గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 24, 2014

తల్లి ఎవరు? బిడ్డ ఎవరు?


మోడీ పలికెడి చిలుకల
పలుకులు చంద్రబాబువే!
తల్లి, కొడుకు, తండ్రి, బిడ్డ
లాంటి మాటలాయనవే!!

టీడీపీ ఆంధ్రపార్టి;
చంద్రబాబు మోసకాడు;
ఇట్టి పార్టి పొత్తుగొనియు
మోడీయే తప్పు చేసె!

ఈ మోడీ కేం తెలుసని
తెలంగాణపై వ్యాఖ్యలు
చేస్తూ, అసమంజసమగు
మాటలిపుడు పలుకుచుండె?

కాంగ్రెస్ నుద్దేశించియు
"తల్లిని జంపియు బిడ్డను
బ్రతికించిరి" యనుట యిపుడు
ఎంతవరకు సమంజసము?

తల్లి ఎవరు? బిడ్డ ఎవరు?
"ఆంధ్రప్రదేశ్" తల్లి అనియు,
"తెలంగాణ" బిడ్డ అనియు
అనుకొనుటయె వెఱ్ఱితనము!

ఆంధ్రప్రదేశ్ పుట్టక మును,
తెలంగాణ ఉన్నదయ్య!
ఆంధ్ర మాత ఒకరగుచో,
తెలంగాణ తల్లి ఒకరు!!

అక్కా చెల్లెండ్ర నిపుడు,
తల్లీబిడ్డలు అనియును
పలుకుటయే వెఱ్ఱివాని
పిఛ్ఛికూతలగునయ్యా!

అయినా ఈ మాటలన్ని
తఱచిచూడ, ఎవరెవరిని
చంపినారు, చచ్చిరెవరు?
అన్నీ కల్పితములయ్య!

మతతత్త్వపు పార్టి పూని,
ఇట్టి మాట లనుట యేల?
బ్రతికియున్న తెలంగాణ
మరల పుట్టు టేమిటయ్య?

తెలంగాణ అనాథయా?
తెలంగాణులంత యుండ,
తెలంగాణ అనాథగా
ఎట్లు అగును మోడిగారు?

బొల్లిబాబు చంద్రబాబు
మాట కలిపి, పొత్తుగూడ,
వాపును గని బలుపనుకొని
వెఱ్ఱికూత కూయవలదు!

తెలంగాణపైన నీవు
ఇట్టి వెఱ్ఱికూతలన్ని
మరల కూయుచో పార్టియె
తెలగాణలొ చావగలదు!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఒక భాషను తల్లిగా కొలిచే కుసంస్కారం ప్రపంచంలో ఎక్కడా లేదు. "తెలుగు తల్లి" అనే కాన్సెప్తును చెత్తబుట్టిలో పడేయాలి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇది సీమాంధ్రుల పేటెంటు హక్కు! ప్రపంచంలోనే లేని హక్కు! వీళ్ళకు తోడుగా తమిళ తల్లి, కన్నడ తల్లి, మళయాళ తల్లి, వీటికి తోడుగా హిందీ తల్లి, మరాఠీ తల్లి, గుజరాతీ తల్లి, రాజస్థానీ తల్లులు రావాలి కాబోలు! తల్లుల రాజ్యం వస్తుందేమో! మనం మన తెలంగాణ భూభాగాన్నీ తెలంగాణ తల్లిగా కొలుస్తున్నాము...జన్మభూమిని జననితో పోలుస్తున్నాము! వాళ్ళు భాషను తల్లిగా పోలుస్తున్నారు. వ్యతిరేక మనస్తత్వం...ద్రావిడ దనుజ గుణాలు... దానవ గుణాలు...దైత్య గుణాలు ఎక్కడికి పోతాయి మరి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి