తెలంగాణలోన పుట్టి
పెరిగినట్టివారెనయ్య
ప్రాంతీయులు! ఇతరులు ప్రాం
తీయులెట్లు అగుదురయ్య?
తండ్రితాతలును ఇచ్చట
పుట్టిపెరిగినట్టివారె
ప్రాంతీయులు! ఇతరులు ప్రాం
తీయులెట్లు అగుదురయ్య?
ఇచట పుట్టినంతమాత్ర
మున ప్రాంతీయులును కారు!
తండ్రితాతలును పుట్టిన
ప్రాంతీయులె, ప్రాంతీయులు!
"ఈ ప్రాంతమునందె నేను
ఉద్యోగము పొందితి"నని.
"నేనీ ప్రాంతీయుడ"నని
పలుక...ధ్రువీకరించుడయ!
ఏ ప్రాంతమునందు చేరె?
దాని కతని కర్హ తుంద?
నియామకపు ఖాళిలన్ని
నిష్పత్తిలొ వున్నాయా?
అతిక్రమింపబడ్డాయా?
తెలగాణుల ప్రక్కనిడియు
అక్రమముగ వచ్చాడా?
సక్రమమా, తేల్చవలయు!
అరవై ఏడులనుండియు
తెలగాణలొ నియమించిన
ఆంధ్రవారి నియామకాల్
సక్రమమా, అక్రమమా?
పై ప్రశ్నల సంధించియు
అన్నియు సక్రమమగుచో
ఉండనిండు అప్పుడతని!
లేనిచొ ఆంధ్రకు పంపుడు!!
ప్రతి రిక్రూట్‍మెంటుపైన
సమగ్రముగ దర్యాప్తును
జరిపించిన తేలగలదు,
సక్రమమో, అక్రమమో!
తెలగాణుల నమాయకుల
జేసి కొల్లగొట్టినట్టి
ఉద్యోగాల్ చేయువార్ని
తక్షణమే పంపించుడు!
తెలగాణులె తెలగాణలొ
ఉద్యోగాల్ చేయవలెను!
కేంద్రపు ఉద్యోగులైన
చో లెక్కకు రారు వారు!!
విభజనమ్ము జరుగునపుడు
తెలగాణులు లేకుంటే
కొత్త నియామకాల్ జరిపి
తెలగాణునె నియమింపుడు!
తెలంగాణ కార్యాలయ
ములలోపల ఆంధ్రవారు
ఎట్లు పనులు చేతురయ్య?
వలదు వలదు ఆంధ్రవారు!
తెలంగాణ ప్రాంతీయులె
తెలగాణలొ ఉద్యోగాల్
చేయునట్లు విభజింపుడు
న్యాయమ్మును పాటింపుడు!
ఆంధ్రవారు లాబీయింగ్
చేయగాను లొంగితిరా,
ఉద్యమమ్ము నడువగలదు,
నిజం నిగ్గు తేలగలదు!
తప్పు ధ్రువీకరణమ్ములు
ఎవ్వరైన జూపిరేని
సమగ్రముగ దర్యాప్తును
జరిపించియు తేల్చగలరు!
అక్రమాలు ఋజువైనచొ
ఉద్యోగాల్ లాగికొనియు,
మరల మరల జేయకుండ
కఠినముగా శిక్షింపుడు!
వారలట్లె ఉందురన్న,
ఒక్కపనిని చేయుడయ్య!
వారలెట్లొ మేము అట్లె,
ఉద్యోగాల్ చేయవలెను!
వారలెంత మంది కలరొ,
అందఱ తెలగాణుల నట
సీమాంధ్రలొ ఉద్యోగము
లందున నియమింపుడయ్య!
ఇట్లు చేయ సక్రమమగు!
ఒప్పుకొననిచో మేమును
ఉద్యోగాలిచట వార్ని
ఎట్లు చేయనిత్తుమయ్య?
అవ్వ మీకె కావలయును,
బువ్వ మీకె కావలయునె?
మేము చెవిని కాలిఫ్లవర్
పెట్టుకొనియు చూడవలెనె?
ఎచటివారు అచ్చటనే
ఉద్యోగాల్ చేయవలయు!
ఒప్పుకొననిచో మేమును
ఒప్పుకొనము, ఒప్పుకొనము!
ఆంధ్రులందఱిని ఆంధ్రకె
తెలగాణుల తెలగాణకె
పంపింపుడు, నియమింపుడు!
అంతెగాని వేరుకారు!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి