గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 04, 2014

పోలవరాన్ని..."పోల్"...వరంగా...మార్చకండి!


ఎన్నికల స్టంటునను ఎన్నియొ
తీర్చ సాధ్యము కాని వరముల
నిచ్చి ప్రజలను మోసగించుట
కూడదోయయ్యా!

పోలవర నిర్మాణమందున
కోలుపోయెడు బ్రతుకు లెన్నో?
గిరిజనమ్ములు మనుజులవలె
కానబడలేదా?

ఓట్లకోసము గిరిజనములను
పావులనుగా మార్చి చేసెడి
పోలవర నిర్మాణ మిప్పుడు
చెరుపునకెయయ్యా!

జన్మభూమికి దూరముగ గిరి
జనుల నంపుట దురన్యాయము!
వారి మనమున నేమియున్నదొ
తెలిసికొనుడయ్యా!

భద్ర"గిరి"జనములను ముంచియు
కట్టబోయెడి యానకట్టను
రూపుమారిచి కట్టుచో ఇక
కష్టములు తొలగున్!

ఎవరికిని ఏ ముప్పు కలుగక
సర్వులకు ఇక సంతసమ్మిడు
పనులు చేయుట ప్రభుత కృతమని
తెలిసికొనుడయ్యా!

***     ***     ***     ***

ఇదే అంశంపై నేను రాసిన టపాలు:
(చూడదలచిన టపాపై క్లిక్ చేయండి)
జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి