటాయింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

సీమాంధ్ర అక్రమార్కుల ఆగడాలు అన్నీ...ఇన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయించాలి...
అప్పుడుగానీ...వీళ్ళ తిక్కకుదరదు...మన తెలంగాణులకు న్యాయంజరగదు!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

For100 employees, assume that they are to be distributed as 52 and 48 to AP and T states.
If actual count is 60 they are distributed as 31 and 29. You feel this is improper.
You want 48 of 60 to be allocated to T state,
Then by the same token please distribute 52 out of this 60 to AP state also.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఈ లెక్కలన్నీ ఆంధ్రప్రదేశ్‍లో తెలంగాణ కలిసి ఉన్నప్పుడు వర్తిస్తాయి. ఇప్పుడు ఎవరి రాష్ట్రం వారిదే...కాబట్టి...ఎవరి రాష్ట్రంలో వారే పనిచేయాలి...అలాగే పెన్షనర్లు కూడా ఎవరి రాష్ట్రంలో వారు తీసుకోవాలి. ఇక రాష్ట్ర సంబంధమైన పోస్టుల్లో...ఇతర రాష్ట్రాలవారికి ఎలాంటి హక్కులుంటాయో...సీమాంధ్రులకుగానీ, తెలంగాణులకుగానీ అలాంటి హక్కులే ఉంటాయి. విశాల దృక్పథంతో చూడాలి. ఇంకా తెలంగాణులను వంచించే ఆలోచనల్లో వుంటే...తెలంగాణులెవ్వరూ సహించరు...ఆంధ్రా గో బ్యాక్....అంటారు...! మసి పూసి మారేడుకాయను నేరేడుకాయగా మార్చారు సీమాంధ్రులు...తెలంగాణులు అమాయకులుగా వున్న ఆ రోజుల్లో...! ఇప్పుడు ఆ పప్పులేవీ ఉడకవు. జై తెలంగాణ!

Jai Gottimukkala చెప్పారు...

I am surprised why Andhra employees want to work in Telangana, a state whose formation they opposed. Should they not loyally serve their own state and help its development at this crucial time?

It is particularly nauseating that non-employee Andhras support the disloyalty of the employees.

The so called samaikhya movement by Andhra NGO's was motivated by selfish interests. Ordinary Andhras should realize this atleast now.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సీమాంధ్రులు స్వార్థపరులు! తమ స్వార్థం కోసమే సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం లేవనెత్తారు. తేరగా తెలంగాణలో ఉద్యోగాలు తమ నేతలు ఇప్పిస్తుంటే వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? బంగారు గుడ్లుపెట్టే బాతు ఈ హైదరాబాద్! దీన్ని వదులుకోవడానికి మనసొప్పడం లేదు. ఎందుకంటే అమాయకులైన తెలంగాణుల్ని మాయచేసి సర్వం కొల్లగొట్టారు. వాటిని ఎలా వదులుకుంటారు? దేశభక్తి...రాష్ట్రభక్తి కించిత్తైనా లేని ఈ ఆంధ్రవాళ్ళు "తెలుగుతల్లి" అని ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. నిజంగా వీళ్ళు రాష్ట్రభక్తిగలవాళ్ళయితే వెంటనే తెలంగాణ వదిలిపెట్టి సీమాంధ్రకు పోవాలి...కాని వీళ్ళు స్వార్థపరులు...పోరుగాక పోరు! వీళ్ళను మన తెలంగాణులు బలవంతంగా "ఆంధ్రా గో బ్యాక్" అని తరిమేదాకా పోరు. సిగ్గు శరం ఏమైనా ఉంటే పోయేవాళ్ళే గదా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి