ఈ టపాను నేను గతంలో దివి: 08-03-2014 నాడు...సీమాంధ్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడనీయకుండా ఉండడానికి సుప్రీంకోర్టుకెక్కారు. అయినా సుప్రీంకోర్టు సీమాంధ్రుల కోరికను మన్నించకుండా, కనీసం స్టేకూడా ఇవ్వకుండా, తెలంగాణకు అడ్డుపడకుండా పెద్ద చెంపపెట్టుపెట్టింది. అందుకని నాటి టపా మళ్ళీ ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మన తెలంగాణకు అడ్డుపడే శక్తి ఏదీ లేదు. ఆనాడు మనం ఎంత అడలిపోయామో, ఎంత ఆవేదనచెందామో...ఇప్పుడు అంత హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం.
సీమాంధ్రులు అక్రమముగ
తెలంగాణ నోరునొక్కి,
లాబిచేసి,పొత్తుగూడి,
అరువదేండ్లు దోచుకొనిరి!
ఉద్యమములు, ధర్నాలతొ,
ధూంధాంలతొ, సమ్మెలతో
తెలగాణులు పోరాడగ
కేంద్రమ్మే దిగివచ్చెను!
తెలంగాణ నోరునొక్కి,
లాబిచేసి,పొత్తుగూడి,
అరువదేండ్లు దోచుకొనిరి!
ఉద్యమములు, ధర్నాలతొ,
ధూంధాంలతొ, సమ్మెలతో
తెలగాణులు పోరాడగ
కేంద్రమ్మే దిగివచ్చెను!
వేరురాష్ట్ర మేర్పడుటయె
న్యాయమనుచు కేంద్రమ్మే
రాష్ట్రమిడగ, సీమాంధ్రులు
న్యాయస్థానముకెక్కిరి!
న్యాయమ్మే తెలంగాణ
పక్షమ్మున నుండగాను,
అన్యాయము చేయుకొరకు
కోర్టుకెక్క, కోర్టు తన్నె!
అభియోగములేవియున్న
కేంద్రము వివరింపవలెను!
వివరణ పరిశీలించియు
విచారణము చేయుదుమనె!!
కేంద్ర వివరణమ్ము పిదప,
అవసరమని భావించుచొ,
రాజ్యాంగ ధర్మాసనముకు
బదిలీ చేయుదు మనియెను!
సీమాంధ్రులు ఎన్ని నాట
కములాడిన, స్టే కోరిన,
సరకు గొనక, స్టేను ఇడక,
ఆగస్టుకు వాయిదిడెను!
న్యాయబద్ధమైన తెలం
గాణ రాష్ట్రమును ఎవ్వరు
ఆపలేరు, ఆపలేరు!
కుట్రలన్ని కూలిపోవు!!
ఆఖరి బాల్, బ్రహ్మాస్త్రము,
కొత్తపార్టి పిచ్చికూత,
తెలంగాణ రాష్ట్రమ్మును
ఆపలేవు, ఆపలేవు!
న్యాయమ్మీ తెలంగాణ,
ధర్మమ్మీ తెలంగాణ,
సత్యమ్మీ తెలంగాణ!
తెలంగాణ విజయమిదే!!
*** *** *** ***
విభజనపై స్టేకు
సుప్రీం ఏమన్నదో
తెలుసుకోవడానికై..
దీనిపై క్లిక్ చేయండి
*** *** *** ***
విభజనపై స్టేకు
సుప్రీం ఏమన్నదో
తెలుసుకోవడానికై..
దీనిపై క్లిక్ చేయండి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి